World

Viral Video: జనావాసాల మధ్య గింగిరాలు తిరుగుతూ కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. కొలంబియాలో ఘటన.. వీడియో వైరల్

Rudra

కొలంబియాలోని క్విబ్ డో నగరంలో ఘోరం జరిగింది. ఆధుపుతప్పిన ఓ మిలిటరీ హెలికాప్టర్ జనావాసాల మధ్య గింగిరాలు తిరుగుతూ కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు తెలుస్తుంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Putin Visit Mariupol: కదనరంగంలోకి రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్‌లో ఆక్రమిత నగరంలో ఆకస్మిక పర్యటన, యుద్ధంపై వెనక్కు తగ్గేదే లేదంటూ హింట్

VNS

రష్యా అధ్యక్షుడు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఆదివారం ఆకస్మికంగా ఉక్రెయిన్లోని మారియుపోల్‌ నగరంలో పర్యటించారు. ఈ నగరాన్ని రష్యా సైన్యం ఆక్రమించింది. డొనెట్స్క్ రాష్ట్రంలోకి వచ్చే ఈ నగరం గతేడాది మే నుంచి రష్యా ఆధీనంలో ఉన్నది.

Viral Video: క్యూట్ వీడియో ఇదిగో, ముద్దొస్తున్నావంటూ యువతికి లిప్ కిస్ ఇచ్చిన చిలుక, ధన్యవాదాలు బేబీ అంటూ మరిన్ని ముద్దులు పెట్టిన యువతి

Hazarath Reddy

సోషల్ మీడియాలో చిలుకలకు సంబంధించిన అనేక వీడియోలు దర్శనమిస్తున్నాయి. తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది. కెనడాలో నివసిస్తున్న తమరా మెర్సర్ అనే అందమైన యువతి.. కివి అనే బ్లూ చిలుకను పెంచుకుంటోంది. ఆ చిలుకకు మెర్సర్ చాలా మాటలు నేర్పించింది.

Earthquake in Ecuador: ఈక్వెడార్‌లో భారీ భూకంపం, 14 మంది మృతి, ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టిన ప్రజలు, రిక్టరు స్కేలుపై తీవ్రత 6.8గా నమోదు

Hazarath Reddy

పెరు, ఈక్వెడార్‌లోని గయాస్ తీరప్రాంతంలో శనివారం రిక్టరు స్కేలుపై 6.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. 66 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.భూకంపం ధాటికి మచాలా, క్యుయెన్సా నగరాల్లో చాలా ఇళ్లు, భవనాలు నేలమట్టం అయ్యాయి.

Advertisement

Covid Found in Raccoon Dogs: చైనాలో కుక్కల్లో కరోనా వైరస్, వుహాన్‌లోని ‘రకూన్‌’ జాతి కుక్కల్లో వైరస్‌ ఆనవాళ్లను కనుగొన్న అంతర్జాతీయ నిపుణుల బృందం

Hazarath Reddy

చైనా నుంచి సంచలన వార్త బయటకు వచ్చింది. సెంట్రల్ చైనాలోని వుహాన్ నగరంలోని సీఫుడ్ మార్కెట్ నుండి సేకరించిన జన్యు నమూనాల కొత్త విశ్లేషణ వేదిక వద్ద విక్రయించే రక్కూన్ కుక్కలలో SARS-CoV-2 వైరస్ ఉనికిని (Covid Found in Raccoon Dogs) కనుగొన్నారు.

Mario Molina Birth Anniversary: మారియో మొలీనా 80వ జయంతి నేడు, ప్రపంచాన్ని భయపెట్టిన ఓజోన్ రంధ్రం గురించి బయట ప్రపంచానికి తెలిపిన ప్రముఖ శాస్త్రవేత్త గురించి తెలుసుకుందామా..

Hazarath Reddy

మెక్సికన్ కెమిస్ట్ మారియో మొలీనా స్మృతిలో నేటి డూడుల్‌ను రూపొందించడం జరిగింది. భూమికి రక్షణ కవచంలా ఉండే ఓజోన్ లేయర్‌కు క్లోరోఫ్లోరోకార్బన్‌లు నష్టం కలిగిస్తాయని, అంటార్కిటికా పైన ఉండే ఓజోన్ లేయర్‌లో రంధ్రం ఉందని కనుగొనడంలో ఈయన సహాయపడ్డారు.

Peru Earthquake: పెరు, ఈక్వెడార్‌లను కుదిపేసిన భారీ భూకంపం.. 6.8 తీవ్రతతో భూమికి 66 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం.. కుప్పకూలిన భవనాలు.. 12 మంది మృత్యువాత

Rudra

పెరు, ఈక్వెడార్‌లను నిన్న భారీ భూకంపం కుదిపేసింది. 6.8 తీవ్రతతో వచ్చిన ఈ శక్తిమంతమైన భూకంపం కారణంగా భవనాలు పేకమేడల్లా కుప్పకూలాయి.

Nithyananda: అగ్రరాజ్యం అమెరికాకు నిత్యానంద షాక్.. 30 నగరాల్లో ఫోర్జరీ చర్యలు.. ‘సిస్టర్ సిటీ’ పేరిట ఒప్పందాలు.. వీడియోతో

Rudra

లైంగిక వేధింపులు, కిడ్నాప్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ వివాదాస్పద గురు నిత్యానంద భారత్ నుంచి పరారైన విషయం విధితమే. ఆ తరువాత దక్షిణ అమెరికా దీవుల్లో తిష్టవేసి ఆ ప్రాంతాన్ని కైలాస దేశంగా స్వయం ప్రకటన చేసుకున్నాడు. తాజాగా నిత్యానంద అమెరికాలోని 30 నగరాల్లో ఫోర్జరీకి పాల్పడ్డాడని సమాచారం.

Advertisement

SVB Goes Bankrupt: దివాలా కోసం దాఖలు చేసిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ప్రముఖ అమెరికన్ బ్యాంకు

Hazarath Reddy

ది స్పెక్టేటర్ ఇండెక్స్ చేసిన ట్వీట్ ప్రకారం, సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అధికారికంగా దివాలా కోసం దాఖలు చేసింది. నివేదికల ప్రకారం, గత వారం US స్వాధీనం చేసుకున్న సిలికాన్ వ్యాలీ బ్యాంక్ యొక్క పేరెంట్, చాప్టర్ 11 దివాలా రక్షణ కోసం దాఖలు చేస్తున్నారు.

US Horror: యుఎస్‌లో దారుణం, మహిళను చంపి గుండెను కోసి అత్తమామలకు కూరను వండి పెట్టిన అల్లుడు, తినకపోవడంతో వారిని కత్తితో పొడిచి దారుణంగా హత్య

Hazarath Reddy

యుఎస్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి (US Man Lawrence Paul Anderson) మహిళను హత్య చేసి ఆమె గుండెను కోసి, ఇంటికి తీసుకువెళ్లి కూరను వండాడు. కుటుంబ సభ్యులకు తినిపించేందుకు ప్రయత్నించాడు. అనంతరం జరిగిన గొడవలో ఇద్దరు కుటుంబ సభ్యులను కత్తితో పొడిచి చంపాడు.

First Republic Bank Down: సంక్షోభంలో మరో అతి పెద్ద అమెరికన్ బ్యాంక్, కుప్పకూలిన ఫస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంక్‌ షేర్లు

Hazarath Reddy

అమెరికాను బ్యాంకుల సంక్షోభం వెంటాడుతోంది. ఇప్పటికే రెండు బ్యాంక్‌ల పతనాన్ని చూసిన అమెరికాలో 14వ అతిపెద్దదైన ఫస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంక్‌ లిక్విడిటీ కొరతతో సంక్షోభంలోకి (First Republic Bank Down) కూరుకుపోతుందనే వార్తలు (Third collapse in a week) ఆందోళన కలిగిస్తున్నాయి.

Removing Condom During Sex: శృంగారం మధ్యలో కండోమ్ తీసేసిన ప్రియుడు, కోర్టు కెక్కిన ప్రియురాలు, దోషిగా నిర్ధారించి శిక్ష విధించిన న్యాయస్థానం..

Hazarath Reddy

తన భాగస్వామి అనుమతి లేకుండా సెక్స్‌లో కండోమ్‌ను తీసివేసినందుకు (Removing Condom During Sex) డచ్ వ్యక్తిని కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ విచారణ నెదర్లాండ్స్‌లో "స్టెల్తింగ్" కోసం జరిగిన మొదటి నేర విచారణగా పరిగణించవచ్చు

Advertisement

Balesh Dhankhar: మత్తు మందు ఇచ్చి 13 మందిపై అత్యంత జుగుప్సాకరంగా అత్యాచారం, సిడ్నీలో భారత సంతతి వ్యక్తి బాలేష్ ధంఖర్‌పై కొరియన్ మహిళలు ఫిర్యాదు

Hazarath Reddy

సిడ్నీలోని భారతీయ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి బాలేష్ ధంఖర్ ఐదుగురు మహిళలకు డ్రగ్స్ ఇచ్చి (Indian-origin man Balesh Dhankhar), నకిలీ ఉద్యోగ ప్రకటనతో ప్రలోభపెట్టి అత్యాచారం చేశాడని ఆరోపణలు వచ్చాయి.

Tik Tok Ban In Britain: బ్రిటన్ లోనూ టిక్ టాక్ పై నిషేధం.. ప్రభుత్వ పరికరాల్లో బ్యాన్ చేస్తూ నిర్ణయం.. అనుమతి ఉన్న యాప్ లనే వినియోగించాలని ఆదేశాలు

Rudra

చైనాకు చెందిన ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లోని కంప్యూటర్లు, ఉద్యోగులకు ప్రభుత్వం అందించే ల్యాప్ టాప్ లు, ట్యాబ్ లు, స్మార్ట్ ఫోన్లలో టిక్ టాక్ వినియోగంపై బ్రిటన్ ప్రభుత్వం నిషేధం విధించింది.

Covid XBB 1.16 Variant: మళ్లీ వణికిస్తున్న కొత్త కరోనా వేరియంట్‌, నాలుగో వేవ్ తప్పదనే భయాలు, అప్రమత్తంగా ఉండాలని తెలంగాణతో సహా ఆరు రాష్ట్రాలకు కేంద్రం లేఖలు

Hazarath Reddy

దేశంలో తొలి కరోనా కేసు గుర్తించి మూడేళ్లు దాటింది.అంతా తగ్గిపోయిందనుకుంటున్న తరుణంలో కొత్త వేరియంట్ తో పాటు ఇన్‌ఫ్లూయెంజా కేసులు దడ పుట్టిస్తున్నాయి. భారత్ లో తాజాగా కరోనా కొత్త వేరియంట్‌ XBB 1.16 వెలుగుచూడటం కలవరపాటుకు గురి చేస్తోంది.

Omicron Subvariant XBB.1.5: కరోనా ఇంకా పోలేదు, ఒమిక్రాన్ ఉపవేరియంట్ XBB.1.5తో పెను ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్న నిపుణులు

Hazarath Reddy

infectious, Lancet Infectious Diseases, Omicron, Omicron Subvariant, SARS-CoV-2, Omicron Transmissible, XBB.1.5 Variant, ఒమిక్రాన్, ఒమిక్రాన్ సబ్ వేరియంట్

Advertisement

California Storm: అమెరికాలోని కాలిఫోర్నియాలో అత్యవసర పరిస్థితి, రాష్ట్రాన్ని ఒక్కసారిగా ముంచెత్తిన మరో తుఫాన్, 3,60,000లకు పైగా ఇళ్లకు పవర్ కట్

Hazarath Reddy

ఇప్పటికే వరదలతో అల్లాడుతున్న అమెరికాలోని కాలిఫోర్నియాను తాజాగా మరో తుఫాన్‌ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో 3,60,000లకుపైగా ఇండ్లు, వ్యాపార సముదాయాలకు పవర్ నిలిచిపోయింది. చాలా మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు.

Migrant Boat Sinks Off: ఘోర విషాదం, హిందూ మహా సముద్రంలో పడవ మునక, 34 మంది జల సమాధి, 24 మందిని కాపాడిన మత్స్యకారులు

Hazarath Reddy

శనివారం రాత్రి వాయవ్య మడగాస్కర్‌ తీరం దగ్గర్లోని హిందూ సముద్రజలాల్లో పడవ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 34 మంది జల సమాధి అయ్యారు. వీరంతా బతుకుదెరువు కోసం సముద్రమార్గంలో విదేశానికి వలసవెళ్తున్న శరణార్థులుగా గుర్తించారు.

Turkey Floods: భూకంపం నుంచి కోలుకుంటున్న టర్కీపై విరుచుకుపడిన వరదలు, 13 మంది మృతి, ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు అంతా అస్తవ్యస్తం

Hazarath Reddy

ప్రకృతి ప్రకోపంతో టర్కీ అల్లాడిపోతోంది. భీకర భూంకంప నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టర్కీపై వరదలు విరుచుకుపడ్డాయి. అదియమాన్, సాన్లీయుర్ఫా ప్రావిన్స్‌లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి

Nepal PM Twitter Hacked: ఏకంగా ప్రధాని ట్విట్టర్‌నే హ్యాక్‌ చేసిన కేటుగాళ్లు, అధికారిక ఖాతాలో ప్రొఫైల్ పిక్చర్‌ మార్చిన సైబర్ అటాకర్స్

VNS

నేపాల్‌ (Nepal) ప్రధాని పుష్ప కమల్‌ దహల్‌ (Pushpa Kamal Dahal) అధికారిక ట్విట్టర్‌ ఖాతా (official Twitter) హ్యాక్‌కు గురైంది. దహల్‌ ప్రొఫైల్‌కు బదులుగా ప్రో ట్రేడర్ల కోసం నాన్‌-ఫంగబుల్‌ టోకెన్‌ మార్కెట్‌ ప్లేస్‌ అయిన బీఎల్‌యూఆర్‌ (BLUR) కనిపించింది. ట్విట్టర్‌ హ్యాండిల్‌ మాత్రం @PM_nepal_ అని ఉంది. అయితే అకౌంట్‌ను వెంటనే పునరుద్ధరించారు.

Advertisement
Advertisement