History of Bathukamma: బతుకమ్మ పండుగ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది, 9 రోజులు ఏ నైవేద్యాలు సమర్పించాలో తెలుసుకోండి..
File

తెలంగాణ అంటేనే బతుకమ్మ పండుగ, దసరా సందర్బంగా నవరాత్రుల్లో మాత్రమే జరుపుకునే ప్రత్యేకమైన బతుకమ్మ పండగ, తెలంగాణ వారసత్వాన్ని ప్రపంచానికి చాటింది. ఆశ్వయుజ అమావాస్య నాడు ఎంగిలి పూలు పేరుతో బతుకమ్మ, దుర్గాష్టమి సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. బతుకమ్మ వేడుకలు సెప్టెంబర్ 25 నుంచి ప్రారంభం కానున్నాయి.

ప్రకృతిలో లభించే పూలను ఏరికోరి బతుకమ్మలను తయారు చేయడం, వాటిని గృహలు, వీధులు, ఆలయాల్లో నిల్పి దాని చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ, ఆటలు ఆడుతారు. గుమ్మడి పూలలోని పసుపు వర్ణపు దుద్దును గౌరీ దేవిగా భావిం చి అందులో పసుపు గౌరమ్మను నిల్పి సుందరంగా ముస్తాబు చేసిన బతుకమ్మ చుట్టూ మహిళలు, ఆడ పిల్లలు బతుకమ్మ ఆడుతారు.

ఒక స్త్రీ పాట పాడగా మిగిలిన వాళ్ళు వంత పాడటం దీని ప్రత్యేకత. అయితే ఈ బతుకమ్మ పాటలలో పురాణ, ఇతిహాస కథలు మొదలు తెలంగాణ వీరుల కథల వరకు వర్తమాన అంశాలకు చెందిన విషయాలను పాటల రూపంలో పాడుతూ ఉంటారు. గోధుమలు, పెసళ్ళు, బియ్యం, మినుములు, తదితర ధాన్యాలతో తయారు చేసిన సత్తు ను ప్రసాదంగా స్వీకరిస్తారు.

యూపీలో దారుణం, టాయిలెట్ గదిలో అన్నం పెట్టుకుని తిన్న మహిళా కబడ్డీ ప్లేయర్లు, వైరల్ వీడియోపై స్పందించిన అధికారులు

9 రోజులపాటు ప్రతిరోజూ ఓ రకమైన నైవేద్యం సమర్పిస్తారు. చివరిరోజు సద్దుల బతుకమ్మ అంటారు. ఈరోజు మాత్రం నైవేద్యాన్ని మహిళలు తయారు చేస్తారు.

మహాలయ అమవాస్యరోజు బతుకమ్మ మొదటిరోజు నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు. రెండో రోజు సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.మూడో రోజు ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం సమర్పిస్తారు. నాలుగో రోజు నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు. ఐదో రోజు అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు. ఆరో రోజు నైవేద్యం ఉండదు. ఏడో రోజు బియ్యంపిండిని వేయించి ఉండలు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. ఎనిమిదో రోజు నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు. తొమ్మిదో రోజును సద్దుల బతుకమ్మ అంటారు.ఈ రోజు 5 రకాల అన్నాలు సమర్పిస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, లెమన్‌ రైస్‌, కొబ్బరన్నం, నువ్వులన్నం ఉంటాయి.