US woman Stabs Boyfriend: నిద్రపోతుండగా పక్కతడిపిన ప్రియుడు, కోపాన్ని ఆపుకోలేక కత్తితో పొడిచిన ప్రియురాలు, లూసియానాలో ఘటన
యూఎస్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. నిద్రపోతున్న సమయంలో మంచంపై మూత్ర విసర్జన చేసినందుకు తన ప్రియుడిని ఓ యువతి కత్తితో (US woman Stabs Boyfriend) పొడిచి హత్యాయత్నానికి పాల్పడింది.
యూఎస్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. నిద్రపోతున్న సమయంలో మంచంపై మూత్ర విసర్జన చేసినందుకు తన ప్రియుడిని ఓ యువతి కత్తితో (US woman Stabs Boyfriend) పొడిచి హత్యాయత్నానికి పాల్పడింది. అమెరికాలోని లూసియానాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రియురాలి చేతిలో మెడ, ఛాతిపై కత్తిపోట్లకు గురైన బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
లూసియానా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు బాధితుడు తన స్నేహితురాలు బ్రియానా లాకోస్ట్ (25)తో గత ఏడాదిన్నర కాలంగా సహజీవనం చేస్తున్నాడు. అయితే, శనివారం రాత్రి నిద్రలో అతను పక్క తడపడంతో (he urinated in bed while asleep) లాకోస్ట్ తీవ్ర ఆగ్రహానికి గురైంది. నిద్రలేచిన వెంటనే అతడిని కొట్టడం ప్రారంభించింది. ఆమె నుంచి తప్పించుకునేందుకు పరుగెత్తగా.. వంటగదిలోని కత్తితో లాక్టోస్ తనను పొడించిందని బాధితుడు పోలీసులకు చెప్పాడు.
కాగా శనివారం రాత్రి ఇద్దరూ మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. దాడి విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. విచారణలో బ్రియానా తన ప్రియుడు మంచంపై పక్క తడపడంతో కలత చెందానని అంగీకరించింది. అనంతరం ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. గొడవలో ప్రియుడు తనను కొట్టడంతో అతడిని పొడిచి తనను తాను రక్షించుకున్నానని ఆమె పోలీసులకు తెలిపింది. తర్వాత అతడిని బ్రియానానే ఆసుపత్రికి తరలించింది.
(The above story first appeared on LatestLY on Jan 18, 2023 01:57 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

