Bigg Boss Telugu 3 Winner: రూ.50 లక్షలతో ఏం చేస్తావన్న నాగార్జున, నా తల్లిదండ్రులకు మంచి ఇల్లు కొనిపెడతానన్న రాహుల్, ముగిసిన బిగ్‌బాస్ తెలుగు 3, టైటిల్ విన్నర్‌గా రాహుల్, రన్నర్‌గా శ్రీముఖి
తెలుగు రియాలిటీ షో ముగిసింది.బిగ్‌బాస్’ సీజన్ 3 విజేతగా రాహుల్ సిప్లిగంజ్ నిలిచాడు. రూ.50 లక్షల ప్రైజ్ మనీని గెలుచుకున్నాడు. ఫైనల్స్‌లో శ్రీముఖి రన్నరప్‌గా నిలిచింది. ఎన్నో అంచనాలతో జూలై 22న 17 మంది కంటెస్టెంట్స్‌తో ప్రారంభమైన ఈ రియాల్టీ షో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. అనేక మలుపులు, టాస్క్‌లతో వంద రోజులకు పైగా సాగిన ‘బిగ్’ రియాల్టీ షో లో 17 మంది సభ్యుల్లో అంతా ఎలిమినేట్ అవగా చివరికి ఇద్దరు మిగిలారు. ఈ ఇద్దరిలో రాహుల్ రూ. 50 లక్షలు గెలుకున్నాడు. యాంకర్, నటి శ్రీముఖి చివరి వరకూ రాహుల్ కు గట్టి పోటీనిచ్చారు.