History of Bathukamma: పూల పండుగ బతుకమ్మ వెనుక ప్రాచుర్యంలో ఉన్న కథలు తెలుసా? బతుకమ్మను ఈ సీజన్‌లోనే జరుపుకోవడం వెనుక ఉన్న ఆంత్యర్యం తెలిస్తే తప్పకుండా ఆచరిస్తారు, బతుకమ్మ చరిత్ర అంతా, ఇంతా కాదు!
Batukamma (Photo-Twitter)

Hyderabad, SEP 22: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక ‘బతుకమ్మ’ పండుగ (Bathukamma festival). ప్రకృతిని అరాధిస్తూ జరుపుకునే పండుగ బతుకమ్మ. రంగు రంగుల పూలనే గౌరమ్మగా భావించి ఆరాధించే పండుగ బతుకమ్మ (Bathukamma festival). అటువంటి బతుకమ్మ గురించి ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.అటువంటి బతుకమ్మ కథలేంటో తెలుసుకుందాం..ప్రకృతి బతుకమ్మను ఆరాధించుకుందాం..ఆశ్వయుజ శుద్ధ పాడ్యమికి ముందురోజు వచ్చే అమావాస్య రోజున ఎంగిలి పూల బతుకమ్మ పేరుతో ప్రారంభమై దుర్గాష్టమి (Durgastami) రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది బతుకమ్మ పండుగ..అంటు వ్యాధులు,ప్రకృతి విపత్తుల నుంచి కాపాడాలని వేడుకుంటూ ప్రకృతి గౌరిని ఆటపాటలతో పూజించే వేడుకే బతుకమ్మ పండుగ. ఇంతకీ బతుకమ్మ (bathukamma) అనే పేరు ఎలా వచ్చింది..ఈ పండుగ వెనుక వున్న చరిత్ర గురించి తెలుసుకుందాం…

అమ్మవారి అనుగ్రహంతో పుట్టిన బిడ్డ బతుకమ్మ

దక్షిణ భారతదేశాన్ని పాలించిన చోళ వంశ చక్రవర్తి ధర్మాంగదుడు సంతానం కోసం ఎన్నో పూజలు చేయడంతో అమ్మవారి అనుగ్రహంతో ఓ బిడ్డ కలిగింది. ఎన్నో గండాలు దాటి బిడ్డ భూమ్మీదపడడంతో ఆమెకు బతుకమ్మ అని నామకరణం చేశారట. అప్పటి నుంచీ బతుకు ప్రసాదించాలని కోరుతూ బతుకమ్మను కొలుస్తారని చరిత్ర చెబుతుంది.

History of Bathukamma: బతుకమ్మ పండుగ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది, 9 రోజులు ఏ నైవేద్యాలు సమర్పించాలో తెలుసుకోండి..

బతుకమ్మ జానపద కథ..

ఏడుగురు అన్నదమ్ములకు ఓ ముద్దుల చెల్లి. ఆమె అన్నలకు ప్రాణమైనా వదినలకు మాత్రం అసూయ. ఓ రోజు అన్నలు వేటకెళ్లి ఎంతకీ తిరిగి రాలేదు..భర్తలు ఇంట్లో లేకపోవటం వదినలు సాధింపులు వేధింపులు ప్రారంభమయ్యాయి. వదినల వేదింపులు భరించలేక ఆడబిడ్డ ఇల్లొదిలి పోయింది. ఆ తరువాత అన్నలు ఇంటికి తిరిగొచ్చారు. అన్నయ్యలు తిరిగి రాగానే ముద్దుల చెల్లి గురించి వారి వారి భార్యలను అడిగారు. జరిగింది తెలుసుకున్నారు. భార్యలపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ చెల్లిని వెతటానికి ఇంటినుంచి బయలుదేరారు. నిద్రాహారాలు మాని చెల్లిని వెతికారు. ఓ ఊరి పొలిమేర దగ్గర బావిలో దాహం తీర్చుకుంటూ ఉండగా పెద్ద తామరపూవొకటి వీళ్లవైపు తేలుతూ వచ్చిందట. తమ చెల్లెలు ఆ తామర రూపంలో వచ్చందని భావించారు అన్నలు. ఆ రాజ్యాన్నేలే రాజు ఆ అన్నదమ్ముల దగ్గర్నుంచి ఆ పూవుని తీసుకెళ్లి తన తోటలో కొలనులో వేయగా చుట్టూ దట్టంగా తంగేడు మొక్కలు మెలిచాయట. ఆ తామరే శ్రీలక్ష్మి అవతారంగా భావించి పువ్వులకు బతుకుతెరువు చూపింది..అందుకే బతుకమ్మగా పూజించడం మొదలు పెట్టారట..

Bathukamma Sarees: నేటి నుంచే బతుకమ్మ చీరల పంపిణీ, రాష్ట్రవ్యాప్తంగా కోటికి పైగా చీరలు పంపిణీ చేయనున్న ప్రభుత్వం, 24 రకాల డిజైన్లు, 10 రంగులు, 240 రకాల త్రెడ్ బోర్డర్‌ తో ఆకర్షణీయంగా చీరెలు

బతుకమ్మ మరో కథ..

ఆత్మత్యాగంతో తెలంగాణలో ఓ పల్లెను వరదబారినుంచి కాపాడిన త్యాగమూర్తి బతుకమ్మ అని కొందరు, మహిషాసురుని చంపిన తర్వాత అలసి సొలసి మూర్ఛపోయిన అమ్మవారికి…మహిళలంతా కలిసి పాటలతో స్పృహ తెప్పించే ప్రయత్నమని మరికొందరు చెబుతారు. ఓ రైతు దంపతులకు పిల్లలు పుట్టి చనిపోతున్నారని ఇలా ఏడుగురు పుట్టి చనిపోయారని 8వ బిడ్డకు బతుకమ్మ అని పేరు పెట్టడంతో ఆమె బతికిందనేది మరో కథ..

గౌరీ దేవిని పూజించేలా బతుకమ్మ

గౌరీ దేవిని (Gouwri devi) పూజించేలా బతుకమ్మ మరో కథనంలో గంగా గౌరీ సంవాదంలో భాగంగా శివుడు తలపై గంగమ్మని పెట్టుకోవడం వల్ల అందరూ గంగను పూజిస్తున్నారు అని పార్వతీదేవి తన తల్లితో చెప్తుంది. అయితే పార్వతీదేవి తల్లి పార్వతిని ఓదార్చి గంగ మీద నిన్ను పూలతెప్పలా తేలించి పూజ చేసేలా చేస్తానని చెబుతుంది. ఆ తర్వాత బతుకమ్మగా పార్వతీ దేవిని పూజిస్తే మహిళలు పాడిపంటలు సంవృద్దిగా పండుతాయని ప్రచారం కాగా, అలా ప్రాచుర్యంలోకి వచ్చింది బతుకమ్మ పండుగ అని కొందరు చెబుతుంటారు. కాకతీయుల కాలంలో కరువుకాటకాలతో తీవ్ర దుర్భిక్ష నెలకొన్న సమయంలో, తొమ్మిది రోజుల పాటు పూలతో అమ్మవారిని బతుకమ్మగా పూజిస్తే కరువు కాటకాలు తీరుతాయని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని కూడా చెప్తుంటారు. ఇంకా కొన్ని జానపద కథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి.

12 వ శతాబ్దం నుంచి ఈ పండుగ ఉన్నట్లుగా ఆధారాలు

ఇక మరో కథనం కూడా ప్రాచుర్యంలో ఉంది. బతుకమ్మ అంటే గౌరీదేవి అని అందరూ భావిస్తారు. గౌరీ దేవి పువ్వులను ఇష్టపడే ప్రేమికురాలు. కాబట్టి అమ్మవారిని వర్షాకాలం శీతాకాలం మధ్య వచ్చే సంధికాలంలో విరబూసే పువ్వులతో పూజిస్తారు అని చెప్తుంటారు. బతుకమ్మలను పేర్చి అమ్మవారిని పూజిస్తే పసుపు కుంకుమలతో సౌభాగ్యవతిగా జీవిస్తారని మహిళలు విశ్వసిస్తారు. ఇక మరో కథనాన్ని చూస్తే కాకతీయ చక్రవర్తుల కాలం అంటే సుమారు 12 వ శతాబ్దం నుంచి ఈ పండుగ ఉన్నట్లుగా ఆధారాలు ఉన్నాయి. ఆ కాలంలో పువ్వులను బతుకుగా భావించి పూజించేవారు. మహిషాసుర సంహారం కోసం అవతరించిన దుర్గాదేవి తొమ్మిది రోజుల్లో పెరిగి పెద్దదై రాక్షససంహారం చేయడంతో, ఆమె అనుగ్రహం కోరి మహిళలు చేసే ఆరాధనే బతుకమ్మ పండుగగా మారిందని కొందరి అభిప్రాయం.

తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల్లో బతుకమ్మ

ఈ బతుకమ్మ పండుగను తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల్లో బతుకమ్మని కొలిచి చివరి రోజు సద్దుల బతుకమ్మని పెద్ద పండగా భావిస్తారు. ఆ రోజు తొమ్మిదిరకాల సద్దులు తయారు చేస్తారు. గునుగ, తంగేడు పూలతోపాటు మిగతా పూలను వలయాకారంగా పేర్చుకుంటూ ఆకర్షణీయంగా బతుకమ్మని తయారుచేసి మధ్యలో పసుపుతో చేసిన గౌరీమాతను పెట్టి చుట్టూ దీపాలతో అలంకరిస్తారు. ఇలా తయారు చేసిన బతుకమ్మను ఇంట్లో పూజ చేసి ఆ తర్వాత బయటకి తీసుకొచ్చి బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలతోను ఆటలతోను కొలుస్తారు.ఆ తర్వాత బతుకమ్మను నిమర్జనం చేశారు…ఇలా బతుకమ్మ కథలు ఎన్నో ఉన్నాయి..