Sadar Utsav Mela: ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచి హైదరాబాద్‌ లో ‘సదర్’ ట్రాఫిక్ ఆంక్షలు.. పలు ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజామున 3 వరకు ట్రాఫిక్ మళ్లింపు.. పూర్తి వివరాలు ఇదిగో!
Traffic (Photo Credit- PTI)

Hyderabad, Nov 14: సదర్‌‌‌‌ ఉత్సవ మేళా (Sadar Utsav Mela)ను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ (Hyderabad) పోలీసులు (Police) ముందస్తు జాగ్రత్త చర్యలకు సిద్ధమయ్యారు. నారాయణగూడ వైఎంసీఏ మార్గంలో ప్రయాణించే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించాలని నిర్ణయించారు. ఈ మేరకు సిటీ ట్రాఫిక్ చీఫ్ సుధీర్ బాబు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. మంగళవారం రాత్రి 7 గంటల నుంచి బుధవారం వేకువజామున 3 గంటలకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు.

Viral News: భార్య పుట్టిన రోజును మర్చిపోతే ఐదేండ్ల జైలు.. భయపడకండి మనదగ్గర కాదులే.. మరెక్కడ??

ట్రాఫిక్ మళ్లించిన ప్రాంతాలు ఇవే...

  • బర్కత్‌‌పురా చమాన్ నుంచి వైఎంసీఏ వైపు వచ్చే వాహనాలకు అనుమతి లేదు. బర్కత్‌‌పురా క్రాస్ రోడ్స్, టూరిస్ట్ హోటల్‌‌ నుంచి మళ్లించనున్నారు.
  • కాచిగూడ క్రాస్ రోడ్స్‌‌ నుంచి వైఎంసీఏ రూట్‌‌లో వచ్చే వాహనాలను టూరిస్ట్‌‌ హోటల్‌‌ రోడ్‌‌లో దారి మళ్లింపు.
  • సదర్‌‌‌‌ మేళాకు వచ్చే వాహనాలను శాంతి థియేటర్‌‌‌‌, రెడ్డి కాలేజ్‌‌, మెల్కొటే పార్క్‌‌, దీపక్ థియేటర్‌‌‌‌ పార్కింగ్‌‌ ఏరియాల్లో పార్క్‌‌ చేయాల్సి ఉంటుంది.
  • స్ట్రీట్ నంబర్‌‌‌‌ 8 నుంచి వైఎంసీఏ వైపు ప్రవేశం లేదు. రెడ్డి కాలేజ్‌‌ వద్ద బర్కత్‌‌పురా వైపు మళ్లీస్తారు.
  • బ్రిలియంట్ గ్రామర్ స్కూల్‌‌ నుంచి రెడ్డి కాలేజి వైపు వచ్చే వాహనాలకు ఎంట్రీ లేదు. నారాయణగూడ క్రాస్ రోడ్స్‌‌ మీదుగా మళ్లించనున్నారు.
  • ఓల్డ్‌‌ ఎక్సైజ్ ఆఫీస్‌‌ నుంచి వచ్చే వాహనాలను విఠల్‌‌వాడి మీదుగా మళ్లిస్తారు.
  • సికింద్రాబాద్‌‌ నుంచి కోఠి వైపు వచ్చే ఆర్టీసీ బస్సులను నారాయణగూడ క్రాస్‌‌ రోడ్స్, బర్కత్‌‌పురా, బాగ్‌‌లింగంపల్లి, వీఎస్‌‌టీ, ఆర్టీసీ రోడ్స్‌‌ మీదుగా మళ్లించనున్నారు.
  • విఠల్‌‌వాడి క్రాస్‌‌ రోడ్స్ నుంచి వచ్చే వాహన ట్రాఫిక్‌‌ను భవన్స్‌‌ న్యూ సైన్స్‌‌ కాలేజ్‌‌, కింగ్‌‌కోటి మీదుగా మళ్లీంపు.
  • ఓల్డ్‌‌ బర్కత్‌‌పురా పోస్టాఫీస్ నుంచి వైఎంసీఏ వైపు వచ్చే వాహనాలకు ప్రవేశం లేదు. ట్రాఫిక్‌‌ను క్రౌన్ కేఫ్‌‌, బాగ్‌‌ లింగంపల్లి వైపు మళ్లింపు.

Harish Rao About CM Post: కేటీఆర్‌ ను సీఎం చేసినా నాకు ఓకే అంటున్న హరీశ్ రావు.. కేటీఆర్ తనకు మంచి స్నేహితుడని స్పష్టీకరణ