Telangana CM Revanth Reddy, Deputy CM Bhatti Vikramarka Mallu Meet PM Narendra Modi (Photo Credits: X/@TheNaveena)

Hyd, Dec 26: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి మంగళవారం భేటీ అయ్యారు. ప్రధాని మోదీతో చర్చించిన అంశాలపై రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క మీడియా సమావేశంలో మాట్లాడారు. విభజన చట్టంలోని అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లామని భట్టి తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన వాటిని గత ప్రభుత్వం తీసుకురాలేకపోయిందని ఈ సందర్భంగా మండిపడ్డారు. స్టీల్‌ ప్లాంట్‌, రైల్వే కోచ్‌ఫ్యాక్టరీ, ఐటీఐఆర్‌ ప్రాజెక్టును వెంటనే అందించాలని ప్రధానిని కోరినట్లు చెప్పారు.

వాహనదారులకు గుడ్ న్యూస్, పెండింగ్ చలాన్లపై భారీ డిస్కౌంట్ అందిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ రవాణా శాఖ

‘తెలంగాణకు రావాల్సిన వాటిని త్వరగా అందేలా చూడాలని ప్రధానమంత్రిని కోరాం. ఫెడరల్‌ స్పూర్తికి విఘాతం కలగకుండా చూడాలని కోరాం. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరాం. హైదరాబాద్‌కు ఐఐఎం, సైనికల్‌ స్కూల్‌ ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం. పాలమూరు-డిండి ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వాలని విన్నపించారు. కాగా రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారి వీరిద్దరు నేతులు దేశ ప్రధానిని కలుస్తున్నారు.

Here's Pics

Here's Press Meet

తెలంగాణ ప్రయోజనాలు కాపాడేందుకు తొలిసారి ప్రధానిని కలిశాం. వెనకబడిన ప్రాంతాలకు రావాల్సిన గ్రాంట్లను విడుదల చేయాలని ప్రధానిని కోరాం’ అని భట్టి వెల్లడించారు.

కాగా ఆరున్నర లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ ఉందని ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయగా.. ఈ అంశాలను సీఎం, డిప్యూటీ సీఎం ప్రధానికి వివరించారు. తెలంగాణను ఆదుకునేందుకు తగిన ఆర్థిక చేయూత ఇవ్వాలని కోరారు.