Hyd, July 27: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో మూసి నది (Evacuation begins near Musi river) ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో, హైదరాబాద్‌లోని మూసారంబాగ్ బ్రిడ్డి వరద నీటిలో మునిగిపోయింది. ఇక, చాదర్‌ఘాట్‌లో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరి కాలనీలు నీటమునిగాయి. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
కాగా, ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో, వాహనదారులను అలర్ట్ చేస్తూ వేరే రూట్స్‌లో వెళ్లాలని సూచించారు. ఇదిలా ఉండగా.. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలకు వరద పోటెత్తింది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ 12 గేట్లు, ఉస్మాన్ సాగర్ 8 గేట్లు ఎత్తారు. ఈ క్రమంలో మూసీలోకి వరద పోటెత్తింది.
భారీ వరద ప్రవాహంతో మూసీ నది(Musi river) ఉగ్రరూపం దాల్చింది. జంట జలాశయాలు, హుస్సేన్‌సాగర్‌కు వరద పోటెత్తుతోంది. ఉస్మాన్‌సాగర్ (Osmansagar), హిమాయత్‌సాగర్ (Himayath sagar), హుస్సేన్‌సాగర్ (Hussain sagar)నుంచి భారీగా వరద నీరు మూసీలోకి ప్రవేశిస్తోంది. మూసీ నదిలోకి 21 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. మూసారంబాగ్, చాదర్‌ఘాట్, పురానాపూల్ వంతెనలపై రాకపోకలను నిలిపివేశారు. ఉస్మాన్‌సాగర్ నుంచి 8,281 క్యూసెక్కులు, హిమాయత్‌సాగర్ నుంచి 10,700 క్యూసెక్కులు, హుస్సేన్‌సాగర్ నుంచి 1,789 క్యూసెక్కుల వరద నీరు మూసీలోకి వెళుతోంది.
Here's Musi River Floods Videos
#Flood water flowing over the #Moosarambagh bridge, as #MusiRiver is #overflowing after 12 floodgates of Osmansagar and 8 flood gates of Himayatsagar have been lifted due to heavy inflows.#HyderabadRains #Telanganarains #Telanganafloods #HeavyRains #HyderabadFloods #Hyderabad pic.twitter.com/MjT35xsASU
— Surya Reddy (@jsuryareddy) July 27, 2022
Hyderabad musi river right now 🌊
.#musiriver #HyderabadRains #HyderabadFloods #water #waterbreak @HiHyderabad @KTRTRS pic.twitter.com/pRDg9gBSwY
— Surya Devarakonda (@Heysurya__) July 27, 2022
#MusiRiver overflowing after 6 gates of Himayat sagar and 10 gates of Osmansagar reservoirs lifted, due to heavy inflows.#TelanganaRains #HyderabadRains #Hyderabad #Floods #HeavyRains pic.twitter.com/LATIbLhcwc
— Surya Reddy (@jsuryareddy) July 26, 2022
Musi River comes alive! View of Musi captured today from the top of the High Court. #HyderabadRains #Telanganafloods pic.twitter.com/RkrO1HMMAZ
— Inspired Ashu. (@Apniduniyama) July 27, 2022
భాగ్యనగరంలోని జంట జలాశయాలకు వరద ఉధృతి అధికంగా ఉంది. ఉస్మాన్ సాగర్‌లోకి 8000 క్యూసెక్కులు వరద నీరు వచ్చి చేరుతోంది. సాగర్ అవుట్ ఫ్లో 8281 క్యూసెక్కులుగా ఉంది. దీంతో జలమండలి అధికారులు ఉస్మాన్‌సాగర్ నుంచి 13 గేట్లు 6 ఫీట్ల మేర ఎత్తి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 1789.10 అడుగులకు చేరింది. హిమాయత్ సాగర్‌కు 9000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో హిమాయత్‌సాగర్ 8 గేట్ల ద్వారా మూసీలోకి 10700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. హిమాయత్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులకు గాను... ప్రస్తుతం నీటిమట్టం 1762.45 అడుగులకు చేరింది.