Entertainment

Jailer Villain Arrested: జైల‌ర్ విల‌న్ మ‌రోసారి అరెస్ట్, కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నందుకు అరెస్ట్ చేసిన శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీసులు (వీడియో ఇదుగోండి)

VNS

జైలర్‌ నటుడు వినాయకన్‌ను (Vinayakan arrested) పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మద్యం మత్తులో సీఐఎస్‌ఎఫ్‌ (Central Industrial Security Force) కానిస్టేబుల్‌పై దాడి చేయడంతో హైదరాబాద్‌ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. వినాయకన్‌.. కొచ్చి నుంచి హైదరాబాద్‌ మీదుగా గోవా వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

Raj Tarun-Lavanya Case Row: రాజ్‌ తరుణ్, లావణ్య వివాదంలో మరో ట్విస్ట్.. మాల్వీ ఫ్లాట్‌ లో రెడ్‌ హ్యాండెడ్‌ గా దొరికిన రాజ్‌ తరుణ్.. వీడియో రిలీజ్ చేసిన లావణ్య.. మీరూ చూడండి!

Rudra

రాజ్‌ తరుణ్, లావణ్య వివాదంలో సినిమాను మించిన ట్విస్ట్ లు రోజుకొకటి బయటపడుతున్నాయి. ఇప్పటివరకు వీరి మధ్య నెలకొన్న వివాదం హైదరాబాద్ వరకే పరిమితం కాగా.. ఇప్పుడు రాష్ట్రాలు దాటి ఏకంగా ముంబై కు షిఫ్ట్ అయ్యింది.

Thaman Tweet On Game Changer Movie: ఫ్యాన్స్ కు గేమ్ చేంజ‌ర్ టీమ్ స‌ర్ ప్రైజ్ ఇవ్వ‌నుందా? మ్యూజిక్ డైర‌క్ట‌ర్ త‌మ‌న్ ఎందుక‌లా ట్వీట్ చేశాడు

VNS

రామ్ చరణ్ ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ (Game Changer) అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో గేమ్ ఛేంజర్ టీజర్ (Game Changer teaser) ఇవ్వమని ట్రెండ్ చేస్తున్నారు. సినిమా మొదలయి మూడేళ్లు దాటుతున్నా ఇప్పటివరకు ఒక్క పాట, ఒక్క పోస్టర్ తప్ప ఇంకేమి బయటకు రాకపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Actor Nithiin: తండ్రైన ప్ర‌ముఖ టాలీవుడ్ హీరో, పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన నితిన్ భార్య షాలిని, ఆనందంతో ఏమ‌ని పోస్ట్ చేశాడో తెలుసా?

VNS

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (Actor Nithiin) తండ్రయ్యారు. ఆయన సతీమణి షాలిని కందుకూరి(Shalini Kandukuri) పండంటి మ‌గ‌బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విష‌యాన్ని నితిన్ ఎక్స్ వేదిక‌గా తెలుపుతూ.. మా ఫ్యామిలీలోకి వ‌చ్చిన‌ సరికొత్త స్టార్‌కి స్వాగతం అంటూ ఫొటో పంచుకున్నాడు. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు నితిన్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు

Advertisement

Deepika Padukone and Ranveer Singh: ముంబై సిద్దివినాయ‌క ఆల‌యంలో బాలీవుడ్ సెల‌బ్రిటీ క‌పుల్స్ సంద‌డి, విఘ్నేషుడి ఆశీస్సులు తీసుకున్న కాబోయే త‌ల్లిదండ్రులు

VNS

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే (Deepika padukone) మరికొన్ని రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా తన భర్త ర‌ణ్‌వీర్ సింగ్‌తో (Ranveer Singh) క‌లిసి శుక్రవారం ముంబయిలోని ప్రఖ్యాత సిద్ధివినాయక ఆలయాన్ని (Siddhivinayak Temple) సందర్శించింది.

Vaddepalli Krishna Dies: టాలీవుడ్‌లో విషాదం, ప్రముఖ గీత రచయిత వడ్డేపల్లి కృష్ణ కన్నుమూత, సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు

Hazarath Reddy

టాలీవుడ్ లో విషాదం కర ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ గీత రచయిత వడ్డేపల్లి కృష్ణ కన్నుమూశారు. ఆయన వయసు 76 సంవత్సరాలు. హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.

Jr NTR: నందమూరి మోక్షజ్ఞకు శుభాకాంక్షలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్, తాత ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించిన తారక్

Arun Charagonda

బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ లాంచ్ కోసం రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. నందమూరి మోక్షజ్ఞకు శుభాకాంక్షలు తెలిపారు జూనియర్ ఎన్టీఆర్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన తారక్..తాతగారి ఆశీస్సులు నీపై ఉండాలని కోరుకుంటున్నా అన్నారు.

Raj Tharun-Lavanya Case Row: హీరో రాజ్ తరుణ్‌ నిందితుడే, ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన పోలీసులు, పదేళ్ల పాటు సహజీవనం చేశారని కామెంట్

Arun Charagonda

హీరో రాజ్‌తరుణ్-లావణ్య కేసులో రాజ్‌తరుణ్‌ను నిందితుడిగా చేర్చారు పోలీసులు. ఈ మేరకు ఉప్పరపల్లి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు నార్సింగ్ పోలీసులు. లావణ్యతో రాజ్‌తరుణ్‌ పదేళ్లు సహజీవనం చేసినట్టు పేర్కొన్న పోలీసులు. పదేళ్లపాటు రాజ్‌తరుణ్-లావణ్య ఒకే ఇంట్లో ఉన్నారని వెల్లడించారు.

Advertisement

Nandamuri Mokshagnya Debut Film: అఫిషియల్..నందమూరి మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం, ప్రశాంత వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ, ఫస్ట్ లుక్ రిలీజ్

Arun Charagonda

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సమయం వచ్చేసింది. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం చేశారు. స్టార్‌ డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ బాలయ్య కుమారుడిని వెండితెరకు పరిచయం చేయనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ పోస్ట్ పెట్టారు. సింబా ఈజ్‌ కమింగ్‌ అంటూ మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆయన లుక్‌ను విడుదల చేశారు.

Sai Pallavi Badaga Dance: చెల్లి పెళ్లిలో సాయి ప‌ల్లవి ఎంజాయ్ మామూలుగా లేదు క‌దా! ఫ్యామిలీతో క‌లిసి సాంప్ర‌దాయ డ్యాన్స్ చేసిన న‌టి (వీడియో ఇదుగోండి)

VNS

న‌టి సాయి పల్లవి సోదరి పూజా కన్నన్ (Sai Pallavi Sister) పెళ్లి ఘ‌నంగా జ‌రిగింది. తన చిరకాల ప్రియుడు వినీత్‌తో పూజ ఏడడుగులు వేసింది. నటి సాయి పల్లవితో పాటు ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు ఈ వేడుకలో సందడి చేశారు. అయితే ఈ పెళ్లి వేడుక‌లో చెల్లి పూజా కన్నన్‌తో (Pja Kannan) క‌లిసి సాయి ప‌ల్ల‌వి డ్యాన్స్ చేసింది.

Vijay Sethupathi to Host Bigg Boss Tamil Season 8: బిగ్ బాస్ 8 హోస్ట్ గా విజ‌య్ సేతుప‌తి, కొత్త ప్రోమో చూశారా? క‌మ‌ల్ హాస‌న్ ను రీప్లేస్ చేసిన విల‌క్ష‌ణ న‌టుడు

VNS

బిగ్‌బాస్‌ ఎనిమిదో సీజన్‌కు (Bigg boss 8 tamil) రంగం సిద్ధమైంది. అదేంటి? ఆల్‌రెడీ మొదలైంది అంటారా! అవును, తెలుగులో మూడు రోజుల ‍క్రితమే లాంచ్‌ అయింది. ఇప్పుడు చెప్పుకోబోయేది తమిళ బిగ్‌బాస్‌ గురించి! అక్కడ కూడా ఏడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న తమిళ బిగ్‌బాస్‌ ఎనిమిదో సీజన్‌ షురూ కానుంది

Devara Daavudi Video Song: దేవర నుంచి దావూదీ వీడియో సాంగ్‌ ఇదిగో, పోటీపడి మరీ డ్యాన్స్ వేసిన జూనియర్ ఎన్టీఆర్, జాన్వీకపూర్‌

Vikas M

మేకర్స్‌ ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ముందుగా ప్రకటించిన ప్రకారం దావూదీ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.ఈ పాటలో తారక్‌, జాన్వీకపూర్‌ పోటీపడి మరీ డ్యాన్స్ చేసినట్లు వీడియో సాంగ్‌ చెబుతోంది.

Advertisement

Flood Relief Efforts: వరద బాధితులకు అండగా ప్రభాస్, ఏకంగా రూ.2 కోట్ల విరాళం, తెలుగు ప్రజల కోసం కదలి రావాలన్న మాజీ సీజేఐ ఎన్వీ రమణ

Arun Charagonda

భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. ఈ నేపథ్యంలో తమవంతు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు సినీ ప్రముఖులు. ఇప్పటివరకు పలువురు హీరోలు, హీరోయిన్స్, దర్శకులు విరాళాన్ని అందజేశారు.

Telugu States Rains: వరద బాధితులకు సోనూసూద్ సాయం, ధన్యవాదాలు తెలిపిన సీఎం చంద్రబాబు, ఆంధ్రా, తెలంగాణ ప్రజలు నా కుటుంబం సార్ అంటూ బదులిచ్చిన సోనూ

Hazarath Reddy

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వర్షాలు, వరదలతో యుద్ధం చేస్తున్నాయని, ఇలాంటి అవసరమైన సమయంలో వారికి అండగా ఉంటామని సోనూసూద్ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు సోనూసూద్ కు ధన్యవాదాలు తెలిపారు. దానికి సోనూ సూద్ రిప్లయి ఇస్తూ.. ఆంధ్రా, తెలంగాణ ప్రజలే నా కుటుంబం సార్. మీ మార్గదర్శకత్వంలో మేము వారి జీవితాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం చేస్తాము

Sonu Sood: తెలుగు రాష్ట్రాలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన సోనూసూద్, మంచినీరు, ఆహారం, మెడికల్ కిట్స్ అందిస్తామని ప్రకటన

Vikas M

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వర్షాలు, వరదలతో యుద్ధం చేస్తున్నాయని, ఇలాంటి అవసరమైన సమయంలో వారికి అండగా ఉంటామని సోనూసూద్ పేర్కొన్నారు. ప్రజలు తమ తమ సహాయ అభ్యర్థనలను పంపించేందుకు సోనూసూద్‌కు చెందిన చారిటీ ఫౌండేషన్ ఈ-మెయిల్‌ను ఇచ్చారు.

Megastar Chiranjeevi: వరద బాధితులకు అండగా చిరంజీవి, తెలుగు రాష్ట్రాలకు రూ. కోటి విరాళం, సహాయక చర్యల్లో పాల్గొనాలని విజ్ఞప్తి

Arun Charagonda

తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు అండగా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి. తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు తనను కలిచివేశాయన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన చిరు.. రెండు రాష్ట్రాల లో ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు కోటి రూపాయలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో 50 లక్షలు) విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు చిరు.

Advertisement

Devara Chuttamalle Song: 100 మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతున్న దేవర చుట్టమల్లె సాంగ్, నాలుగు వారాలుగా మోస్ట్‌ ట్రెండింగ్‌ జాబితాలో..

Vikas M

జూనియర్‌ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వం వహిస్తున్న దేవర మూవీ రెండు పార్టులుగా తెరకెక్కుతున్న సంగతి విదితమే. దేవర పార్టు 1 సెప్టెంబర్ ‌27న గ్రాండ్‌గా విడుదల కానుంది.ఈ సినిమా నుంచి వచ్చిన చుట్టమల్లె పాట విడుదలైన నెలలోపే (29 రోజులు) యూట్యూబ్‌లో 100 మిలియన్లకుపైగా వ్యూస్‌తో నంబర్‌ 1 స్థానంలో ట్రెండింగ్‌లో నిలిచింది

Telugu States Rains: వరద బాధితులకు రూ. 1 కోటి విరాళం ప్రకటించిన మహేష్ బాబు, ప్రభుత్వాల ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అభ్యర్థన

Vikas M

ఇరు తెలుగు రాష్ట్రాలను వరదలు తీవ్రంగా ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్‌కు తాను రూ.50 లక్షలు చొప్పున విరాళం ఇస్తున్నట్టు ప్రకటించాడు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు అందించడానికి, వరద ప్రాంతాల పునరుద్ధరణ విషయంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలకు సమష్టిగా మద్దతు ఇద్దామంటూ మహేశ్ బాబు పిలుపునిచ్చారు.

Telugu States Floods: తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు రూ. కోటి విరాళం ప్రకటించిన ఎమ్మెల్యే బాలకృష్ణ, ఇంకా ఏమన్నారంటే..

Hazarath Reddy

ఎమ్మెల్యే బాలకృష్ణ (Nandamuri Balakrishna) సైతం భారీ విరాళం ప్రకటించారు. వరద బాధితుల సహాయార్థం తన వంతు సాయంగా ఒక్కో రాష్ట్రానికి రూ.50 లక్షలు చొప్పున మొత్తం రూ.కోటి విరాళంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

Telugu States Floods: భారీ వరదలు, తెలుగు రాష్ట్రాలకు రూ. 50 లక్షలు విరాళం ప్రకటించిన దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశీ

Hazarath Reddy

భారీ వర్షాల వల్ల నష్టపోయిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌, నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశీ సాయం ప్రకటించారు. తమ సొంత నిర్మాణ సంస్థలైన హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ పేర్లతో రూ. 50 లక్షలు ప్రకటించారు.

Advertisement
Advertisement