ప్రపంచం
Hyderabadi US Senator: చరిత్ర సృష్టించిన హైదరాబాదీ, అమెరికాలో ట్రంప్ పార్టీ అభ్యర్థిని ఓడించి సెనేటర్‌గా గెలుపొందిన ఘజాలా హష్మి, అమెరికాలో తొలి ముస్లిం మహిళ సెనేటర్‌గా రికార్డ్
Vikas Mandaఇంట్లో అందరూ 'మున్ని' గా పిలుచుకునే ఘజాలా పుట్టి పెరిగింది హైదరాబాదే, ఆ తర్వాత వారి ఫ్యామిలీ అమెరికాకు షిఫ్ట్ అయింది. అక్కడే ఉన్నత విద్యలను అభ్యసించింది.....
RCEP Deal: ఆర్‌సీఈపీలో చేరేది లేదని స్పష్టం చేసిన భారత్, ఒప్పందం ఆమోదంపై చైనా తీవ్ర ప్రయత్నాలు, పదహారు ఆసియా, పసిఫిక్‌ దేశాలతో ఆర్‌సీఈపీ కూటమి,వచ్చే సంవత్సరం ఈ ఒప్పందంపై సంతకాలు చేస్తామని మిగతా దేశాల ప్రకటన
Hazarath Reddyవ్యాపారానికి కీలకమైన ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్‌సీఈపీ–ఆర్‌సెప్‌) (Regional Comprehensive Economic Partnership) ఒప్పందంలో భారత్‌ చేరబోవడం లేదని భారత్‌ స్పష్టం చేసింది. ప్రపంచంలోనే అతి పెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంగా పరిగణిస్తున్న ఆర్‌సీఈపీ(RCEP)లో చేరితే భారత్‌లోకి చైనా నుంచి దిగుమతులు పోటెత్తుతాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో భారత్ తాజా నిర్ణయం తీసుకుంది.
Ayodhya Land Dispute Case: అయోధ్యలో పలు ఆంక్షలు, తీర్పుపై ఎలాంటి పోస్టులు చేయవద్దు, డిసెంబర్‌ 28 వరకు అమల్లోకి ఆంక్షలు, అన్ని ఫోన్ కాల్స్ రికార్డు, హెచ్చరికలు జారీ చేసిన యూపీ రాష్ట్ర డీజీ ఓ.పీ.సింగ్
Hazarath Reddyవివాదాస్పద అయోధ్య కేసు విషయానికి సంబంధించి సోషల్ మీడియా(Social Media)లో రెచ్చగొట్టే పోస్టులను పెట్టి శాంతి భద్రతల సమస్యలకు కారణమయ్యేవారిపై జాతీయ భద్రతా చట్టం ప్రకారం కేసులను నమ్మోదు(Ayodhya)చేస్తామని ఉత్తరప్రదేశ్ యూపీ రాష్ట్ర డీజీ ఓ.పీ.సింగ్ హెచ్చరించారు.
ISRO Aditya-L1 Coming Soon: చంద్రయాన్-2తో కథ ముగిసిపోలేదు, ఆదిత్య ఎల్1తో సత్తా చాటుతాం, విక్రమ్‌ రోవర్ సాఫ్ట్ ల్యాండింగ్ వైఫల్యంతో ఎన్నో విషయాలు నేర్చుకున్నాం, సాఫ్ట్ లాండింగ్ ని నిజం చేసి చూపుతామన్న ఇస్రో ఛైర్మెన్ కె శివన్
Hazarath Reddyచంద్రయాన్-2 ప్రయోగంతో సాంకేతికతపరంగా ఇస్రో ముందుకు వెళ్లిందని ఇస్రో చైర్మన్ శివన్ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే కాలంలో అత్యాధునిక శాటిలైట్ లను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నామని తెలిపారు.ఐఐటీ ఢిల్లీలో జరిగిన స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో స్టాఫ్ ల్యాండింగ్ చేసి తీరుతామని వ్యాఖ్యానించారు.
Kartarpur Corridor: వెలుగులు విరజిమ్ముతున్న కర్తార్‌పూర్‌ కారిడార్‌, అందరూ ఆహ్వానితులే అంటూ పాక్ పీఎం ఇమ్రాన్ ఖాన్ ట్వీట్, నవంబర్ 9న కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభం, అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన దాయాది దేశం
Hazarath Reddyమరో కొద్ది రోజుల్లో కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభం కానున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ వేడులపై ఇమ్రాన్ ఖాన్ ట్విట్టర్లో అందరికీ స్వాగతం పలికారు. గురునానక్‌ 550వ జయంతి వేడుకలకు సిక్కు యాత్రికులను ఆహ్వానించేందుకు గౌరవప్రదమైన వేదిక సిద్ధంగా ఉందని కర్తార్‌పూర్‌ కారిడార్‌ను ఉద్దేశించి పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అన్నారు.
PM Modi Speech On Terrorism: ఉగ్రవాద మూలాలను ఏరిపారేశాం, ఆర్టికల్ 370 రద్దు ప్రకంపనలు ప్రపంచమంతటా ప్రతిధ్వనిస్తాయి, అసాధ్యమైన లక్ష్యాలను సుసాధ్యం చేసుకుంటూ వెళుతున్నాం, బ్యాంకాక్‌లో ప్రధాని మోడీ స్పీచ్ హైలెట్స్
Hazarath Reddyకాశ్మీర్‌కు సంబంధించిన ప్రత్యేక హోదాను రద్దు చేయడం ద్వారా ఉగ్రవాదం, వేర్పాటువాదాలను తమ ప్రభుత్వం అణచివేసిందని భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) స్పష్టం చేశారు. దేశంలో ఉగ్రవాదం, వేర్పాటువాదం వేళ్లూనుకునేందుకు గల కారణాన్ని గుర్తించి, తొలగించినట్లు ఆయన తెలిపారు.
Sawasdee PM Modi: బ్యాంకాక్‌లో ప్రధాని మోడీకి ఘనస్వాగతం, మూడు రోజుల పాటు టూర్, సవస్దీ పీఎం మోడీలో ప్రధాని ప్రసంగం, థాయ్‌లాండ్‌కు ఇది నా మొదటి అధికారిక పర్యటన అంటూ ప్రారంభం
Hazarath Reddyభారత్-థాయ్‌లాండ్ (Thailand) మధ్య చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగప్వామ్యం చర్యలు ఓ కొలిక్కి తెచ్చేందుకు ప్రధాని మోడీ బ్యాంకాక్ చేరుకున్నారు. మొత్తం మూడు రోజుల పాటు ప్రధాని మోడీ థాయ్‌లాండ్ టూర్ కొనసాగనుంది.
Call Ring TIme: 30 సెకన్ల పాటు కాల్ రింగ్ ఉండాలి, ల్యాండ్ లైన్ అయితే 60 సెకండ్లు, ట్రాయ్ తాజా నిర్ణయం, టెలికాం సంస్థల వార్ ముగిసినట్లే !
Hazarath Reddyగత కొంత కాలంగా మొబైల్ రింగ్‌పై టెలికం ఆపరేటర్ల మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మొబైల్ ఫోన్‌‌కు చేసే ఇన్‌‌కమింగ్ కాల్స్‌‌ రింగ్ టైమ్ కనీసం 30 సెకన్లు ఉండాలని టెలికాం రెగ్యులేటరీ సంస్థ (ట్రాయ్) నిర్దేశించింది.
Pakistan Biggest Issues: కాశ్మీర్ సమస్య కానే కాదు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణమే పాకిస్తాన్‌ను పట్టి పీడిస్తున్నాయి, పాక్ ఆర్థిక పరిస్థితిపై ప్రజల్లో ఆందోళన, గల్లప్‌ అండ్‌ గిలానీ ఇంటర్నేషనల్‌ అధ్యయనపు నిజాలు
Hazarath Reddyఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన దాయాది దేశం పాకిస్థాన్‌లో కశ్మీర్‌ సమస్య కంటే ద్రవ్యోల్బణం, నిరుద్యోగమే ప్రజలను ఎక్కువగా కలవరపెడుతున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. పాకిస్తాన్‌ ప్రజలను పట్టి పీడిస్తోంది ద్రవ్యోల్బణమే తప్ప కశ్మీర్‌ సమస్య కాదని గల్లప్‌ ఇంటర్నేషనల్‌ నిర్వహించిన తాజా అధ్యయనం తేల్చి చెప్పింది.
Twitter Bans Political Campaigns: రాజకీయ ప్రచారాలను బ్యాన్ చేస్తున్న ట్విట్టర్, ఇకపై ఎటువంటి యాడ్స్ కనపడవు, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని నిర్ణయం, వెల్లడించిన ట్విట్టర్‌ సీఈవో జాక్‌ డోర్సీ
Hazarath Reddyసోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ట్విట్టర్ రాజకీయ పార్టీలకు ఝలక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్‌ వేదికపై రాజకీయ ప్రచారాన్ని నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. సామాజిక మాధ్యమాల్లో రాజకీయ నేతలు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ట్విట్టర్‌ ఈ నిర్ణయం తీసుకుంది.
India Strong Warning: చైనాకు వార్నింగ్ ఇచ్చిన భారత్, జమ్మూ కాశ్మీర్‌ను యూటీ చేయటం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన చైనా, తమ వ్యవహారాల్లో చైనా సహా ఏ దేశం జోక్యం చేసుకున్నా సహించమని ఘాటుగా స్పందించిన భారత్
Vikas Mandaజమ్మూ కాశ్మీర్ మరియు లద్దాఖ్ యూటీలకు చెందిన చాలా భూభాగాన్ని చైనా దురాక్రమణ చేపట్టింది. 1963 చైనా-పాకిస్తాన్ సరిహద్దు ఒప్పందం పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని భారత భూభాగాలను చట్టవిరుద్ధంగా చైనా స్వాధీనం చేసుకుంది....
Tezgam Express Fire: ఒకరు చేసిన తప్పిదంతో ఎంతో మంది సజీవ దహనం, పాకిస్థాన్ తేజ్‌గామ్ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదంలో అంతకంతకు పెరుగుతున్న మృతుల సంఖ్య
Vikas Manda. రైల్లోని ఒక ప్రయాణీకుడు తనతో పాటు తెచ్చుకున్న గ్యాస్ సిలిండర్ పేలడమే ఈ అగ్ని ప్రమాదానికి కారణం అని చెప్పారు. ఆ ప్రయాణికుడు గ్యాస్ సిలిండర్ తెచ్చుకోవడమే కాకుండా...
EU MP on Kashmir: భారత్- పాక్ అంగీకరిస్తే కాశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వం వహించేందుకు యూరోప్ సిద్ధం! కాశ్మీర్ లోయలో పర్యటిస్తూ యూరోప్ ఎంపీ ప్రతిపాదన, ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా కాశ్మీర్‌లో పర్యటిస్తున్న విదేశీ ప్రజాప్రతినిధుల బృందం
Vikas Mandaఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాశ్మీర్ అంశంలో తాను ఇరుదేశాలకు మధ్యవర్తిత్వం వహిస్తానన్నప్పుడు, అది పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమని, ఇందులో మిమ్మల్ని కష్టపెట్టదలుచుకోలేదని ప్రధాని మోదీ సూటిగా సమాధానం ఇచ్చారు....
‘‘He Died Like A Dog’’: బాగ్దాదీ కుక్క చావు చచ్చాడు, పిరికివాడిలా ఏడుస్తూ తనంతట తానే పేల్చుకున్నాడు, మొత్తం ఆపరేషన్ నేను చూశాను, వైట్‌హౌజ్‌లో మీడియాతో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్
Hazarath Reddyఇస్లామిక్ స్టేట్ వ్యవస్థాపకుడు అబు బకర్ అల్-బాగ్దాదీ కుక్క చావు చచ్చాడని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఆదివారం శ్వేతసౌధంలో ఆయన మాట్లాడుతూ బాగ్దాదీ మరణించాడని తనంతట తానే పేల్చుకుని చనిపోయాడని తెలిపారు.
PM Modi Saudi Arabia Tour: చమురు దేశంలో ప్రధాని టూర్, సౌదీ అరేబియాతో డజను ఒప్పందాలపై చర్చలు, మరోసారి వక్రబుద్ధి చూపిన పాక్, మోడీ విమానం పాక్ గగనతలం మీదకు నో ఛాన్స్, రూపే కార్డు విడుదల
Hazarath Reddyప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన కోసం సౌదీ అరేబియా వెళ్లనున్నారు. అంతర్జాతీయ బిజినెస్‌ ఫోరంలో పాల్గొనేందుకు సౌదీ వెళ్తున్నమోడీ వ్యూహాత్మక సంబంధాల బలోపేతం, వలసలు, చమురు వంటి కీలక అంశాలపై సౌదీ రాజుతో చర్చలు జరపనున్నారు.
IS Chief AL Baghdadi Death: అబుబాకర్‌ ఆల్‌ బాగ్దాది హతమైనట్లు వార్తలు, ఐసిస్‌ ఉగ్రవాద సంస్థపై అమెరికా సైన్యం దాడులు , డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ సారాశం ఇదేనా ? ఇంకా ధృవీకరించని ఫోరెన్సిక్ టెస్ట్
Hazarath Reddyఇస్లామిక్ స్టేట్స్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌ సిరియా పేరుతో ప్రపంచాన్ని వణికించిన ఐసిస్‌ ఉగ్రవాద సంస్థ అధినేత అబుబాకర్‌ ఆల్‌ బాగ్దాదిని అమెరికా సైనిక బలగాలు హతమార్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్‌ అధికారి ఒకరు ఓ ప్రకటన విడుదల చేశారు.
Ayodhya Deepotsav 2019: 6 లక్షల దీపాల వెలుగుల్లో అయోధ్య, గిన్నిస్ రికార్డు సాధించిన అయోధ్య దీపోత్సవం, దీపాలతో వెలుగులు విరజిమ్మిన సరయూ నదీ తీరం
Hazarath Reddyఅయోధ్యలోని సరయూ నది తీరం దేదీప్యమానంగా వెలిగిపోయింది. ఏకంగా 6 లక్షల దీపాలను వెలిగించారు. దీపావళి వేడుకల్లో భాగంగా శనివారం నిర్వహించిన ‘దీపోత్సవం’ కన్నుల పండువగా సాగింది. యూపీ సర్కారు ఆధ్వర్యంలో రాష్ట్ర పండుగగా ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు.
Ayodhya Deepotsav Celebrations: గిన్నిస్ వరల్డ్ రికార్డు దిశగా అయోధ్య, 5.51లక్షల మట్టి ప్రమిదలతో దీపోత్సవం, ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ ప్రభుత్వం, కన్నులపండువగా రాముడి పట్టాభిషేకం
Hazarath Reddyదీపావళి పండుగ సంబురాలలో ఉత్తరప్రదేశ్ వెలిగిపోతోంది. ముఖ్యంగా దీపావళి సందర్భంగా శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో సీఎం ఆదిత్యానాథ్ ప్రభుత్వం 5.5 లక్షల దీపోత్సవాన్ని చేయటానికి విస్తృత ఏర్పాట్లు చేసింది.
Donald Trump: అమెరికాలో ఘనంగా దీపావళి వేడుకలు, హాజరైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మతసామరస్యానికి ప్రతీక దీపావళి పండుగ, బలవంతపు మత మార్పిడిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమన్న ట్రంప్
Hazarath Reddyతమ దేశంలో మత స్వాతంత్య్రానికి దీపావళి వేడుకలే నిదర్శనమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. చీకటిపై వెలుతురు, చెడుపై మంచి, అఙ్ఞానంపై ఙ్ఞానం సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి జరుపుకొంటారని పేర్కొన్నారు.
Cyclone Kyarr: దూసుకొస్తున్న క్యార్ తుఫాను, మహారాష్ట్రకు పొంచి ఉన్న ముప్పు, 3 రోజుల పాటు భారీ వర్షాలు, అతలాకుతలమైన ఏపీలోని ఉత్తరాంధ్ర, పలు రైళ్లు రద్దు
Hazarath Reddyతూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి మహారాష్ట్ర తీరంవైపు కదులుతోంది. దీంతో కర్నాటక, మహారాష్ట్రలకు తుఫాను గండం పొంచి ఉంది. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాకు 190 కిలోమీటర్ల దూరంలో క్యార్ తుఫాను ఉంది. శనివారం ఉదయం కల్లా ఈ తుఫాను బలపడి బీభత్సం సృష్టించేందుకు సిద్ధంగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది.