Entertainment

Khushboo Tweet Viral: మోదీ ఇంటిపేరుపై గతంలో ఖుష్బూ చేసిన ట్వీట్ వైరల్.. ఇప్పుడు బీజేపీలో ఉన్న ఖుష్బూ.. ఇంతకీ ఆమె ఏమన్నారంటే??

Rudra

మోదీ ఇంటిపేరును ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి కోర్టు రెండేళ్ల జైలు శిక్షను విధించడం, ప్రజా ప్రతినిధుల చట్టం కింద ఆయన ఎంపీ సభ్యత్వాన్ని లోక్ సభ సెక్రటేరియట్ రద్దు చేయడం చకచకా జరిగిపోయాయి.

Upasana: మెగా కోడలుకి అరుదైన గౌరవం.. మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్స్ జాబితాలో ఉపాసన.. విశిష్ట గుర్తింపునిచ్చిన ఎకనామిక్ టైమ్స్

Rudra

మెగా కోడలు ఉపాసన అరుదైన ఘనత సాధించారు. ఎకనామిక్ టైమ్స్ రూపొందించిన మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్స్ జాబితాలో ఉపాసనకు స్థానం లభించింది.

Pavan-Sai Tej Movie Update: పవన్ .. సాయితేజ్ సినిమా రిలీజ్ డేట్ ఖరారు.. జులై 28వ తేదీన సినిమా విడుదల

Rudra

మెగా అభిమానులకు, ముఖ్యంగా పవన్ కల్యాణ్ – సాయితేజ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. పవన్ కల్యాణ్ - సాయితేజ్ 'వినోదయా సితం' సినిమా రీమేక్ లో చేస్తున్నారనే సంగతి తెలిసిందే. విశ్వప్రసాద్ - వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్న ఈ సినిమాకి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు.

Dasara Movie Promotions: నానితో కలిసి ధూమ్ ధామ్ దోస్తాన్ పాటకు స్టెప్పులేసిన రవితేజ, దసరా మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న టీం

Hazarath Reddy

దసరా సినిమా ప్రమోషన్లలో నానితో పాటు హీరో రవితేజ పాల్గొన్నాడు. నానితో కలిసి చిన్న స్టెప్ వేశాడు. దసరా సినిమాలోని ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ పాటకు కాలు కదిపాడు. కుర్చీపై కూర్చుని ఇద్దరు హీరోలు వేసిన డ్యాన్స్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది.

Advertisement

Malli Pelli Movie: నరేశ్, పవిత్ర లోకేశ్ మళ్లీ పెళ్లి సినిమా, పోస్టర్, గ్లింప్స్ వీడియోను విడుదల చేసిన మేకర్స్

Hazarath Reddy

టాలీవుడ్ సీనియర్ లవర్స్ నరేశ్, పవిత్ర లోకేశ్ లు జంటగా నటిస్తున్న చిత్రం 'మళ్లీ పెళ్లి'. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్, గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు. ఈ చిత్రాన్ని నరేశ్ స్వయంగా తన సొంత బ్యానర్ విజయకృష్ణ పతాకంపై నిర్మిస్తున్నారు. ఎంఎస్ రాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సమ్మర్ లో రాబోతోంది. ఈ సినిమా కన్నడలో కూడా విడుదల కానుంది.

Manchu Family War: మంచు కుటుంబంలో వార్, కొడుకు వీడియోపై మోహన్ బాబు ఆగ్రహం, వెంటనే డిలీట్ చేసిన మంచు మనోజ్, వీడియో ఘటనపై స్పందించిన మంచు విష్షు, లక్ష్మీ

Hazarath Reddy

సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. దీనికి కారణం మంచు మనోజ్..విష్ణు వీడియోని షేర్ చేయడమే. అన్న విష్ణు తీరుపై మండిపడుతూ మనోజ్ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడం కలకలం రేపింది.

Dima Nova Dies: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం, నది దాటుతూ మంచులో కూరుకుపోయి మృతి చెందిన ప్రముఖ పాప్ సింగర్ దిమా నోవా

Hazarath Reddy

రష్యా పాప్‌ సింగర్‌ సింగర్ దిమా నోవా(34) నది దాటుతూ మంచులో కూరుకుపోయి మృతి చెందారు. తన పాటలతో కుర్రకారును ఉర్రూతలూగించిన దిమా నోవా రష్యా-ఉక్రెయిన్‌ యుద్ద సమయంలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై విమర్శలు చేస్తూ పాట పాడి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు

Ajith Kumar Father Dies: స్టార్ హీరో అజిత్ కుమార్ తండ్రి సుబ్రమణ్యం మృతి, దిగ్భ్రంతి వ్వక్తం చేస్తూ ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్న సినీ ప్రముఖులు

Hazarath Reddy

తమిళ స్టార్‌ హీరో అజిత్‌ తండ్రి సుబ్రమణ్యం అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. తండ్రి మృతితో అజిత్‌ ఇంట విషాద చాయలు నెలకొన్నాయి

Advertisement

Pradeep Sarkar Passes Away: ‘పరిణీత’ దర్శకుడు ప్రదీప్ సర్కార్ కన్నుమూత.. జీర్ణించుకోలేకపోతున్నానన్న అజయ్ దేవగణ్

Rudra

బాలీవుడ్ దర్శకుడు ప్రదీప్ సర్కార్ కన్నుమూశారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. ఈ తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ప్రదీప్ మృతి చెందారు. పరిణీత, లగా చునారీ మే దాగ్, మర్దానీ, హెలికాప్టర్ ఈలా వంటి పాప్యులర్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.

Dhoom Dhaam Dhosthaan: ధూమ్‌ ధామ్‌ దోస్తాన్‌ సాంగ్‌కు రవితేజ, నాని కలిసి డ్యాన్స్.. ట్రెండింగ్‌లో వీడియో.. మీరూ చూడండి

Rudra

ఇద్దరు సెల్ఫ్‌ మేడ్‌ స్టార్ హీరోలు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే అభిమానులకు పండుగే. ఆ ఇద్దరు హీరోలే.. రవితేజ (Ravi Teja), నాని. రవితేజ నటిస్తోన్న రావణాసుర ఏప్రిల్‌ 7న విడుదలవుతుండగా.. నాని (Nani) నటిస్తోన్న దసరా (Dasara) మార్చి 30న విడుదల కానుంది.

Rangamartanda: బ్రహ్మానందాన్ని అభినందించిన చిరూ - చరణ్.. 'రంగమార్తాండ'లో నటనకు గానూ ప్రశంసలు

Rudra

'రంగమార్తాండ' సినిమాలో రంగస్థల నటుడిగా .. వృద్ధాప్యంలో భార్య తోడు లేకుండా ఒంటరి జీవితాన్ని గడపలేని చక్రపాణి పాత్రలో బ్రహ్మానందం తన నట విశ్వరూపం చూపించారు. ఇప్పుడు ఆయన నటన గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి - చరణ్ ఇద్దరూ కూడా ఆయనను మనస్ఫూర్తిగా అభినందించారు.

Keerthy Suresh Drinking Video: వామ్మో కీర్తి సురేష్, ఎత్తిన కళ్లు బాటిల్‌ను దించకుండా తాగి షాకిచ్చిన మహానటి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

హీరోయిన్‌ కీర్తి కల్లు తాగిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. చేతితో పట్టుకోకుండా ఎత్తిన బాటిల్‌ను దించకుండా తాగి అక్కడి వారందరికి షాకిచ్చింది. కీర్తిని అలా చూసి హీరో రానా-నాని అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది

Advertisement

Paul Grant Dies: రైల్వే స్టేషన్‌లోనే కుప్పకూలిన ప్రముఖ నటుడు, బ్రెయిన్ డెడ్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన హ్యారీ పోటర్ ఫేమ్ పాల్ గ్రాంట్

Hazarath Reddy

హాలీవుడ్ నటుడు, హ్యారీ పోటర్ ఫేమ్ పాల్ గ్రాంట్ (56) కన్నుమూశారు. లండన్‌లోని యాస్టర్‌ రోడ్‌ సెయింట్‌ పాంక్రస్‌ రైల్వే స్టేషన్ సమీపంలో కుప్పకూలిన ఆయన్ను.. ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయారు. మార్చి 16న రైల్వే స్టేషన్ బయట పాల్ గ్రాంట్ ఉన్నట్టుండి పడిపోయారు.

Anand Mahindra Naatu Naatu Video: నాటు నాటు ఫీవర్, ఇదే లాస్ట్ ట్వీట్ అంటూ డ్యాన్స్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా

Hazarath Reddy

పారిశ్రామిక వేత్త , ఎం అండ్‌ ఎం అధినేత ఆనంద్‌మహీంద్ర తాజాగా నాటు నాటు పాటకు సంబంధించి ఓ వీడియోని షేర్ చేశారు. తోలుబొమ్మతో ఒక మహిళ నాటునాటు పాటకు అదరిపోయే స్టెప్స్ వేయిస్తున్న వీడియోను ఆయన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

RGV Comments Row: మీరింకా ఉన్నారా తాతగారు, వి.హనుమంతరావుకు కౌంటర్ విసిరిన రాంగోపాల్ వర్మ, అమ్మాయిలతో ఉన్న ఫొటోలతో ట్వీట్

Hazarath Reddy

వీహెచ్ కామెంట్లపై రాంగోపాల్ వర్మ ట్విట్టర్ లో కౌంటర్ ఇచ్చారు.. ఓ తాతగారూ మీరింకా వున్నారా??? NASA యాక్ట్ వర్తించదు.. TADA యాక్ట్ ని 1995లోనే తీసేశారు.. ఇది కూడా తెలియని మీ లాంటి లీడర్స్ మూలానే.. కాంగ్రెస్ కి ఆ గతి.. ఒకసారి డాక్టర్ కి చూపించుకోండి అంటూ కౌంటర్ వేశారు.

RGV Comments Row: తనపై కేసు పెట్టిన అడ్వకేట్లందరిపై రివర్స్ కేసు పెట్టబోతున్న వర్మ, వాళ్లకు లేని నొప్పి వీళ్లకెందుకుంటూ ట్విట్టర్లో మండిపాటు

Hazarath Reddy

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ(Ram Gopal Varma) పై మహిళా న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. వైస్‌ఛాన్స్‌లర్‌పై కూడా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే దీనిపై వర్మ రివర్స్ అటాక్ చేశారు. లాయర్లు తనపై ఫిర్యాదు చేయడంపై ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

Advertisement

RGV Comments Row: ఆడదంటే వర్మకు విలాస వస్తువుగా మారింది, మండిపడుతున్న మహిళా సంఘాలు, గుంటూరులో వర్మ వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళా న్యాయవాదులు

Hazarath Reddy

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ(Ram Gopal Varma) పై మహిళా న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. వైస్‌ఛాన్స్‌లర్‌పై కూడా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Theft in Sonu Nigam House: సోను నిగమ్ ఇంట్లో భారీ చోరీ, రూ. 72 లక్షలు కొట్టేసిన మాజీ డ్రైవర్, ముంబై పోలీసులకు సోను నిగమ్ తండ్రి

VNS

ప్రముఖ సింగర్ సోనునిగమ్ (singer Sonu Nigam) ఇంట్లో భారీ చోరీ జరిగింది. ముంబైలోని సోనునిగమ్ తండ్రి ఇంట్లో రూ.72 లక్షలు చోరీకి గురయ్యాయి. దీంతో సోనునిగమ్ తండ్రి ఆగమ్ కుమార్ నిగమ్ (Agam Kumar Nigam) ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తన మాజీ డ్రైవర్ రెహాన్‌ ఈ దొంగతనానికి పాల్పడ్డట్లు ఆగమ్ కుమార్ నిగమ్ పోలీసులకు తెలిపారు.

Kantara 2: కాంతార-2 క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్, ఉగాది రోజు స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టినట్లు ప్రకటించిన రిషబ్‌షెట్టి, ప్రకృతితో మమేకమయ్యే మరో కథ కోసం జర్ని మొదలంటూ ట్వీట్

VNS

ఈ సినిమాకు సీక్వెల్‌ ఉండబోతుందని ఇప్పటికే ఓ అప్‌డేట్ ఇండస్ట్రీ సర్కిల్‌లో రౌండప్ చేస్తోంది. ఈ క్రేజీ న్యూస్‌పై అధికారికంగా క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్‌. మూవీ లవర్స్‌, దేశప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ.. పాపులర్‌ ప్రొడక్షన్ హౌజ్‌ (HombaleFilms) కాంతారావు రెండో పార్టుకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ పనులు ప్రారంభమైనట్లు ప్రకటించారు.

NTR 30 Muhurat Ceremony: జూనియర్ ఎన్టీఆర్‌ నెక్ట్స్ మూవీ మహుర్తం పూజ పూర్తి, ఏడాది తర్వాత కొత్త సినిమా మొదలు పెట్టిన ఎన్టీఆర్, చీరకట్టులో తళుక్కుమన్న జాన్వీకపూర్

VNS

జూనియర్ ఎన్టీఆర్ నెక్ట్స్ (NTR 30) మూవీకోసం గత సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు. RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ రెండు సినిమాలు ప్రకటించినా అవి మొదలవ్వలేదు, కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరగలేదు. NTR 30 సినిమా దర్శకుడు కొరటాల శివతో ఉంటుందని గతంలోనే ప్రకటించారు. ఈ సినిమాకి కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ మూవీకి సంబంధించిన మహుర్తం పూజ ఇవాళ జరిగింది.

Advertisement
Advertisement