Telangana: ఆరూరి రమేష్ ఇంటి వద్ద హైడ్రామా, రంగంలోకి దిగిన ఎర్రబెల్లి దయాకర్ రావు, నేను బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని తెలిపిన మాజీ ఎమ్మెల్యే
లోక్‌సభ ఎన్నికలకు ముందు తెలంగాణ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీఆర్‌ఎస్ నేత ఆరూరి రమేష్ బీజేపీలో చేరేందుకు రెడీ కావడంతో ఆయన ఇంటి వద్ద హైడ్రామా క్రియేట్ అయ్యింది. రంగంలోకి దిగిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఆయనను తన కారుతో వేరే చోటకు తరలించారు.
లోక్‌సభ ఎన్నికలకు ముందు తెలంగాణ రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీఆర్‌ఎస్ నేత ఆరూరి రమేష్ బీజేపీలో చేరేందుకు రెడీ కావడంతో ఆయన ఇంటి వద్ద హైడ్రామా క్రియేట్ అయ్యింది. రంగంలోకి దిగిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఆయనను తన కారుతో వేరే చోటకు తరలించారు.ఈ సందర్భంగా ఆరూరి రమేష్ మీడయాతో మాట్లాడారు. ‘బీఆర్‌ఎస్‌లోనే కోనసాగుతున్నా. అమిత్ షాను కలవలేదు.. కానీ, బీజేపీ నాయకులను మాత్రమే కలిశాను. మా పార్టీ నేతలే నన్ను తీసుకుని వచ్చారు. నన్ను బీఆర్ఎస్ నేతలు కిడ్నాప్ చేయలేదు. మా పార్టీ నేతలు నన్ను కిడ్నాప్ ఎందుకు చేస్తారు?’ అని ఆరూరి స్పష్టత ఇచ్చారు. ఇక బీజేపీలో చేరకుండా ఆయన్ని బీఆర్‌ఎస్ నాయకులే కిడ్నాప్ చేశారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Here's Videos
The #BRSParty chief #KCR conducts meeting with leaders of the #Warangal Parliamentary constituency, at his residence in #Hyderabad
Former #BRS MLA Aroori Ramesh, who hinted to join #BJP, also participating in the meeting, KCR trying to convincing him.#Telangana #ArooriRamesh https://t.co/5jZsTAgIfo pic.twitter.com/y9WNZMt6tF
— Surya Reddy (@jsuryareddy) March 13, 2024
(The above story first appeared on LatestLY on Mar 13, 2024 04:39 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

