Elon Musk (Photo Credits: Getty Images)

New York, NOV 26: సంచలనాలకు మారుపేరుగా నిలుస్తున్న ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్(Elon Musk)...మరో సంచలనానికి సై అంటున్నారు. ఇప్పటికే ట్విట్టర్‌లో (Twitter) ప్రక్షాళన పేరుతో ఇప్పటికే ఉద్యోగులను తొలగిస్తున్నాడు. ట్విట్టర్ కొనుగోలు కంటే ముందు నుంచే తన ఫాలోవర్ల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం మస్క్‌కు అలవాటు. అందులో భాగంగా ఓ ఫాలోవర్ అడిగిన ప్రశ్నకు మస్క్ చెప్పిన సమాధానం ఇప్పుడు వైరల్‌గా మారింది. గూగుల్ ప్లే స్టోర్ (Google playstore), యాపిల్  స్టోర్(Apple store) నుంచి ట్విట్టర్ యాప్ ను తొలగిస్తే ఏం చేస్తారు? అని ఓ యూజర్ నుంచి మస్క్ కు ప్రశ్న ఎదురైంది. కొత్త ఫోన్ ను (New Phone) మార్కెట్ కు పరిచయం చేస్తారా? అని అడిగారు. ‘‘అలా జరగదని నేను కచ్చితంగా అనుకుంటున్నాను. కానీ, మరో ఇతర చాయిస్ లేనప్పుడు నేను ప్రత్యామ్నాయ ఫోన్ ను తీసుకొస్తాను’’ అని మస్క్ రిప్లయ్ ఇచ్చారు.

దీనికి నథింగ్ (Nothing) కంపెనీ వ్యవస్థాపకుడు కార్ల్ పీ స్పందించారు. మస్క్ తదుపరి ఏం చేస్తారో చూడాలన్న ఆసక్తితో ఉన్నాను అన్నారు. గూగుల్(Google), యాపిల్ (Apple) తమ యాప్ స్టోర్లలో లాంచ్ చేసే యాప్ డెవలపర్ల నుంచి లోగడ 30 శాతం కమీషన్ తీసుకునేవి, తర్వాత 15 శాతానికి తగ్గించాయి. దీన్ని ఎలాన్ మస్క్ గతంలో విమర్శించారు. ఇంటర్నెట్ పై ట్యాక్స్ గా అభివర్ణించారు.

Twitter Premium Services: ట్విట్టర్‌లో వ్యక్తులు, సంస్థలను బట్టి టిక్ మార్కులు, మొత్తం మూడు టిక్ మార్క్‌లు ఫైనల్ చేసిన ఎలాన్ మస్క్, డిసెంబర్ 2 నుంచి ట్విట్టర్ వెరిఫికేషన్ ప్రోగ్రాం షురూ 

నలుగురు కంటే భిన్నంగా ఆలోచించే ఎలాన్ మస్క్‌....గతంలో కూడా ఓ సారి ట్విట్టర్ ను కొంటాను అంటూ ట్వీట్ చేశారు. అప్పుడు దాన్ని అంతా కామెడీగా భావించారు. కానీ కొన్నాళ్లకు ట్విట్టర్ కొనుగోలుకు సంబంధించిన ప్రకటనతో అంతా షాక్ అయ్యారు. ఇప్పుడు అవసరమైతే కొత్త ఫోన్ తీసుకువస్తానని మస్క్ చెప్పడంతో...మస్క్ చెప్తే జరిగే ఛాన్స్ ఉంటుందని భావిస్తున్నారు.