Washington, Mar 7: యుఎస్ లో ఓ వ్యక్తి విమానంలో హల్ చల్ చేశాడు. ఏకంగా విమానం ఆకాశంలో ఉండగానే డోర్ తీసేందుకు (US Man Tries To Open Emergency Exit Door) ప్రయత్నించాడు. మసాచుసెట్స్‌లోని లియోమిన్‌స్టర్‌కు చెందిన 33 ఏళ్ల వ్యక్తి లాస్ ఏంజిల్స్ నుచి బోస్టన్‌కు యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానంలో ప్రయాణిస్తుండగా.. ఎమర్జెన్సీ డోర్ తీసేందుకు యత్నించాడు.
దీంతో ఆ వ్యక్తిని బోస్టన్‌లో విమానం ల్యాండ్ అయిన వెంటనే అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు యూఎస్ ఎయిర్‌లైన్స్ (United Airlines Plane) డిపార్ట్‌మెంట్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి టోర్రెస్ అనే వ్యక్తిగా గుర్తించారు. టోర్రెస్ లాస్‌ఏంజిల్స్ నుంచి బోస్టన్‌కు వెళ్తుండగా..విమానం ల్యాండింగ్ అవ్వడానికి దాదాపు 45 నిమిషాల ముందు ఎమర్జెన్సీ డోర్ అన్‌లాక్ చేసి కొంచెం దూరం వరకు ఓపెన్ చేశాడు.
దీంతో సరిగ్గా అదే సమయంలో విమాన సిబ్బందికి కాక్‌పిట్‌లో అలారం వచ్చింది. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన సిబ్బంది విమానం తనిఖీ చేయడం ప్రారంభించారు. వారంతా విచారిస్తుండగా..ఫస్ట్ క్లాస్ కోచ్ విభాగాల మధ్య ఉన్న స్టార్‌బోర్డ్ సైడ్ డోర్ అన్‌లాక్ అయ్యి కొద్ది దూరం జరిగినట్లు ఉంది. దీంతో వారు ఆ డోర్‌ని లాక్‌చేసి వచ్చి ఈ విషయాన్ని పైలెట్‌కి తెలిపారు. ఫ్లైట్ సిబ్బంది మేము ఆ డోర్ వద్ద టోర్రెస్ అనే వ్యక్తి ఉండటం గమనించామని చెప్పారు.
లాస్ ఏంజిల్స్ నుండి బోస్టన్‌కు యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్‌ను తెరవడానికి ప్రయత్నించినందుకు, ఆ తర్వాత ఒక ఫ్లైట్ అటెండెంట్ మెడపై మూడు సార్లు పొడిచి చంపడానికి ప్రయత్నించినందుకు ఆ వ్యక్తిని అరెస్టు చేసి పలు అభియోగాలు మోపారని US డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ ఓ ప్రకటనలో తెలిపారు.అతనికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష తోపాటు సుమారు రూ. 2 లక్షలు పైనే జరిమాన విధించే అవకాశం ఉందని సదరు ఎయిర్‌లైన్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది.