Business
RTGS Payments: ఆర్బీఐ వడ్డీరేట్లు యధాతథం, డిసెంబర్ 2020 నుంచి 24/7 RTGS సేవలు, కీలక ప్రకటనలు చేసిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
Team Latestlyగవర్నర్ శక్తికాంత దాస్ మరో ప్రధాన ప్రకటన చేశారు - ఆన్‌లైన్ ఫండ్ బదిలీని సజావుగా చేయడానికి రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్‌టిజిఎస్) చెల్లింపు వ్యవస్థను డిసెంబర్ 2020 నుండి 24/7 అందుబాటులో ఉంచబోతున్నట్లు ఆయన తెలియజేశారు....
Sunil Mittal: మొబైల్ యూజర్లకు భారీ షాక్, త్వరలో మోగనున్న మొబైల్ ఛార్జీల ధరలు, రాబోయే ఆరు నెలల్లో డేటా ధరలు పెరుగుతాయని తెలిపిన భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్
Hazarath Reddyత్వరలో మొబైల్ సేవల చార్జీల మోత మోగనుంది. రానున్న ఆరు నెలల్లో మొబైల్ చార్జీల ధరలు పెరగనున్నాయని (mobile services rate hike) టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ (Bharti Airtel chairman Sunil Mittal) సంకేతాలను సోమవారం వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఆరు నెలల్లో మొబైల్ చార్జీల మోత (mobile services prices) తప్పదని అంటున్నారు. తక్కువ డేటా ధరలతో టెలికాం పరిశ్రమకు తీవ్ర నష్టాలు వస్తున్నాయన్నారు.
Best Prepaid Plans: రూ.400 ఒక్కసారి ఖర్చు పెడితే 56 రోజులు వరకు ఖర్చు పెట్టాల్సిన పని ఉండదు, అపరిమిత కాల్స్, 1.5 జీబీ రోజువారీ డేటా.. ఈ ప్లాన్లలో మీకు నచ్చిన ప్లాన్ సెలక్ట్ చేసుకోండి
Hazarath Reddyఎయిర్టెల్, జియో మరియు వొడాఫోన్-ఐడియా కస్టమర్లను నిలుపుకోవటానికి అద్భుతమైన ప్రీపెయిడ్ ప్రణాళికలను (Best Prepaid Plans) అందిస్తున్నాయి. అపరిమిత కాలింగ్ ప్రయోజనాలతో పాటు రోజువారీ డేటా మరియు SMS లను వినియోగదారులకు అందిస్తున్నాయి. ప్రతి ధర బ్రాకెట్‌లోని చాలా ప్లాన్‌లు ఇలాంటి ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఈ ప్రణాళికలు డబుల్ డేటా, బండిల్ చేసిన అనువర్తనాలు, కాంప్లిమెంటరీ సేవలు మరియు మరిన్ని వంటి అదనపు ప్రయోజనాలు కూడా కలిగి ఉంటాయి.
OnePlus Smart TV: తక్కువ ధరలకే వన్‌ప్లస్ స్మార్ట్ టీవీలు, ధరలు రూ. 1X,999/- నుండి ప్రారంభమవుతాయని సస్పెన్స్ క్రియేట్ చేసిన సంస్థ
Team Latestlyవన్‌ప్లస్ ఇండియా ఇటీవల చేసిన ట్వీట్‌లో రాబోయే వన్‌ప్లస్ టీవీ సిరీస్ ధరకు సంబంధించిన విషయాన్ని కొద్దిగా సస్పెన్స్ లో ఉంచుతూ టీజర్‌లో చూపించారు. ఈ స్మార్ట్ టీవీ మోడళ్ల ధర రూ .1X, 999 నుండి ప్రారంభమవుతాయని ట్వీట్‌లో పేర్కొన్నారు....
RBI New Repo Rates: వ్యవసాయంపైనే ఆశలు, వినియోగదారులకు ఆర్‌బీఐ ఊరట, రెపోరేటు 4.40 నుంచి 4 శాతానికి తగ్గింపు, మీడియా సమావేశంలో ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్ దాస్‌
Hazarath Reddyదేశవ్యాప్త లాక్‌డౌన్‌ విధింపు నేపథ్యంలో కేంద్ర రిజర్వ్‌ బ్యాంక్‌(RBI) వడ్డీరేట్లలో మరోసారి కీలక మార్పులను (RBI New Repo Rates) చేసింది. రెపో రేటు 40 బేసిస్‌ పాయింట్లు తగ్గించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. ఈ మేరకు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్ దాస్‌ (Shaktikanta Das) మీడియా సమావేశంలో ప్రకటించారు. రెండు నెలల్లో 3 సార్లు వడ్డీరేట్లపై ఆర్‌బీఐ (Reserve Bank of India) సమీక్షా సమావేశం నిర్వహించింది. ఆర్థిక వృద్ధి రేటు పెంచేవిధంగా ఆర్‌బీఐ చర్యలు తీసుకుంది. రెపోరేటు 4.40 నుంచి 4 శాతానికి తగ్గించింది. రివర్స్ రెపోరేటు 3.35 శాతానికి తగ్గించింది.
Package Breakup-5: జాతీయ ఉపాధి హామీకి అదనపు నిధులు, రాష్ట్రాలకు రుణ పరిమితి 5 శాతానికి పెంపు, విద్య మరియు ఆరోగ్యంకు భారీ కేటాయింపులు సహా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక ప్యాకేజీ- 5 విడత ప్రకటనల ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి
Team Latestlyప్రధాని మోదీ ప్రకటించిన ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ యొక్క ఐదవ మరియు ఆఖరి భాగాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆదివారం ప్రకటించారు. ఈరోజు తన ప్రసంగంలో MGNREGA, ఆరోగ్యం మరియు విద్య, కంపెనీ యాక్ట్ యొక్క డిక్రిమినలైజేషన్ తో పాటు వ్యాపార మరియు వాణిజ్య సంబంధింత కార్యకలాపాల సరళీకరణ....
Reliance Jio New Plan: రోజుకు 3 జీబీ హైస్పీడ్ డేటా, 84 రోజుల వ్యాలిడిటీ, రూ.999 ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను లాంచ్ చేసిన రిలయన్స్ జియో
Hazarath Reddyరిలయన్స్‌ జియో తన వినియోగదారులకు మరొక గుడ్‌ న్యూస్‌ చెప్పింది. కరోనా వైరస్‌, లాక్‌డౌన్ కారణంగా అందరూ ఇంటి దగ్గర నుంచే పని చేస్తున్న కారణంగా డేటాను ఎక్కువగా ఉపయోగించే వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్‌ను (Reliance Jio New Plan) తీసుకువచ్చింది. రూ.999 తో రీఛార్జ్ (Rs. 999 Prepaid Plan) చేసుకోవడం ద్వారా రోజుకు 3 జీబీ హైస్పీడ్ డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌ వాలిడిటీ 84 రోజులుగా ఉంది. 84 రోజుల ( 84 Days) వ్యవధిలో యూజర్లు మొత్తం 252 జీబీని వాడుకోవచ్చు.
Akshaya Tritiya 2020: నేడు 'అక్షయ తృతీయ 2020' పర్వదినాన ఆన్‌లైన్‌లో బంగారం ఎలా కొనుగోలు చేయాలి? ఆన్‌లైన్‌లో బంగారం కొనుగోలు చేసే మార్గాలు మరియు అక్షయ తృతీయ యొక్క విశిష్ఠతను తెలుసుకోండి
Team Latestlyఅక్షయ తృతీయ నాడు ఏ కార్యం తలపెట్టినా అక్షయం అవుతుందనే నమ్మకంతో హిందూ సమాజంలోని కొన్ని వర్గాలు ఈరోజు ఎంతో శుభదినంగా భావిస్తారు. నూతనంగా ఏదైనా మొదలు పెడతారు, ముఖ్యంగా బంగారం లాంటి విలువైన ఆభరణాలను కొనుగోలుచేస్తారు. ఈరోజు కొనుగోలు చేస్తే అది ఎప్పటికీ వృద్ధి చెందుతుందనేది వారి నమ్మకం. ఈ నమ్మకమే బంగారం అమ్మేవారికి ఇటీవల కాలంలో పెట్టుబడిగా మారింది.......
Lockdown Relaxations: వైన్స్ షాపులు తెరుచుకోనున్నాయా? దుకాణాలు తెరుచుకునేందుకు అనుమతించిన కేంద్ర ప్రభుత్వం. ఏవేవి తెరుచుకోనున్నాయి, ఏవి మూసి ఉండనున్నాయి, వేటికి అనుమతి లభించిందో తెలుసుకోండి
Team Latestlyరాష్ట్రాలలో మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లో షాప్స్ మరియు ఎస్టాబ్లిష్మెంట్ చట్టం కింద రిజిస్ట్రేషన్ చేయబడిన అన్ని అన్ని రకాల అనవసర వస్తు-సేవల స్టోర్లు, నివాస సముదాయాల్లో, మరియు స్థానికంగా విక్రయించే దుకాణాలు, స్వతంత్రంగా ఉండే షాప్స్ లాక్ డౌన్ ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుంది. మునిసిపల్ కార్పొరేషన్లు మరియు మునిసిపాలిటీల పరిధికి వెలుపల ఉండే మార్కెట్ కాంప్లెక్సులు తెరవడానికి అనుమతించబడతాయి......
Asia's Richest Man: ఆసియాలో అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ, మొత్తం సంపద విలువ 49.2 బిలియన్ డాలర్లు, ప్రపంచ ధనవంతుల్లో 17వ స్థానం
Hazarath Reddyఫేస్‌బుక్ , రిలయన్స్ జియో ( Jio, Facebook Deal) మెగా డీల్ అనేక సంచలనాలకు వేదిక అయింది. ఫేస్‌బుక్‌తో (Facebook) జరిగిన ఒప్పందం తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ మరోసారి ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా (Asia's Richest Man) నిలిచాడు. జియో ప్లాట్‌ఫామ్స్‌లో 9.99 శాతం వాటాను 570 కోట్ల డాలర్లకు (రూ.43,574 కోట్లు) ఫేస్‌బుక్‌ కొనుగోలు చేసింది. ఈ డీల్‌ పూర్తయ్యాక ఫేస్‌బుక్‌.. జియో ప్లాట్‌ఫామ్స్‌లో అతిపెద్ద మైనారిటీ షేర్‌హోల్డర్‌ కానుంది.
OYO Pay Cut: లాక్డౌన్ ఎఫెక్ట్, ఉద్యోగుల జీతాల్లో 25 % కోత విధించిన ఓయో సంస్థ, కొంతమందికి 4 నెలల పాటు నిర్భంధ సెలవులు మంజూరు
Team Latestlyఓయో ఫౌండర్ రితేశ్ అగర్వాల్ డిగ్రీ డ్రాప్-అవుట్. ఈయన బిజినెస్ కు సాఫ్ట్ బ్యాంక్ లోన్లు మంజూరు చేసింది. భారతదేశంలో ఓయో అనతి కాలంలోనే బాగా ప్రాచుర్యం పొంది యూఎస్ మరియు చైనా దేశాలకు విస్తరించింది.....
Facebook-Reliance Jio Deal: జియోలో 9.9 శాతం వాటాను కొనేసిన ఫేస్‌బుక్‌, డీల్ విలువ రూ. 43,574 కోట్లు, కొనుగోలుతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌పై తగ్గనున్న అప్పుల భారం
Hazarath Reddyదేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్‌ జియోలో సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ భారీగా పెట్టుబడి (Facebook-Jio Deal) పెట్టింది. మొత్తం 5.7 బిలయన్‌ డాలర్ల(దాదాపు రూ. 43,574 కోట్లు) పెట్టుబడి పెట్టినట్టు ఫేస్‌బుక్‌ (Facebook) బుధవారం ప్రకటించింది. దీంతో జియోలో (Reliance Jio) 9.9 శాతం వాటాను ఫేస్‌బుక్‌ కొనుగోలు చేసినట్లయింది. తద్వారా ఫేస్‌బుక్‌ జియోలో అతిపెద్ద మైనారిటీ వాటాను సొంతం చేసుకున్నట్టు అయింది.
Ramgampa Teja: ప్రధాని మోడీ మన్ కీ బాత్, కరోనా నుంచి కోలుకున్న రామ్‌గంపా తేజతో మాట్లాడిన ప్రధాని, కోవిడ్ 19ను అతను ఎలా జయించారో తెలుసుకున్న మోడీ
Hazarath Reddyప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) తన "మన్ కి బాత్" (Mann Ki Baat) ప్రసంగంలో, కరోనావైరస్ బారిన పడిన తర్వాత కోలుకున్న రామ్‌గంపా తేజతో (Ramgampa Teja) మాట్లాడారు. సంభాషణ సందర్భంగా, కరోనావైరస్పై జరిగిన వార్‌లో రాంగంపా తేజ ఎలా గెలిచారో తెలుసుకోవాలని ప్రధాని మోడీ (Prime Minister Narendra Modi) కోరారు. కాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మన్‌ కీ బాత్‌లో ప్రజలతో మాట్లాడుతున్నారు.
Reserve Bank of India: కరోనా కల్లోలం, కీలక నిర్ణయం తీసుకున్న ఆర్‌బిఐ, ఓపెన్‌ మార్కెట్‌ ఆపరేషన్స్‌ ద్వారా రూ. 10 వేల కోట్ల ప్రభుత్వ బాండ్ల కొనుగోలు, మార్చి 20న ప్రారంభం
Hazarath Reddyదేశంలో కరోనా (Covid-19) కల్లోలం రేపుతున్న నేపథ్యంలో కేంద్ర బ్యాంకు ఆర్‌బీఐ (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ధాటికి (coronavirus outbreak) ప్రపంచ ఆర్థికవృద్ధి అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో దాని ప్రభావం ఇండియా మీద తీవ్ర స్థాయిలో ఉంది. ఇండియాలో ఈ పరిస్థితిని ఎదుర్కునేందుకు ఆర్‌బిఐ తగు చర్యలు చేపట్టింది.
SBI Alert Message: యూజర్లకు ఎస్‌బీఐ అలర్ట్ మెసేజ్, బ్యాంకులకు ఎవరూ రావొద్దు, ఇంటి దగ్గర నుంచే డిజిటల్ యాప్ ద్వారా సేవలు వినియోగించుకోండి, కరోనా నుంచి కాపాడుకోండి
Hazarath Reddyకరోనా (coronavirus) ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తోంది. ప్రపంచ దేశాలన్నీ ఈ కరోనా వైరస్ దెబ్బకి ( coronavirus Outbreak) వణికిపోతున్నాయి. ఈ వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య ఇప్పటికే 7వేలకు పైగా చేరింది. మన దేశంలో కరోనా కేసులు 125కు పెరిగాయి. అయితే ఈ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు ఒక ముఖ్యమైన సందేశం పంపింది. ఈ సందేశం ప్రకారం బ్యాంకులకు ఎవరూ రావద్దని కోరింది. డిజిటల్ సేవలు (SBI digital channels) వినియోగించుకోవాలని తెలిపింది.
Rs 2,000 Bank Notes: రూ.2 వేల నోటు రద్దుపై స్పష్టత, ఈ నోట్ల ముద్రణ నిలిపివేతపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, లోక్‌సభలో వెల్లడించిన ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌
Hazarath Reddyగత కొంతకాలంగా రెండు వేల రూపాయల నోటు (Rs 2,000 Bank Note) బ్యాన్ అవుతోందని సోషల్ మీడియాలో (Social Media) వార్తలు వస్తున్నాయి. ఆర్ బిఐ రూ. 2 వేల నోటు ప్రింటింగ్ ఆపేస్తుందనే రూమర్లు కూడా వచ్చాయి. దీనిపై కేంద్రం (Central Govt) పార్లమెంట్ వేదికగా స్పష్టతనిచ్చింది. రూ.2 వేల నోట్ల ముద్రణ నిలిపివేతపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని కేంద్రం స్పష్టం చేసింది.
RBI Governor Press Meet: యెస్ బ్యాంకులో ఉన్న ప్రజల సొమ్ము భద్రం, ఖాతాదారులకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంద దాస్ భరోసా, కోవిడ్ 19 ప్రభావం వాణిజ్య రంగంపై ఉంటుందని వెల్లడి
Vikas Mandaఈ నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ అత్యవసర ప్రెస్ మీట్ పెట్టడంతో వడ్డీ రేట్ల తగ్గింపు, జీఎస్టీ చెల్లింపులు తదితర కీలక అంశాలపై గవర్నర్ ఏదైనా ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ ఈరోజు అలాంటి ప్రకటనలేమి చేయలేదు. ఏప్రిల్ 03న జరిగే మానిటరీ పాలసీ మీటింగ్ తర్వాత....
Anil Ambani: యస్ బ్యాంక్ సంక్షోభం, అనిల్ అంబానీకి ఈడీ సమన్లు, యస్‌ బ్యాంక్‌ నుంచి రూ 12,800 కోట్లు రుణాలు పొందిన రిలయన్స్‌ గ్రూప్‌, నిరర్థక ఆస్తులుగా మారిన రుణాలు
Hazarath Reddyయస్‌ బ్యాంక్‌ వ్యవహారంలో పారిశ్రామికవేత్త రిలయన్స్ గ్రూపు అధినేత అనిల్‌ అంబానీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. యస్‌ బ్యాంక్‌ కేసులో (Yes Bank crisis) తమ ముందు హాజరు కావాలని అనిల్‌ అంబానీకి (Anil Ambani) ఈడీ సమన్లు జారీ చేసింది. యస్‌ బ్యాంక్‌ నుంచి రిలయన్స్‌ గ్రూప్‌ (Reliance Group) రూ 12,800 కోట్లు రుణాలు పొందింది. ఇవి నిరర్థక ఆస్తులుగా మారడంతో ఈ రుణాలకు సంబంధించి ప్రశ్నించేందుకు అనిల్‌ అంబానీకి ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే ఈడీ (Enforcement Directorate) ఎదుట హాజరయ్యేందుకు ఆరోగ్య కారణాల దృష్ట్యా తమకు సమయం కావాలని ఆయన కోరారు.
Indian Markets: మార్కెట్లను కుదిపేస్తున్న కరోనావైరస్ భయం, భారీగా పతనమవుతున్న మార్కెట్లు, 45 నిమిషాల పాటు నిలిచిపోయిన ట్రేడింగ్, ఆ తర్వాత పున:ప్రారంభం
Vikas Mandaనష్టాలు విపరీతంగా కొనసాగుతుండటంతో ట్రేడింగ్ ను 45 నిమిషాల పాటు నిలిపివేశారు. అనంతరం ఉదయం 10:20 తర్వాత ట్రేడింగ్ పున: ప్రారంభమైంది. ఇప్పుడు మార్కెట్లు ఎలా పని చేస్తాయనే దానిపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది.....
Stock Market Crash: 12 లక్షల కోట్ల సంపద ఆవిరి, కరోనావైరస్ భయాందోళనలతో మార్కెట్లు పతనం, 2,919 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, 10 వేల దిగువనకు నిఫ్టీ
Vikas Mandaగురువారం మార్కెట్లు 52 వారాల కనిష్ఠ స్థితిని చూశాయి. బ్యాంకింగ్, మీడియా, రియల్ ఎస్టేట్ రంగాల షేర్లు కుప్పకూలాయి. కనీసం 10 శాతం పతనం చూశాయి. టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్జీసీ, ఎస్బీఐ, మహింద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్ తదితర షేర్లు అత్యధికంగా నష్టపోయాయి.....