టర్కీ, సిరియాల్లో భూకంపం ధాటికి రెండు దేశాల్లో మరణించిన వారి సంఖ్య 15 వేలు దాటింది. ప్రకృతి ప్రకోపానికి వేల సంఖ్యలో భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. రెస్క్యూ సిబ్బంది రాత్రి పగలు అని తేడాలేకుండా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. దీంతో శిథిలాల కిందినుంచి పెద్దసంఖ్య మృతదేహాలు బయటపడుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని. కాగా, ఇరుదేశాల్లో భూకంప మృతులు 20 వేలకుపైగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
టర్కీకి భారత్ వంతుగా సహాయం అందిస్తున్నది. భారత్ నుంచి టర్కీకి వెళ్లిన మూడు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు భూకంప ప్రభావిత ప్రాంతమైన నూర్దగీలో సహాయక చర్యలో చురుకుగా పాల్గొంటున్నాయి. ఆర్మీ మెడికల్ బృందాలు క్షతగాత్రులకు వైద్యసాయం అందిస్తున్నాయి.
Here's Updates
#OperationDost | Search and rescue operation underway by NDRF teams in Turkey's Nurdagi.
3 NDRF teams along with specially trained dog squads, medical supplies & other necessary equipment are sent to Turkey from India to provide assistance to people affected by the earthquakes. pic.twitter.com/Uifa0IItUK
— ANI (@ANI) February 9, 2023
#OperationDost | Medical treatment being given at Indian Army's field hospital set up in Hatay, Turkey to the people affected by the devastating earthquakes. pic.twitter.com/3trCTnes4v
— ANI (@ANI) February 9, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)