టర్కీ, సిరియా దేశాలపై సోమవారం విరుచుకుపడిన భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తాజా సమాచారం ప్రకారం.. ప్రస్తుతం అక్కడ మృతి చెందిన వారి సంఖ్య 9,500కి చేరినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. రెండు దేశాల్లో కలిపి 30 వేల మందికి పైగా ప్రజలు తీవ్రంగా గాయపడినట్లు తెలిపాయి.భారీ భూకంపం ధాటికి వేల సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద లక్షల మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘోర విపత్తులో 20 వేల మందికిపైగా మరణించి ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అంచనా వేసిన విషయం తెలిసిందే.కాగా టర్కీ అధ్యక్షుడు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు.

Here's Update News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)