CM KCR at Yoshada Hospital (Photo-ANI)

Hyd, Dec 8: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ నిన్న రాత్రి తన ఫాంహౌస్‌ బాత్రూంలో జారిపడ్డారు. ఆయన కాలికి గాయం కావడంతో ఆర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఆయనను హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. కాగా, కేసీఆర్ తుంటి ఎముకకు గాయమైందని వైద్యులు తెలిపారు. శస్త్రచికిత్స అవసరం అవుతుందని సూచించారు. దీంతో ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు.ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం కేసీఆర్‌ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.

కేసీఆర్ పడిపోయిన విషయం గురించి తెలియగానే కేసీఆర్ కుటుంబసభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలివెళ్లారు. కేటీఆర్, హరీశ్ రావు, కవిత ఆసుపత్రికి వెళ్లి వైద్యులతో చర్చించారు. ప్రస్తుతం కేసీఆర్‌కు వైద్య పరీక్షలు జరుగుతున్నాయి.

కేసీఆర్‌ కు గాయం.. కాలుజారి పడటంతో కాలి ఎముక విరిగినట్లు అనుమానం.. యశోద ఆస్పత్రిలో చికిత్స

శుక్రవారం సాయంత్రం కేసీఆర్‌కు హిప్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జరీ చేయనున్నారు. బీఆర్‌ఎస్‌ సుప్రిమో కేసీఆర్‌ ఆరోగ్యంపై ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా స్పందించారు. కేసీఆర్‌కు స్వల్ప గాయమైందని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు. ఆయన త్వరలోనే కోలుకుంటారని వెల్లడించారు. కేసీఆర్‌పై ప్రజల ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ట్వీట్, ఫాంహౌస్‌ బాత్రూంలో కాలు జారి పడిపోవడంతో గాయం, ప్రస్తుతం నిలకడగా ఆరోగ్యం

Here's KavithaTweet

కేసీఆర్‌ ఆరోగ్యంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) స్పందించారు. కేసీఆర్‌కు గాయమైన విషయం తెలియగానే చాలా బాధపడ్డట్లు ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని, మంచి ఆరోగ్యంతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.