Lahore, FEB 12: దైవ దూషణ కింద జరిగే ఆకృత్యాలు ఆగడం లేదు. మన దేశంలోనే కాదు, ప్రపంచం అంతటా ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక మన పొరుగు దేవం పాకిస్తాన్లో (Pakistan) అయితే తీవ్ర స్థాయిలో ఉంటుంది. దీనికి తాజాగా అక్కడ జరిగిన ఒక సంఘటనే మంచి ఉదాహరణ. ఓ వ్యక్తి దైవ దూషణకు పాల్పడ్డలు ఆరోపణలు రావడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కొందరు ముష్కరులు పోలీస్ స్టేషన్ చేరుకుని లాకప్‌లో ఉన్న అతడిని బయటికి లాగి కొట్టి(Dragged Out Of Jail) చంపారు. మృతుడి పేరు మహమ్మద్ వారిస్. ఈ ఘటన జరిగింది పాకిస్తాన్‌లోని నన్‌కానా సాహిబ్ ప్రాంతం వర్బర్టన్‌లో. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ‘‘మహమ్మద్ వారిస్ అనే వ్యక్తి దైవ దూషణకు పాల్పడినట్లు ఆరోపిస్తూ కొందరు వ్యక్తులు ఆయనపై దాడి చేశారు. దీంతో మేము ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని, పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాము. అయినప్పటికీ ముష్కరులు పోలీస్ స్టేషన్‌లోకి చొరబడి, ఆ వ్యక్తిని బయటకు లాక్కెళ్లారరు. అతడిని కొట్టుకుంటూ, వీధిలో ఈడ్చుకెళ్తూ, నగ్నంగా ఊరేగించారు. చివరికి వారిస్ ప్రాణాలు కోల్పోయాడు’’ (Killed By Mob)అని తెలిపారు.
ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది. మృతుడు ఖురాన్‌ను అపవిత్రం చేసినట్లు ముష్కరులు ఆరోపించారు. చాలా మంది ఈ దారుణాన్ని చిత్రీకరించి, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. బాలలు సైతం పోలీస్ స్టేషన్ గేట్లను ఎక్కి, లోపలికి చొచ్చుకెళ్లి, బాధితుడిని బయటకు లాక్కొచ్చారు. ఇక స్థానికుల చెప్తున్న కథనం మరోలా ఉంది. వారిస్ తన మాజీ భార్య ఫొటోను ఖురాన్‌పై అతికించి, భూతవైద్యం చేస్తుండటంతో ఈ ముష్కరులు ఆగ్రహం గురైనట్లు పేర్కొన్నారు.
ఇదిలావుండగా, పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఈ సంఘటనపై స్పందించారు. ఈ దారుణానికి పాల్పడినవారిపై కఠిన చర్యలకు ఆదేశించారు. ఈ హింసాకాండను నిరోధించడంలో పోలీసులు ఎందుకు విఫలమయ్యారని ప్రశ్నించారు. శాంతిభద్రతలను పరిరక్షించాలని పంజాబ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌ను ఆదేశించారు.