Bandi Sanjay (Photo-ANI)

Hyd, Jan 19: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తన కొడుకు కాలేజీలో విద్యార్థిని కొట్టిన వీడియో వైరల్ (Bandi Sanjay's Son Slaps Row) పై స్పందించాడు. నా కొడుకు పోలీసుల ముందు లొంగిపోయాడు (My son has surrendered before the police). నా కొడుకు ఏదైనా తప్పు చేసి ఉంటే (If my son has done anything wrong), అతనిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని (police should take action) కోరారు.

హైదరాబాద్‌లోని మహీంద్రా యూనివర్సిటీ క్యాంపస్‌లో రెండు నెలల క్రితం ఈ ఘటన జరిగింది. నా కొడుకు బ్యాచ్ మేట్ ఓ అమ్మాయిని మెసేజ్ లు పెట్టి వేధించాడు. అతను తన బ్యాచ్‌మేట్‌తో గొడవ పడ్డాడు, అతను తన ఫోన్ నుండి అమ్మాయి నంబర్ తీసుకున్నాడని తెలుసుకున్నాడు.అందుకు నా కొడుకు రియాక్ట్ అయ్యాడని బండి సంజయ్ అన్నారు.

బూతులు తిడుతూ విద్యార్థిని చితకబాదిన బండి సంజయ్ కొడుకు, ఘటనలో విద్యార్థికి తీవ్ర గాయాలు, మహీంద్రా యూనివర్సిటీలో ఘటన

కళాశాల అధికారుల ఫిర్యాదు మేరకు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరత్‌పై కేసు నమోదు అరెస్ట్ చేశారు. బండి సంజయ్ (Bandi Sanjay) కుమారుడు బండి సాయి భగీరథ్ (Bandi Sai Bhagirath)కు స్టేషన్ బెయిల్ వచ్చింది. బుధవారం దుండిగల్ పోలీసులు ఎదుట బండి భగీరథ్ హాజరయ్యాడు. టెక్ మహీంద్రా యూనివర్శిటీలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న కేసులో బండి భగీరథ్ ఇవాళ విచారణకు హాజరయ్యాడు. పోలీసులు ప్రాథమిక విచారణ కొనసాగుతున్నందున, ఈ కేసులో పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత తదుపరి విచారణకు రావాల్సి ఉంటుందని, ఎప్పుడు హాజరుకావాలన్నదానిపై సమాచారం ఇస్తామని, ఆరోజు విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు పేర్కొన్నారు.

Here's ANI Tweets

బుధవారం బండి భగీరథ్ తన న్యాయవాది సమక్షంలో విచారణకు హాజరయినప్పటికీ పోలీసులు విచారణ చేయలేదు. దెబ్బలు తిన్నబాధితుడు శ్రీరామ్‌ను కూడా విచారణ చేయాల్సి ఉంటుందని అతని స్టేట్‌మెంట్ రికార్డు చేసిన తర్వాత తదుపరి విచారణ జరుగుతుందని, బండి భగీరథ్ ఎప్పుడు విచారణకు రావాలన్నది సమాచారం ఇస్తామని.. ఆ రోజు విచారణకు రావాలని దుండిగల్ పోలీసులు చెప్పి పంపించివేశారు.

బీజేపీని తరిమికొట్టడమే మా లక్ష్యం, ఖమ్మం బహిరంగ సభలో గర్జించిన మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీఆర్ఎస్ సభలో ఎవరెవరు ఏమన్నారంటే..

బండి సాయి భగీరథ్ ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థిపై దాడి చేసి చేయి చేసుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన సంగతి విదితమే. నగరంలోని మహీంద్రా యూనివర్సిటీలో చదువుతున్న భగీరథ్ తోటి విద్యార్థిపై చేయి చేసుకోవడమే కాకుండా రాయలేని భాషలో తిడుతూ చావబాదడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు, పక్కనే ఉన్న భగీరథ్ స్నేహితుడు కూడా విచక్షణ రహితంగా బాధితుడిపై దాడి చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు తప్పవంటూ భగీరథ్ హెచ్చరించడం ఆ వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. ఈ విషయాన్ని మంత్రికి చెప్పినా ఎవరూ తనను ఏమీ చేయలేరంటూ భగీరథ్ రంకెలేశారు.భగీరథ్ ఇలా దురుసుగా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఢిల్లీలో చదువుకుంటున్న సమయంలోనూ ఆయన ఇలానే ప్రవర్తించినట్టు తెలుస్తోంది. దీంతో అతడిని భరించలేని కాలేజీ యాజమాన్యం బయటకు పంపించేసింది. ఇప్పుడు మహీంద్రా యూనివర్సిటీలో మరోసారి దురుసు ప్రవర్తనతో వార్తల్లోకి ఎక్కారు.

బండి భగీరథ్ కు కు సంబంధించిన మరొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరొక విద్యార్థిని తన గ్రూప్ సభ్యులతో కలిసి వెళ్లి బండి భగీరథ్ అసభ్య పదజాలంతో దూషిస్తూ ఇష్టం వచ్చినట్టు కొడుతున్న మరొక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇక ఈ నేపథ్యంలో కాలేజీ యాజమాన్యం బండి భగీరథ్ పై చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించింది.భగీరథను కాలేజ్ నుండి సస్పెండ్ చేస్తున్నట్టు వెల్లడించింది. ఇప్పటికే కాలేజీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు బండి భగీరథ్ పై ఐపీసీ సెక్షన్లు 341, 323,, 504, 506, 34 కింద కేసులు నమోదు చేశారు.

మహీంద్రా వర్సిటీకి చెందిన విద్యార్థిపై బండి భగీరథ దాడి చేసినట్టు.. వైరల్‌గా మారిన వీడియోపై బాధితుడు శ్రీరామ్‌ తాజాగా స్పందించారు. భగీరథ తనకు మిత్రుడేనని.. తాము ఇరువురు స్నేహంగానే ఉన్నామంటూ ఓ వీడియో విడుదల చేశాడు. తమ మధ్య అభిప్రాయ భేదాలు సృష్టించేందుకే దాడికి సంబంధించిన వీడియోను బహిర్గతం చేశారన్నారు.