Entertainment
Shatrughan Sinha: కొందరు ఆడవాళ్లు నా దగ్గరకు వచ్చి అడిగారు, రెండవ పెళ్ళిపై నటుడు శత్రుఘ్న సిన్హ కీలక వ్యాఖ్యలు, రెండో భార్యను తెచ్చుకుని నేను పోషించలేనని తెలిపిన సీనియర్ రాజకీయ నేత
Hazarath Reddyఒక్క భార్య ముద్దని మరో పెళ్లి చేసుకుని రెండో భార్యను (Shatrughan Sinha on 2nd Marriage) తెచ్చుకోవద్దని తెలిపారు. ఆయన తన లైఫ్ గురించి మాట్లాడుతూ.. నాకు ఒక్కరు చాలు. పెరుగుతున్న ఖర్చుల కారణంగా ఇంకొకరిని పెళ్లి చేసుకుని ( He Cannot Afford More Than One Wife) ఆమెను నేను పోషించలేను.
Pushpa 2: రేపటి నుండి పుష్ప 2 సెట్స్ పైకి వెళ్లనున్నట్లుగా వార్తలు, ఇంకా అధికారికంగా రాని ప్రకటన, కీలక పాత్రలో జగపతిబాబు నటించే అవకాశం
Hazarath Reddyపుష్ప: ది రూల్ లేదా పుష్ప 2 అనేది 2021లో విడుదలైన పుష్ప: ది రైజ్ చిత్రానికి సీక్వెల్. తాజా నివేదికల ప్రకారం, అల్లు అర్జున్ రేపు (జనవరి 21) నుండి వైజాగ్‌లో సుకుమార్ చిత్రం షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. జగపతిబాబు కూడా ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. అయితే పుష్ప 2 షూటింగ్ షెడ్యూల్‌పై మేకర్స్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు
Viral Video: నటి అపర్ణ బాలమురళి పట్ల యువకుడి అనుచిత ప్రవర్తన... వీడియో వైరల్
Rudraసూర్య హీరోగా వచ్చిన సూరారై పొట్రు చిత్రంలో హీరోయిన్ గా నటించిన అపర్ణ బాలమురళి తాజాగా తంకమ్ చిత్రంలో నటించింది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా కేరళలోని ఓ లా కాలేజిలో ఈవెంట్ ఏర్పాటు చేయగా, అపర్ణ వేదికపై కూర్చుని ఉండగా, ఓ విద్యార్థి అనుచితంగా ప్రవర్తించడం కలకలం రేపింది.
Priyanka Chopra: ప్రియాంకకు మరో అరుదైన గౌరవం.. ప్రఖ్యాత బ్రిటిష్ మ్యాగజీన్ వోగ్ కవర్ పేజీపై ఫోటో.. తొలి భారతీయ నటిగా గుర్తింపు
Rudraబాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రాకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే, 40 అంతర్జాతీయ మ్యాగజీన్ల కవర్ పేజీలపై కొలువుదీరిన ఈ మాజీ ప్రపంచ సుందరి తాజాగా మరో ఘనత సాధించింది. ప్రముఖ బ్రిటిష్ మ్యాగజీన్ వోగ్ కవర్ పేజీపై తళుకులీనింది. తద్వారా ఈ ఫీట్ సాధించిన తొలి భారతీయ నటిగా గుర్తింపు పొందింది.
RRR Wins Seattle Critics Award: అంతర్జాతీయంగా సత్తా చాటుతున్న RRR మూవీ, మరో ఇంటర్నేషనల్ అవార్డును ఖాతాలో వేసుకున్న మూవీ, బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫీ కేటగిరీలో అవార్డు
VNSఅంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై ఆర్ఆర్ఆర్ (RRR) ఫిల్మ్ ఇర‌గ‌దీస్తోంది. ఆ ఫిల్మ్ వ‌రుస‌గా అవార్డుల‌ను గెలుచుకుంటోంది. గోల్డెన్ గ్లోబ్స్‌(Golden globes), క్రిటిక్స్ ఛాయిస్ (Critics Choice Award) అవార్డుల‌ను సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ ఇప్పుడు సియాటిల్ క్రిటిక్స్ (Seattle Critics Award) అవార్డును కూడా కైవ‌సం చేసుకున్న‌ది. బెస్ట్ యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ కేట‌గిరీలో ఆ అవార్డు ద‌క్కింది.
Ali vs Pawan Kalyan: సీఎం జగన్ సై అంటే పవన్ కళ్యాణ్‌పై నేనే పోటీ చేస్తా, ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్‌ మీడియా అడ్వజైర్‌ అలీ కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్‌ మీడియా అడ్వజైర్‌ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశిస్తే జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై పోటీకి సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు. అధిష్టానం ఏ పని చెప్పినా చేయడానికి రెడీగా ఉన్నానని అన్నారు.
Team India With Jr. NTR: టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ను కలిసిన టీమిండియా క్రికెటర్లు
Rudraన్యూజిలాండ్ తో ఓడీఐ సిరీస్ కు ముందు టీమిండియా క్రికెటర్లు టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ను కలిశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.
Pawan Kalyan: కనుమ సందర్భంగా గోవులకు స్వయంగా తినిపించిన పవన్ కల్యాణ్... ఫొటోలు వైరల్
Rudraకనుమ పండుగను పురస్కరించుకుని జనసేనాని పవన్ కల్యాణ్ తన వ్యవసాయ క్షేత్రంలో గోపూజ వేడుకలు నిర్వహించారు. కనుమ వేడుక నేపథ్యంలో వ్యవసాయక్షేత్రంలోని గోవులకు పవన్ అరటిపళ్లు స్వయంగా తినిపించారు.
The Vaccine War: ‘ది వ్యాక్సిన్ వార్’ షూటింగ్ లో ప్రమాదం.. నటి పల్లవి జోషికి గాయాలు
Rudraకశ్మీర్ ఫైల్స్ లో అందరి దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కిస్తున్న ‘ది వ్యాక్సిన్ వార్’ చిత్రం షూటింగ్ లో చిన్న ప్రమాదం జరిగింది. వెహికిల్ స్టంట్ చిత్రీకరిస్తున్న సమయంలో ప్రధాన పాత్రదారి, అగ్నిహోత్రి సతీమణి పల్లవి జోషికి గాయమైంది.
Vijay Antony Injured: బిచ్చగాడు హీరో విజయ్‌ ఆంటోనికి షూటింగ్‌లో తీవ్ర గాయాలు, వాటర్ బోట్‌లో ప్రయాణిస్తుండగా ప్రమాదం, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నటుడు
Hazarath Reddyసంగీత దర్శకుడు, బిచ్చగాడు హీరో విజయ్‌ ఆంటోనికి తీవ్ర గాయాలయ్యాయి.మలేషియాలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌లో ఆయన తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. కౌలాలంపూర్‌లో పిచైక్కారన్- 2 సెట్‌లో విజయ్ ఆంటోనీ గాయపడినట్లు సమాచారం.
Nasir Faraaz Dies: బాలీవుడ్‌లో మరో విషాదం, ప్రముఖ లిరికల్ రైటర్ నాసిర్ ఫరాజ్ కన్నుమూత, గుండెసంబంధిత వ్యాధితో తిరిగిరానిలోకాలకు..
Hazarath Reddyప్రముఖ గీత రచయిత నాసిర్ ఫరాజ్ మన మధ్య లేరు. బాలీవుడ్ కోసం ఎన్నో అద్భుతమైన పాటలు రాసిన నాసిర్ ఫరాజ్ గుండె జబ్బుతో బాధపడుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.నాసిర్ ఫరాజ్ 2010 సంవత్సరంలో విడుదలైన కైట్స్ చిత్రం నుండి 'దిల్ క్యున్ మేరా షోర్ కరే', 'జిందగీ దో పాల్ కీ' అనే రెండు సూపర్‌హిట్ పాటలను రాశారు
South Research Report 2023: దక్షిణాదిలో టాప్ హీరోగా సూర్య రికార్డు, తెలుగులో అగ్రస్థానంలో అల్లు అర్జున్, వివరాలను వెల్లడించిన సౌత్ రీసెర్చ్ రిపోర్ట్ 2023
Hazarath Reddyఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్స్ (IIHB) రీసెర్చ్ ప్రకారం సూర్య మొదటి స్థానంలో నిలిచారు. TIARA (ట్రస్ట్, ఐడెంటిఫై, అట్రాక్టివ్, రెస్పెక్ట్, అప్పీల్) సౌత్ రీసెర్చ్ రిపోర్ట్ 2023 ఇది ప్రత్యేకంగా దక్షిణాది ప్రముఖులపై నిర్వహించబడింది. టాలీవుడ్‌లో అల్లు అర్జున్ అగ్రస్థానంలో ఉండగా, దుల్కర్ సల్మాన్, ఫహద్ ఫాసిల్ మాలీవుడ్‌లో అగ్రస్థానాన్ని పంచుకోగా, కోలీవుడ్‌లో విజయ్ రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
Upasana: బేబీ బంప్ ఫొటోను షేర్ చేసిన రామ్ చరణ్ భార్య ఉపాసన
Rudraటాలీవుడ్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. తమ ఇంట అడుగుపెట్టబోతున్న చిన్నారి కోసం మెగా ఫ్యామిలీ ఆతృతగా ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో తనకు పుట్టబోతున్న బిడ్డ గురించి ట్విట్టర్ వేదికగా ఉపాసన ఒక భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు.
Balamurugan Passes Away: ప్రముఖ సినీ రచయిత బాలమురుగన్ కన్నుమూత
Rudraగత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ సినీ రచయిత బాలమురుగన్ (85) కన్నుమూశారు. తెలుగు, తమిళం సహా పలు భాషల్లో అనేక సినిమాలకు రచయితగా పనిచేసిన ఆయన అనారోగ్యంతో తుదిశ్వాస విడిచినట్టు కుమారుడు, రచయిత భూపతి రాజా తెలిపారు.
CM Jagan’s ‘Telugu Flag’ Row: తెలుగు ఫ్లాగ్ అంటే తెలుగు జాతి, ముందు తెలుగోడి సత్తా తెలుసుకుని మాట్లాడు, ఆద్నాన్ సమీపై విరుచుకుపడిన వైసీపీ మంత్రులు
Hazarath Reddyఅద్నాన్‌ సమీ చేసిన ట్వీట్‌కు ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు కౌంటర్‌ ఇచ్చారు. అద్నాన్‌ చేసిన ట్వీట్‌కు స్పందించిన ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ కౌంటర్‌ ట్వీట్ చేశాడు. ‘మా భాష, మా సంస్కృతి, మా గుర్తింపు మాకు గర్వకారణం. నేను మళ్లీ చెబుతున్నాను, మేం తెలుగు వాళ్లం. మా దేశభక్తిని ప్రశ్నించడానికి మీరు ఎవరు
Farzi Trailer: షాహిద్ కపూర్, విజయ్ సేతుపతిల ఫర్జీ ట్రైలర్ విడుదల, నకిలీ కరెన్సీ నోట్ల నేపథ్యంగా సినిమా, పోలీస్ పాత్రలో అలరించిన విజయ్ సేతుపతి
Hazarath Reddyషాహిద్ కపూర్, విజయ్ సేతుపతిల ఫర్జీ ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది! రాజ్ & DKనిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి వచ్చిన ట్రైలర్ పూర్తి థ్రిల్లింగ్‌గా ఉంది. సినిమా కథలో షాహిద్ నకిలీ కరెన్సీ నోట్లను చలామణి చేయడాన్ని చూస్తాడు, అయితే విజయ్ అతని కోసం వేటలో ఉన్న పోలీసు పాత్రలో నటించాడు. ట్రైలర్ లీడ్స్ మధ్య పిల్లి, ఎలుకల రేసులాగే ఉంది. ట్రైలర్ ఇదే..
Balakrishna watched Veera Simha Reddy: వీరసింహారెడ్డి సినిమాను చూసిన బాలయ్య, కూకట్‌పల్లిలోని భ్రమరాంబ థియేటర్‌లో అభిమానుల కేరింతల నడుమ మూవీ వీక్షించిన హీరో
Hazarath Reddyనందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ విడుదలైన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద సందడి నెలకొంది.ఈ సందర్భంగా కూకట్‌పల్లిలోని భ్రమరాంబ థియేటర్‌లో అభిమానుల కేరింతల నడుమ హీరో బాలకృష్ణ సినిమా చూశారు.బాలయ్య రాకతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపయ్యంది.
Veera Simha Reddy Movie Leaked ?: వీరసింహారెడ్డి సినిమా ఆన్‌లైన్‌లో లీక్ ?, గూగుల్‌లో తెగ వెతికేస్తున్న నెటిజన్లు, Veera Simha Reddy Full Movie Watch Online పదం ట్రెండింగ్‌లో..
Hazarath Reddyగోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన వీరసింహారెడ్డి ఈరోజు (జనవరి 12) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ తెలుగు సినిమా ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. నందమూరి బాలకృష్ణ, శృతిహాసన్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో కథానాయకుడు ద్విపాత్రాభినయం చేస్తూ ప్రతీకార కథాంశంతో రూపొందింది.
Veera Simha Reddy: దుమ్మురేపుతున్న బాలయ్య మూవీ ప్రీ బిజినెస్, లెక్కలు చూస్తే కళ్లు తిరగాల్సిందే, ఎక్కడెక్కడ ఎంత ప్రీ బిజినెస్ జరిగిందో తెలుసా?
VNSఇక ఏరియాల వారీగా ఈ చిత్ర ప్రీరిలీజ్ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి. ఈ మూవీ నైజాంలో రూ. 15 కోట్లు, సీడెడ్ రూ. 13 కోట్లు, ఆంధ్రాలో రూ.35 కోట్లు, రెస్టాఫ్ ఇండియా లో రూ. 6 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 6 కోట్ల బిజినెస్ చేసింది. ఓవరాల్ వరల్డ్‌వైడ్ గా రూ. 75 కోట్ల బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.
Thunivu:అజిత్ కుమార్ తుణీవు సినిమా విడుదల సందర్భంగా విషాదం, డ్యాన్స్ వేస్తూ ట్యాంకర్ లారీ పైనుంచి కిందపడి మృతి చెందిన 19 ఏళ్ల యువకుడు
Hazarath Reddyతమిళ సినీ నటుడు అజిత్ కుమార్ నటించిన ‘తుణీవు’ సినిమా విడుదల వేడుకలను జరుపుకుంటున్న 19 ఏళ్ల యువకుడు బుధవారం చెన్నైలోని రోహిణి థియేటర్ సమీపంలో ట్యాంకర్ లారీ పైనుంచి కిందపడి మృతి చెందాడు.భరత్ కుమార్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి ట్యాంకర్ లారీ ఎక్కి తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ నటించిన 'తునివు' సినిమా విడుదల వేడుకలను జరుపుకుంటున్నాడు.