Hyderabad Traffic Police (Photo Credits: Facebook)

Hyd, Sep 22: ఉల్లంఘనలకు పాల్పడటమే కాకుండా, ఈ–చలాన్లు కట్టకుండా తిరిగేవారికి హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు (Hyderabad Police) భారీ షాక్ ఇవ్వనున్నారు. మూడు నెలల వ్యవధిలో పదేపదే ఉల్లంఘనలకు పాల్పడి జరిమానాలు చెల్లించని వారి నుంచి (who do not pay the first challan) భారీగా వసూలు చేయనున్నారు. హెల్మెట్‌ లేకుండా వాహనాలు నడిపే ద్విచక్ర వాహనచోదకులకు రూ.100 జరిమానా పడుతున్న సంగతి విదితమే.

అయితే ఈ ఈ–చలాన్‌ చెల్లించకుండా మరో ఉల్లంఘనకు పాల్పడితే ఇక నుంచి రెండోసారికి రూ.200, మూడోసారికి రూ.600 చొప్పున డబుల్ పెనాల్టీ (issue challan again) చెల్లించాల్సిందే. ఎప్పటి జరిమానాలు అప్పుడు చెల్లించేస్తే మాత్రం రూ.100 చొప్పున చెల్లిస్తే సరిపోతుంది. ఈ విధానం కోసం ట్రాఫిక్‌ పోలీసులు జరిమానాలు పెంచట్లేదు. మోటారు వాహనాల చట్టంలో (ఎంవీ యాక్ట్‌) ఉన్న కీలక సెక్షన్లు వినియోగిస్తున్నారు.

నన్నే టోల్ అడుగుతారా అంటూ టోల్‌ సిబ్బందిపై టీఆర్‌ఎస్ నేత దాడి, ఫాస్టాగ్ విషయంలో టోల్ సిబ్బందిపై దాడి, షాద్‌నగర్‌ టోల్‌ ప్లాజా వద్ద ఉద్రిక్తత

ఇదిలా ఉంటే ఒకసారి జారీ చేసిన చలాన్‌ను నిర్ణీత గడువులోగా చెల్లించకపోతే అది ఉత్తర్వుల ధిక్కరణ కిందికి వస్తుందని, దీనికి రూ.500 జరిమానా విధించవచ్చని ఎంవీ యాక్ట్‌ చెప్తుంది. ఇలాంటి అనేక కీలక సెక్షన్లు ఇప్పటి వరకు వాడలేదు. వాహనచోదకుల్లో క్రమశిక్షణ పెంచడంతో పాటు ట్రాఫిక్‌ జామ్స్, ప్రమాదాలు తగ్గించడానికి ఇకపై వినియోగించాలని నిర్ణయించారు. వితౌట్‌ హెల్మెట్, రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్, అక్రమ పార్కింగ్‌లతో పాటు సిగ్నల్‌ జంపింగ్, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్, ఓవర్‌లోడింగ్‌ తదితర ఉల్లంఘనకూ ఈ విధానం వర్తిస్తుంది.

► రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్‌ చేస్తే ద్వికచ్ర వాహనాలు, ఆటోలకు రూ.200, రూ.600, రూ.800 చొప్పున,

► తేలిక పాటి వాహనాలకు, భారీ వాహనాలకు రూ.1000, రూ.1500, రూ.2 వేల చొప్పున జరిమానా విధిస్తూ ఈ–చలాన్‌ జారీ చేస్తారు.

► అలాగే ఎక్కడపడితే అక్కడ అక్రమంగా పార్కింగ్‌ చేస్తే ద్విచక్ర వాహనాలు, ఆటోలకు రూ.200 (అక్కడ నుంచి ఠాణాకు తరలిస్తే మాత్రం రూ.350), రూ.700, రూ.1000 చొప్పున, తేలికపాటి, భారీ వాహనాలకు రూ.1000, రూ.1200, రూ.1700 చొప్పున విధిస్తారు.