Bandi Sanjay file Photo (Photo/ANI)

Hyd, Jan 19: కరీంనగర్ ఎంపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ తన కాలేజీలో జూనియర్ విద్యార్థులను కొట్టిన ఘటన రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. సోషల్ మీడియాలో దాడికి సంబంధించిన వీడియోలు హల్‌చల్ చేస్తోన్నాయి. ఈ క్రమంలో ఘటనపై బండి సంజయ్ స్పందించారు.

కేసీఆర్ చాలా నీచంగా దిగజారిపోయి, నా కొడుకు కెరీర్‌ను చెడగొట్టాలనే ఉద్దేశంతో (KCR is Stooping Too Low by Dragging in My Son) లాగి పడుతున్నారు. నిన్న బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఐటీ సెల్ రాజకీయ లబ్ధి కోసం, నా ప్రతిష్టను దిగజార్చాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో లీక్ చేసింది. తెలంగాణ మంత్రి కేసీఆర్, ఆయన దోపిడి కుమారుడు నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్నారు’’ అని బండి సంజయ్ (Telangana BJP president) తన కుమారుడు బండి భగీరథ సాయిపై చేసిన ఆరోపణలపై ( Bandi Sanjay Reacts to Viral Video) మండిపడ్డారు.

నా కొడుకు పోలీసుల ముందు లొంగిపోయాడు, కుమారుడు వైరల్ వీడియోపై స్పందించిన బండి సంజయ్, స్టేషన్ బెయిల్ మీద బయటకు వచ్చిన బండి సాయి భగీరత్‌

"ఈ సంఘటన 2 నెలల క్రితం మహీంద్రా యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్‌లో జరిగింది. నా కొడుకు బ్యాచ్ మేట్ ఒక అమ్మాయిని అర్థరాత్రి మెసేజ్‌లు పెట్టి వేధించాడు. ప్రేమించమని బలవంతం చేశాడు. నా కొడుకును తన అన్నగా భావించే అమ్మాయి నా కొడుకుతో ఈ సంఘటనను పంచుకుంది. నా కొడుకుకి బ్యాచ్ మేట్ పంపిన సందేశాలను ఆ అమ్మాయి చూపించింది. దాన్ని సాల్వ్ చేసేందుకే నా కొడుకు అతనిని మందలించాడు అని బండి సంజయ్ తెలిపారు.తరువాత సమస్య సామరస్యపూర్వకంగా పరిష్కరించబడింది. ఇద్దరూ ఇప్పుడు మంచి స్నేహితులు," అని సంజయ్ ఒక ప్రకటనలో తెలిపారు.

బూతులు తిడుతూ విద్యార్థిని చితకబాదిన బండి సంజయ్ కొడుకు, ఘటనలో విద్యార్థికి తీవ్ర గాయాలు, మహీంద్రా యూనివర్సిటీలో ఘటన

నా కొడుకు స్కూల్‌లో అమ్మాయిలను తీసుకెళ్లి ఎప్పుడూ పార్టీ చేయలేదు. డ్యాన్స్‌లు చేయించలేదు. చిన్నపిల్లలను రాజకీయాలకు వాడుకోకూడదని నేను చెప్పా. నాకు మానవత్వం అడ్డు వస్తుంది. నీకు కొంచెమైనా సిగ్గు ఉండాలి. నా కొడుకు లైఫ్ ఖరాబ్ చేశావ్. అయినా నాకు బాధ లేదు. నేను ఆ తల్లిని నమ్ముకున్నా. పాపం ఊరికే పోదు కేసీఆర్.. వెళ్లి నీ భార్య, కొడలిని అడుగు. ఇలా చేయడం కరెక్ట్‌నా? అని. కాలేజీ యాజమాన్యం ప్రోసీజర్ ఫాలో అవ్వలేదు. తప్పు చేస్తే సస్పెండ్ చేయడంలో తప్పు లేదు. కానీ పేరెంట్స్‌ని పిలిచి కౌన్సిలింగ్ చేశారా? అసలు విషయం తెలుసుకున్నారా? ఆ ఘటన ఎప్పుడు జరిగింది? ఇప్పుడు కాలేజీ నడుస్తుందా? కనీసం నోటీసుల ఇచ్చారా?' అని బండి సంజయ్ ప్రశ్నించారు.

తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని కాలేజీ యాజమాన్యానికి తెలియదా? కావాలని నా కొడుకుపై క్రిమినల్ కేసు పెట్టించారు. వారిది చిన్న మనస్సు. రేపు పిల్లలకు ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహించాలి. నా కొడుకు జీవితాన్ని ఖరాబ్ చేసినందుకు కేసీఆర్ పాపం పండుతుంది. నీ సంగతి ఏంటో పక్కా చూస్తా. నా కొడుకుని స్టేషన్‌కు పంపిస్తా.. జైలుకు పంపించినా నేను భరిస్తా. రాష్ట్రంలో ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి. ఒక్క అమ్మాయినైనా కాపాడావా..? నిజాం మనవడి భౌతికకాయాన్ని ఎందుకు తీసుకొస్తున్నావో ముందు చెప్పు.. ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడు. కాలేజీ విద్యార్థులు బాగానే కలిసి ఉన్నారు. నువ్వు రాక్షసానందం పొడుతున్నావు' అని బండి సీరియస్ అయ్యారు.

కేసీఆర్ మనవడి విషయంలో తప్పుడు వ్యాఖ్యలు చేసినప్పుడు నేను ఖండించా. చిన్నపిల్లల జోలికోస్తే నేను ఊరుకోను. చిన్నపిల్లలను రాజకీయాలకు ఊపయోగించుకోవద్దు. కేసీఆర్ మనవడి విషయంలో కొంతమంది కామెంట్ చేస్తే నేను వ్యతిరేకించా. ఎప్పుడో జరిగిన విషయాన్ని ఇప్పుడు తీసుకొచ్చి నా కొడుకుపై కేసు పెట్టారు. పిల్లలు.. పిల్లలు కొట్లాడుకుంటారు. మళ్లీ కలుస్తారు. కేసీఆర్ నీకు ఏం నొప్పి..? ఎవరు కంప్లైంట్ ఇస్తే నా కొడుకుపై కేసు పెట్టించావు..? ఎప్పుడో జరిగిన ఘటనను ఇప్పుడు ఎందుకు బయట పెట్టావు..? ఆ అమ్మాయి లైఫ్‌ను, నా కొడుకు లైఫ్‌ను నాశనం చేయాలని చూస్తున్నావు. మొత్తం ముగ్గురు జీవితాలతో నువ్వు ఆడుకుంటున్నావ్. ఇదేనా నీ రాజకీయం.? వెళ్లి నీళ్లు లేని బావిలో దూకు. పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నావు. నువ్వు అసలు మనిషివేనా? నీకు పిల్లలు లేరా..? కొంచమైనా సిగ్గు ఉండాలి. విద్యార్థుల జీవితాలతో ఆడుకోకు' అని బండి సంజయ్ హెచ్చరించారు.

కాగా బండి సంజయ్ కుమారుడు భగీరథ్ స్నేహితుడు కూడా ఓ వీడియో విడుదల చేస్తూ, "నేను శ్రీరామ్‌ని. నేను టెక్స్ట్ సందేశాల ద్వారా అమ్మాయిని దుర్భాషలాడడంతో భగీరథ్‌తో గొడవ పడ్డాను. అది పూర్తిగా నా తప్పు, మేము తరువాత రాజీ పడ్డాము, ఇప్పుడు మేము మంచి స్నేహితులం" అని చెప్పాడు. తెలిపారు.