Twitter Premium Services: ట్విట్టర్‌లో వ్యక్తులు, సంస్థలను బట్టి టిక్ మార్కులు, మొత్తం మూడు టిక్ మార్క్‌లు ఫైనల్ చేసిన ఎలాన్ మస్క్, డిసెంబర్ 2 నుంచి ట్విట్టర్ వెరిఫికేషన్ ప్రోగ్రాం షురూ
Elon Musk and Twitter. (Photo credits Wikimedia Commons/ Twitter)

London, NOV 25: ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ (Twitter) కొత్త వెరిఫికేషన్ ప్రోగ్రామ్ మళ్లీ తీసుకొస్తోంది. ఈసారి మాత్రం ట్విట్టర్ యూజర్ల కోసం విభిన్న రంగులతో వెరిఫికేషన్ టిక్ మార్క్ తీసుకొచ్చేందుకు రెడీగా ఉంది. అయితే ట్విట్టర్ తీసుకొచ్చే టిక్ చెక్ మార్కులు.. సంస్థలు, ప్రభుత్వాలు, ప్రముఖులు, యూజర్లకు విభిన్న రంగుల్లో ఉండనున్నాయి. అందులో ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రైబర్‌లకు ట్విట్టర్ వివిధ బ్లూ, గ్రే, గోల్డ్ చెక్ మార్కులను మాన్యువల్‌గా కేటాయిస్తుందని కొత్త బాస్ ఎలోన్ మస్క్ ప్రకటించారు. వెరిఫికేషన్ ప్రోగ్రామ్ ప్రారంభమైన తర్వాత యూజర్లకు ఎదురయ్యే సమస్యను పరిష్కరించడానికి వివిధ అకౌంట్లకు వేర్వేరు రంగులను కేటాయించాలనే నిర్ణయం తీసుకున్నట్టు మస్క్ వెల్లడించారు. ట్విట్టర్ అందించే ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ని కొనుగోలు చేసిన అనేక మంది యూజర్లను తప్పుదారి పట్టించేందుకు ప్రముఖ యూజర్లు మాదిరిగా నటించారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఈ ఫీచర్ వెంటనే వెనక్కి తీసుకుంది. ట్విట్టర్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్ తిరిగి రావడంపై మస్క్ మాట్లాడుతూ.. ట్విట్టర్ ప్రోగ్రామ్ వచ్చే వారమే డిసెంబర్ 2న తిరిగి ప్రారంభమవుతుందని చెప్పారు. కంపెనీలకు గోల్డ్ చెక్ మార్క్ (Gold Check Mark), ప్రభుత్వానికి గ్రే చెక్ మార్క్ (Grey Check Mark), సెలబ్రిటీలకు బ్లూ (Blue Tick Mark) ఇవ్వడం జరుగుతుందని మస్క్ వివరించాడు.

Twitter Blue: బ్లూటిక్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌పై ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం, స‌బ్‌స్క్రిప్ష‌న్ విధానాన్ని నిర‌వ‌ధికంగా వాయిదా వేస్తున్న‌ట్లు ప్రకటన 

‘ఆలస్యానికి క్షమించండి.. మేము తాత్కాలికంగా వెరిఫైడ్‌ని వచ్చే వారం శుక్రవారం ప్రారంభిస్తున్నాం. కంపెనీలకు గోల్డ్ చెక్, ప్రభుత్వానికి గ్రే చెక్, ప్రముఖులకు బ్లూ రంగు (సెలబ్రిటీలు) చెక్ యాక్టివేట్ అయ్యే ముందు వెరిఫై చేసిన అన్ని అకౌంట్లు మాన్యువల్‌గా అథెంటికేషన్ ఇవ్వడం జరుగుతుంది. పబ్లిక్ ఆఫీసర్‌గా వెరిఫై చేసిన యూజర్ లేదా పేమెంట్ చందాదారుడు ఒకే బ్లూ టిక్‌ని పొందుతాడా అని ఒక వినియోగదారు అడిగినప్పుడు.. వెరిఫై చేసిన యూజర్లందరికి ఒకే బ్లూ చెక్ ఉంటుందని మస్క్ సమాధానం ఇచ్చాడు. ‘వెరిఫై చేసిన యూజర్లందరికి ఒకే బ్లూ టిక్ చెక్ ఉంటుంది.

Twitter: ఉద్యోగులకు షాకుల మీద షాకులు ఇస్తున్న ఎలాన్ మస్క్, తాజాగా ఉద్యోగుల బెనిఫిట్స్ కట్ చేస్తున్నట్లు ప్రకటన, కంపెనీ లాభాల్లోకి వచ్చినప్పుడు తిరగి ఇస్తామని వెల్లడి 

ఎందుకంటే ‘Notable’ యూజర్లు లేదా ఆ సంస్థ ద్వారా ధృవీకరించినట్టుయితే ఆయూ యూజర్లు ఒక orgకి చెందినవారని చూపించే సెకండరీ చిన్న లోగోను కలిగి ఉంటారు. Twitter యూజర్లను ఎలా ధృవీకరిస్తుంది అనే దానిపై సుదీర్ఘ వివరణ త్వరలో వెల్లడించనున్నట్టు మస్క్ పేర్కొన్నారు. Twitter బ్లూ సబ్‌ స్క్రైబర్‌గా, మీరు ట్విట్టర్‌లో రీచ్, డిస్‌ప్లేలో ప్రాధాన్యతతో పాటు వెరిఫైడ్ బ్లూ టిక్‌ను పొందుతారు. ఇవన్నీ, మీరు అమెరికాలో నెలకు 8 డాలర్లు లేదా భారత్‌లో రూ. 719 చెల్లించడానికి సిద్ధంగా ఉంటే మాత్రమేనని మస్క్ స్పష్టం చేశారు. ట్విట్టర్ ప్లాట్‌ఫారమ్‌లో ప్రారంభంలో ట్విట్టర్ బ్లూ రోల్ అవుట్ చాలా అనవసరమైన చర్చకు దారితీసింది. చాలామంది ప్రముఖులు మాదిరిగా ఫేక్ అకౌంట్లను కలిగి ఉన్నారని తేలింది.

Alphabet Layoffs: గూగుల్ ఉద్యోగులకు భారీ షాక్, 10 వేల మంది ఉద్యోగులను తొలగించే యోచనలో కంపెనీ, పేలవమైన పనితీరు ప్రదర్శించే వారిని బయటకు పంపే ప్రయత్నం 

దాంతో తమను ఫాలో అయ్యే ఫాలోవర్లను సైతం తప్పుదారి పట్టించారు. ఒక బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు లెబ్రాన్ జేమ్స్‌ అంటూ ఒక ట్విట్టర్ వినియోగదారు.. బాస్కెట్‌బాల్ జట్టు లాస్ ఏంజిల్స్ లేకర్స్ నుంచి బిజినెస్ కోరాడు. ఊహించినట్లుగానే.. అతడికి బ్లూ టిక్ ఉన్నందున చాలా మంది యూజర్లు ఆ ట్వీట్‌తో మోసపోయారు. వెంటనే గుర్తించిన ట్విట్టర్ అతడి అకౌంట్ సస్పెండ్ చేసింది. జీసస్ క్రైస్ట్ పేరడీ అకౌంట్ కూడా ట్విట్టర్‌లో వెరిఫై బ్యాడ్జ్‌ను పొందింది.