Brs Mlc Kavitha Casts Her Vote (ANI X)

Hyderabad, NOV 30: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ఉదయం 7 గంటలకే మొదలైంది. దీంతో సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు తరలి వస్తున్నారు. దీంట్లో భాగంగా ఇప్పటికే పలువురు వారి వారి పరిధిలోని కేంద్రాల్లో ఓటు వేశారు.అలాగే..బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బంజారాహిల్స్‌లోని పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్సీ కవిత తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతు.. తెలంగాణ ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి ఓటేయాలని పిలుపునిచ్చారు. నగరాలు, పట్టణాల్లోని వారు, యువత పెద్దఎత్తున ఓటింగ్‌లో పాల్గొనాలని సూచించారు. అంతేకాదు..ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.

 

అటు ఎమ్మెల్సీ కవితఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు రాష్ట్ర కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ ఛైర్మన్‌ నిరంజన్‌ తెలిపారు. బీఆర్ఎస్‌ కు ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారని.. ఇది ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనగా పేర్కొంటూ కాంగ్రెస్‌ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది.