World

Maharashtra Vikas Aghadi: 'మహా'లో మహారాష్ట్ర వికాస్‌ ఆఘాడి కూటమి, అధికార ఏర్పాటుకు తెరుచుకున్న దారులు, పదవుల పంపకాలపై ఇంకా రాని స్పష్టత

Hazarath Reddy

మహారాష్ట్రలో అధికార ఏర్పాటు(Maharashtra government formation)కు తలుపులు తెరుచుకున్నాయి. అక్కడ అధికారాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌(Shiv Sena, NCP and Congres) సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుదిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే మరో నాలుగైదు రోజుల్లో కొత్త సర్కారు కొలువుదీరే అవకాశం ఉన్నది.

FIR Filed Against Nithyananda: నిత్యానందపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు, చిన్నారులను కిడ్నాప్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్, నేపాల్‌లో తల‌దాచుకున్న నిత్యానంద

Hazarath Reddy

స్వామి నిత్యానందపై గుజరాత్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు (FIR filed Against Nithyananda) చేశారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని తమ ఆశ్రమంలో​ నలుగురు చిన్నారులను విరాళాల సేకరణకు ఉపయోగించుకుంటూ ఆశ్రమంలో దిగ్బంధించారనే ఆరోపణలపై నిత్యానంద(Self-Styled Godman Nithyananda)పై కేసు నమోదు చేశారు.

Andhra Techie In Pakistan Case: 'పాకిస్థాన్ చేసిన అరెస్ట్ ప్రకటన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, రెండేళ్ల క్రితమే భారత పౌరుల మిస్సింగ్ గురించి పాకిస్థాన్‌కు సమాచారం ఇచ్చాం'! కాన్సులర్ యాక్సెస్ ఇవ్వాలని భారత్ డిమాండ్

Vikas Manda

2016-17 మధ్యకాలంలో ఆ ఇద్దరు అనుకోకుండా భారత సరిహద్దును దాటి పాకిస్థాన్ లోకి ప్రవేశించారని రవీష్ కుమారు తెలిపారు. అయితే పాకిస్థాన్ ప్రభుత్వానికి ఈ సమాచారాన్ని అందించాము అయితే పాకిస్థాన్ ....

Political Map of India: భారతదేశ నూతన చిత్రపటం చూశారా? ఇక మీదట ఈ సరికొత్త రాజకీయ చిత్రపటాన్నే ఉపయోగించాలని అడ్వైజరీ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం

Vikas Manda

ఈ నూతన చిత్ర పటంలో లద్దాఖ్ యూటీ కార్గిల్ మరియు లేహ్ రెండు జిల్లాలను కలిగి ఉంది. ఇక మిగతా భాగం జమ్మూ కాశ్మీర్ యొక్క పూర్వ రాష్ట్రం లాగే ఉంచబడింది....

Advertisement

Aadhaar Linking To Social Media: సోషల్ మీడియాకు ఆధార్ లింక్ అనుసంధానించే ఆలోచనేది లేదు, పౌరుల గోప్యత హక్కును రక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది, కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ వెల్లడి

Hazarath Reddy

గత కొంత కాలంగా సోషల్ మీడియాకు ఆధార్ అనుసంధానం(Aadhaar Linking To Social Media) ఇస్తారనే వార్తలు వెలువడుతున్నాయి. అయితే వీటిపై కేంద్ర ప్రభుత్వం (Central government) అధికారికంగా ఇంతవరకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కాగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ (Union Minister Ravi Shankar Prasad) దీనిపై పార్లమెంట్ సమావేశాల్లో క్లారిటీ ఇచ్చారు. సోషల్‌ మీడియా ఖాతాలతో ఆధార్‌ను అనుసంధానించే ఆలోచన ( no plans to link Aadhaar with social media account) ప్రభుత్వానికి లేదని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ స్పష్టం చేశారు.

MLA Blows Flying Kiss To Speaker: స్పీకర్‌కి గాల్లో ముద్దులు ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహినీపతి, ఒడిషా అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం, కృతజ్ఙతతోనే ఇలా చేశానని చెప్పిన కాంగ్రెస్ ఎమ్మెల్యే..

Hazarath Reddy

ఒడిషా అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఒడిషాలో అసెంబ్లీ సమావేశాలు(Odisha Assembly) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో స్పీకర్ ఎస్ఎన్ పాత్రో(Speaker Surjya Narayan Patro)కు చిత్రమైన అనుభవం ఎదురయింది. సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహినీపతి (Congress MLA Taraprasad Bahinipati) తన నియోజక వర్గ సమస్యలను ప్రస్తావిస్తుండగా స్పీకర్ ఆయన్నిప్రశంసించారు.

One Nation-One Pay Day: ఇక జీతాల ఆలస్యం జరగదు, దేశమంతటా ఉద్యోగస్తులందరికీ ఒకే రోజు జీతాలు చెల్లించేలా 'ఒకే దేశం- ఒకే రోజున వేతనం' పథకాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్న మోదీ సర్కార్

Vikas Manda

దేశవ్యాప్తంగా ఒకే రేషన్ కార్డ్ విధానాన్ని కూడా అమలు చేసే అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. దేశవ్యాప్తంగా గల 23 కోట్ల మంది రేషన్ కార్డు దారులందరికీ లబ్ది చేకూరేలా జాతీయ ఆహార భద్రత చట్టం ద్వారా....

KRKR Trailer 2: 'కొడుకు మీద ప్రేమతో పార్టీని మొత్తం సర్వనాశనం చేశాడు, కూర్చో.. కళ్లు పెద్దవి చేస్తే ఎవరూ భయపడరు ఇక్కడ' గత ఎన్నికల వేడిని మళ్లీ రాజేస్తున్న కమ్మరాజ్యంలో కడప రెడ్లు ట్రైలర్ 2

Hazarath Reddy

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ రాజకీయాలను టార్గెట్ చేస్తూ తీస్తున్న కమ్మరాజ్యంలో కడప రెడ్లు మూవీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాపై అనేక విమర్శలు వస్తున్నప్పటికీ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా మారిన వర్మ అవేం పట్టించుకోవడం లేదు. పైగా సినిమా ప్రమోషన్స్ ని పీక్ స్థాయికి తీసుకువెళుతున్నాడు.

Advertisement

Sanjay Raut: దూకుడు పెంచిన సంజయ్ రౌత్, రైతుల సమస్యలతో ప్రధాని వద్దకు.., శరద్ పవార్ పై మాకు అనుమానమే లేదు, డిసెంబర్ మొదటివారంలో శివసేన ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏర్పాటు

Hazarath Reddy

మహారాష్ట్ర రాజకీయాలు కొత్త కొత్త సస్పెన్స్‌లకు చోటు ఇస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి 28 రోజులు గడుస్తున్నా.. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో నెలకొన్న ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. నవంబర్‌ 12 తర్వాత ఏ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు చేయకపోవడంతో మహారాష్ట్రలో గవర్నర్ రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే.

Mamata Banerjee vs Asaduddin: బెంగాల్‌లో తీవ్రవాదులుగా మారుతున్న మైనారిటీలు, సంచలన వ్యాఖ్యలు చేసిన పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, దీదీ వ్యాఖ్యలపై స్పందించిన ఎంఐఎం చీఫ్ అస‌దుద్దీన్ ఓవైసీ

Hazarath Reddy

పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌ బిహార్‌లో నిర్వహించిన ఓ ర్యాలీలో పాల్గోన్న బెంగాల్ సీఎం, తృణ‌మూల్ కాంగ్రెస్ చీఫ్ మ‌మ‌తా బెన‌ర్జీ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. బెంగాల్‌లో కొంద‌రు మైనార్టీలు తీవ్ర‌వాదులుగా మారుతున్న‌ట్లు ఆమె కామెంట్ చేశారు. హిందువుల్లో తీవ్ర‌వాదులు ఉన్న‌ట్లుగానే.. మైనార్టీల్లోనూ తీవ్ర‌వాదం పుట్టుకువ‌స్తోంద‌న్నారు.

Agra To Be Called Agravan?: ఆగ్రా పేరు మళ్లీ మారబోతుందా?, అగ్రావన్‌గా మార్చాలంటూ అంబేడ్కర్‌ వర్సిటీకి లేఖ రాసిన యోగీ ప్రభుత్వం, ఇప్పటికే పేర్లు మార్చుకున్న అలహాబాద్‌, ఫైజాబాద్

Hazarath Reddy

దేశంలోని పలు ప్రాంతాల పేర్లను మార్చే ప్రక్రియ కొనసాగుతోంది. ఇక ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం (Yogi Adityanath government)అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రముఖ నగరాల పేర్లు ఒక్కొక్కటిగా మారుతున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో ఆగ్రా (AGRA) కూడా చేరనుంది.

Vizag Man Arrested In Pakistan: ప్రేమ విఫలం, పాకిస్థాన్‌లో ప్రత్యక్షం. ఇద్దరు భారతీయులను అరెస్ట్ చేసిన పాకిస్థాన్ పోలీసులు, అందులో ఒకరు విశాఖ వాసిగా గుర్తింపు

Vikas Manda

బాబూరావు కుటుంబం 5 ఏళ్ల క్రితం విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వచ్చారు. ఆయన కుమారుడు ప్రశాంత్ కూడా మాదాపూర్ లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేసే వాడు. అయితే రెండేళ్ల క్రితం ఆఫీస్ నుంచి ఇంటికి రాలేదు. దీనిపై ఏప్రిల్ 29, 2017న బాబూరావు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు....

Advertisement

Onions Price @ Rs.220: కిలో ఉల్లి ధర రూ. 220, బంగ్లాదేశ్‌లో కోయకుండానే కన్నీరు తెప్పిస్తున్న ఉల్లి, ధరల పెరుగుదలతో వాడకాన్ని ఆపేసిన బంగ్లా ప్రధాని హసీనా, పలుచోట్ల వినియోగదారులు ఆందోళన

Hazarath Reddy

ఆనియన్ ధరలు ప్రపంచ దేశాల్ని కలవరానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాసియాలో కొయ్యకుండానే ఉల్లి ధరలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. భారత్ లో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా ఉల్లి పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. దీంతో సెప్టెంబర్ నెల నుంచి ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేదం విధించింది.

International Men's Day: మగజాతి ఆణిముత్యాల్లారా.. పండగ చేస్కోండి, ఈరోజు మీరోజు. నేడు ప్రపంచ పురుషుల దినోత్సవం, ఈరోజుకున్న విశిష్టత ఎంటో తెలుసుకోండి

Vikas Manda

సమాజంలో మగవారు నిర్వహించే కుటుంబ బాధ్యత, కుటుంబ సభ్యుల పోషణ మరియు వారి సంరక్షణ కోసం మగవారు చేసే కృషిని, త్యాగాలను గుర్తించడమే ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మగాడైనా, వాడూ మనిషే, వారి పట్ల మానవతతో వ్యవహరించాలి అని చాటిచెప్పటం ....

Cartosat-3: ఉగ్ర కదలికలను పసిగట్టనున్న కార్టోశాట్-3, చంద్రయాన్-2 తరువాత ఇస్రో మరో ప్రయోగం, దీంతో పాటుగా కక్ష్యలోకి మ‌రో 13 క‌మ‌ర్షియ‌ల్ నానోశాటిలైట్ల‌ు, నవంబర్ 25న అమెరికా నుంచి ప్రయోగం

Hazarath Reddy

చంద్రయాన్-2 ప్రయోగం తరువాత భారత అంతరిక్షపరిశోధన సంస్థ ఇస్రో (Indian Space Research Organisation) రెండు నెలల గ్యాప్‌లోనే మరో ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. నవంబర్ 25న కార్టోగ్రఫీ ఉపగ్రహం కార్టోశాట్-3(Cartosat-3)ని నింగిలోకి పంపనుంది. ఇందులో 13 కమర్షియల్ నానోశాటిలైట్‌(13 nanosatellites)లు కూడా ఉన్నట్లు ఇస్రో పేర్కొంది.

Rajinikanth VS CM K Palaniswami: రేపు సీఎం ఎవరైనా కావచ్చు, తమిళనాడు సీఎం ఎడపాటి వ్యాఖ్యలకు కౌంటర్ వేసిన రజినీకాంత్, మరో శివాజీ గణేశన్‌లా తలైవార్ మిగిలిపోతారన్న తమిళనాడు సీఎం

Hazarath Reddy

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి కె పళనిస్వామి(Palaniswami) వ్యాఖ్యలకు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ (Superstar Rajinikanth) కౌంటర్ వేశారు. రజనీకాంత్, కమల్‌ హాసన్‌ ఇద్దరూ రాష్ట్ర రాజకీయాల్లో మరో శివాజీగణేశన్‌లా మారిపోగలరని తమిళనాడు సీఎం ఎడపాడి (Tamil Nadu Chief Minister K Palaniswami) వ్యాఖ్యానించిన సంగతి విదితమే.

Advertisement

Sri Lanka: శ్రీలంక నూతన అధ్యక్షుడిగా గోటబయ రాజపక్స, అధ్యక్ష పీఠం కోసం జరిగిన ఎన్నికల్లో గోటబయ సారత్యంలోని ఎస్‌ఎల్‌పిపి పార్టీ ఘన విజయం

Vikas Manda

అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన గోటబయ గతంలో రిటైర్డ్ సైనికుడు. తన అన్నయ్య మహీంద రాజపక్సే అధ్యక్షుడిగా ఉన్న (2005-2015) కాలంలో ఆయన శ్రీలంక రక్షణ మంత్రి పదవిని చేపట్టారు. కాగా, ప్రస్తుతం...

Abdul Jabbar Passes Away: భోపాల్ గ్యాస్ బాధితుల ఉద్యమ నేత కన్నుమూత, తీవ్ర అనారోగ్యంతో పోరాడుతూ తిరిగిరాని లోకాలకు, ఆయన వైద్య ఖర్చులను భరిస్తామన్న కాంగ్రెస్, అంతలోనే విషాదం

Hazarath Reddy

భోపాల్ గ్యాస్ బాధితుల ఉద్యమ కిరణం నేలరాలింది. 1984 భోపాల్ గ్యాస్ బాధితుల తరపున సుదీర్ఘ కాలం నుంచి పోరాడుతున్న ఉద్యమ నేత అబ్దుల్‌ జబ్బర్‌ అనారోగ్యం(Abdul Jabbar passes away)తో మరణించారు. గత కొంత కాలంగా ఆయన తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో గురువారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు.

Earthquake In Nicobar Islands: నికోబార్ దీవుల్లో భూప్రకంపనలు, రిక్టర్ స్కేలుపై 5.0గా నమోదైన భూకంప తీవ్రత, భయాందోళనకు గురయిన ప్రజలు

Hazarath Reddy

బంగాళాఖాతానికి దక్షిణాన హిందూ మహసముద్రంలో ఉన్న నికోబార్ దీవుల్లో శుక్రవారం భూప్రకంపనలు (major earthquake) సంభవించాయి. నికోబార్ దీవుల్లో(Nicobar Islands region) గురువారం అర్దరాత్రి దాటాక భూమి ప్రకంపించడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలు చెందారు. భూప్రకంపనలతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చారు. నికోబార్ దీవుల్లో భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.0గా నమోదైందని భారత వాతావరణశాఖ అధికారులు( India Meteorological Department) చెప్పారు.

Musharraf Says ‘Laden Our Hero’: పాక్ ప్రజలకు ఒసామా బిన్ లాడెన్ హీరో, సంచలన వ్యాఖ్యలు చేసిన పర్వేజ్ ముషారఫ్, భారత్ సైన్యంపై పోరాట కోసం పాక్‌లో శిక్షణ పొందిన కశ్మీరీలు, వీడియో విడుదల చేసిన పాక్ నేత

Hazarath Reddy

పాకిస్తాన్ మాజీ నియంత పర్వేజ్ ముషారఫ్ మరోసారి తన బుద్ధిని చూపించారు. కరడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్‌ లాడెన్‌ తమ హీరో అని పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే విషయంలో పాకిస్తాన్‌ వైఖరిని ఈ విధంగా ముషారఫ్‌ బహిర్గతం చేశారు.

Advertisement
Advertisement