Iranian women chop hair, burn hijab to mark protest over death of Mahsa Amini (Photo Credit: Twitter, Masih Alinejad)

Tehran [Iran], September 19: ఇరాన్‌లో మోరల్‌ పోలీసింగ్‌పై మహిళా లోకం ఎదురు తిరిగింది. 22 ఏళ్ల మహ్‌సా అమినీ ( Death of Mahsa Amini) పోలీసుల వేధింపుల వల్లే మరణించిందనే నేపథ్యంలో ఇరాన్‌లో హిజాబ్‌ వ్యతిరేక ప్రదర్శనలు మిన్నంటాయి. ఇరాన్‌ మహిళలు చాలామం‍ది బహిరంగంగానే హిజాబ్‌లు తొలగించి ( Burn Hijabs to Mark Protest) వాటిని తగలబెడుతున్నారు. మరికొందరు జుట్టును కత్తిరించుకుని (Iranian Women Chop off Hair)వాటిని వీడియోలుగా తీసి వైరల్‌ చేస్తున్నారు. దమ్ముంటే ఏం చేస్తారో చేసుకోండంటూ ఇరాన్‌ పోలీసులకు సవాల్‌ విసురుతున్నారు.

జపాన్‌ కు మరోసారి సునామీ హెచ్చరిక, తైవాన్‌లో భారీ భూకంపం, అలర్టయిన జపాన్, రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.2గా నమోదు, వణికిపోతున్న జపాన్ తీర ప్రాంతాలు

ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో నిండిన వీడియోలే ఇప్పుడు అక్కడ సోషల్‌ మీడియాలో పోటెత్తుతున్నాయి. ఇరాన్‌లో ఏడేళ్లు దాటిన మహిళంతా హిజాబ్‌ ధరించాలనే కఠిన మత నిబంధన ఉంది. షరియా చట్టం ప్రకారం.. జుట్టును కవర్‌ చేసుకోవడంతో పాటు నిండుగా ధరించాల్సిందే. ఒకవేళ ఉల్లంఘిస్తే.. బహిరంగ మందలింపుతో పాటు జరిమానా విధిస్తారు. లేదంటే అరెస్ట్‌ కూడా చేస్తారు.

Here's Updates 

తాజాగా తన కుటుంబంతో ఆ దేశ రాజధాని టెహ్రాన్‌కు వెళ్లిన మహ్‌సా అమినీ.. ఆమె కుటుంబీలకు సమక్షంలోనే అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఆపై హఠాత్తుగా ఆమెను ఆస్పత్రిలో చేర్చగా.. కోమాలో నుంచే కన్నుమూసిందామె. ఈ ఘటనపై ఇరాన్‌ మహిళా లోకం భగ్గుమంది. ఆమెపై ఒంటిపై గాయాలున్నాయని ఆమెది ముమ్మాటికీ వేధింపుల హత్యే అని అమినీ కుటుంబంతో సహా పలువురు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన దేశాన్ని కుదిపేస్తుండడంతో.. అత్యున్నత దర్యాప్తునకు అక్కడి ప్రభుత్వం ఆదేశించింది.