ఎంటర్టైన్మెంట్

Varun - Lavanya Wedding: ఒక్కటైన సెలబ్రెటీ కపుల్, ఇటలీలో ఘనంగా వివాహ వేడుక, సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

VNS

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు (Varun tej-Lavanya Tripathi) వివాహ బంధంతో ఒక్కటయ్యారు. లావణ్య మెడలో వరుణ్ మూడు ముళ్లు వేసి, ఏడు అడుగులు నడిచారు. దాంతో ఈ ప్రేమ జంట ఒక్కటైంది. పెళ్లి తంతు (wedding) ముగిశాక ఇద్దరూ దేవుడికి నమస్కరించారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ (Viral) అయ్యింది.

Rajinikanth: రజనీకాంత్‌‌కు గుడి కట్టి రోజూ పూజలు చేస్తున్న అభిమాని, గుడిలో అన్ని సూపర్ స్టార్ సినిమా పోస్టర్లే..స్టోరీ ఏంటో చూసేయండి మరి..

Hazarath Reddy

తమిళ చిత్రసీమలో సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న రజనీకాంత్‌ను ఆయన అభిమానులు తమ ఆరాధ్యదైవంలా చూస్తారని అంటున్నారు. కానీ, ఇక్కడ కేవలం మాటలకే కాదు, రజనీని నిజంగా వంశ దైవంగా భావించి, ఆయనకు పూజా గదిని ఏర్పాటు చేసి రోజూ పూజలు చేసే ఓ ప్రత్యేక అభిమాని కూడా ఉన్నారు.

Actress Dr Priya Dies: సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం, గుండెపోటుతో బుల్లితెర నటి, నిండు గర్భిణి డాక్టర్‌ ప్రియ మృతి

Hazarath Reddy

మలయాళ చిత్రపరిశ్రమలో బుల్లితెర నటి రెంజూష మీనన్‌ మరణవార్త మరువకముందే మరో బుల్లితెర నటి, డాక్టర్‌ ప్రియ(35) గుండెపోటుతో మరణించింది. ఎనిమిది నెలల గర్భిణి అయిన ప్రియ ప్రెగ్నెన్సీ చెకప్‌లో భాగంగా ఇటీవలే ఆస్పత్రికి వచ్చింది.

Telangana Elections 2023: వీడియో ఇదిగో, తెలంగాణ ప్రభుత్వంపై హీరో నాగార్జున ప్రశంసలు, హైదరాబాద్ నగరాన్ని కొనియాడిన హీరో..

Hazarath Reddy

తెలంగాణ ప్రభుత్వాన్ని, మంత్రి కేటిఆర్‌ను హీరో నాగార్జున మెచ్చుకున్నారు. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుగా హైదరాబాద్‌ నగరాన్నే ఎంచుకుంటున్నాయని దీనికి కారణం తెలంగాణ ప్రభుత్వమే అని నాగార్జున కొనియాడారు.

Advertisement

Janhvi Kapoor Photo From Devara: ఎన్టీఆర్ దేవర నుంచి ఫోటో లీక్, సెట్స్ నుంచి తన ఫోటో పోస్ట్ చేసిన జాన్వి కపూర్, ఇంతకీ మూవీలో జాన్వి పాత్ర పేరు ఏంటో తెలుసా?

VNS

తాజాగా జాన్వీ ఆ సెట్స్ లోని ఒక ఫోటో షేర్ చేస్తూ (Janhvi Kapoor Leaks Photo).. “దేవర సెట్స్‌ని, టీంని, ‘తంగం’గా నటించడం మిస్ అవుతున్నాను” అంటూ ఒక పిక్ ని లీక్ చేసింది. ఈ పోస్టు బట్టి చూస్తే ఈ సినిమాలో జాన్వీ పాత్ర పేరు ‘తంగం’ అని తెలుస్తుంది. తంగం (Thangam) అంటే బంగారం అని అర్ధం అంటా. ఈ పిక్ లోని జాన్వీ లుక్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి.

Renjusha Menon Dies: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, ప్రముఖ నటి రెంజూష మీనన్ ఉరివేసుకుని ఆత్మహత్య, ఆర్థిక ఇబ్బందులే బలి తీసుకున్నాయా..

Hazarath Reddy

మాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బుల్లితెర నటి రెంజూష మీనన్ తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. తిరువనంతపురంలోని శ్రీకార్యం ప్రాంతంలోని తన అపార్ట్‌మెంట్‌లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

Manchu Vishnu: ‘కన్నప్ప’ షూటింగ్‌లో గాయపడ్డ మంచు విష్ణు.. న్యూజిలాండ్ లో విష్ణుపైకి దూసుకొచ్చిన డ్రోన్!

Rudra

టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప టీం ప్రస్తుతం న్యూజిలాండ్‌ లో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడే షూటింగ్‌ ను శరవేగంగా జరుపుతున్నారు. అయితే తాజాగా కన్నప్ప టీం నుంచి ఓ వార్త బయటకు వచ్చింది.

Matthew Perry Dies: బాత్ రూంలో గుండెపోటుతో మృతి చెందిన ప్రముఖ నటుడు, తన ఇంట్లోనే అచేతనంగా కనిపించిన ఫ్రెండ్స్ సిరీస్ స్టార్ మాథ్యూ పెర్రీ

Hazarath Reddy

సినీ పరిశ్రమలో మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది. హాలీవుడ్ బుల్లితెర నటుడు, నిర్మాత మాథ్యూ పెర్రీ కన్నుమూశారు. 54 ఏండ్ల వయసున్న ఆయన శనివారం సాయంత్రం లాస్ ఏంజిల్స్ లోని తన సొంత ఇంట్లోనే అచేతనంగా కనిపించారు. ఈ విషయాన్ని లాస్ ఏంజిల్స్ టైమ్స్ అధికారికంగా వెల్లడించింది.

Advertisement

Rithu Chowdary Got Cheated: అతను చేసిన పనికి ఎన్నో రాత్రులు ఏడ్చాను! నమ్మినందుకు ఘోరంగా మోసం చేశాడంటూ జబర్దస్త్ నటి కన్నీళ్లు, పోలీస్‌ కేసు కూడా పెట్టానంటున్న రీతూ చౌదరి

VNS

కామెడీ షో జబర్దస్త్‌ నటి రీతూ చౌదరి (Rithu Chowdary) బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమే.. కొద్దిరోజుల క్రితం తన తండ్రి మరణించడంతో ప్రస్తుతం తన కుటుంబానికి అన్నీ తానై చూసుకుంటుంది. తన కొత్త ఇంటి నిర్మాణం విషయంలో ఓ ఇంటీరియర్‌ డిజైనర్‌ (Intirior Designer) వల్ల తాను మానసిక ఆందోళనకు గురయ్యానని చెబుతూ తన యూట్యూబ్‌ ఛానల్‌లో చెప్పుకొచ్చింది.

Model Body Found In Fridge: ఫ్రిడ్జ్‌లో దొరికిన మోడల్ శవం, రెండు నెలల ప్రెగ్నెంట్‌గా తేల్చిన పోలీసులు, కాళ్లు, చేతుల కట్టేసి, నోటికి ప్లాస్టర్ వేసి దారుణంగా హత్య, పోస్టుమార్డంలో సంచలన నిజాలు

VNS

ఒక మోడల్‌ మృతదేహాన్ని ఫ్రిజ్‌లో పోలీసులు గుర్తించారు. (Los Angeles model) ఆమె నోటిని మూసి, కాళ్లు చేతులు కట్టేసి ఉన్నాయని తెలిపారు. హత్యకు గురైన ఆ మోడల్‌ రెండు నెలల గర్భవతిగా పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ ద్వారా నిర్ధారణ అయ్యిందని వెల్లడించారు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఈ సంఘటన జరిగింది.

Arjun Daughter Engagement: టాప్‌ కమెడియన్‌ తో వియ్యమందుకుంటున్నయాక్షన్ కింగ్ అర్జున్, ఇప్పుడిప్పుడే హీరోగా సినిమాలు చేస్తున్న అర్జున్‌కు కాబోయే అల్లుడు, కుమార్తె ఎంగేజ్‌మెంట్ ఫోటోలు విడుదల

VNS

తెలుగు, తమిళంలో యాక్షన్ హీరో ఇమేజ్ ని సొంతం చేసుకున్న అర్జున్ సర్జా (Arjun Sarja) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం అడపాదడపా హీరోగా సినిమాలు చేస్తూనే.. ఇతర సినిమాల్లో ముఖ్య పాత్రలు చేస్తూ వస్తున్నాడు. ఈమద్యలో డైరెక్టర్ గా కూడా సినిమాలు తెరకెక్కిస్తున్నాడు.

Jailer Villain Arrested: జైలర్ విలన్‌ అరెస్ట్, ఫుల్లుగా తాగి న్యూసెన్స్ చేసిన వినాయకన్, అపార్ట్ మెంట్ వాసుల ఫిర్యాదుతో అరెస్ట్ చేసిన కేరళ పోలీసులు

VNS

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth) హీరోగా తెరకెక్కిన ‘జైలర్‌’ (Jailer) సినిమాలో విలన్‌గా నటించిన వినాయకన్‌ను (Vinayakan) కేరళ పోలీసులు అరెస్టు (Arrest) చేశారు. మద్యంమత్తులో తమను ఇబ్బంది పెడుతున్నారంటూ ఆయన నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వినాయకన్‌ను ఎర్నాకుళం టౌన్‌ నార్త్‌ పోలీసులు ఆయనను స్టేషన్‌కు పిలిపించారు.

Advertisement

Guntur Karam New Update: మహేష్ బాబు కారు డిక్కీలో కూర్చుని స్టైల్ గా బీడీ కాలుస్తున్న గుంటూరు కారం కొత్త పోస్టర్ ఇదిగో, ఖుషీ అవుతున్న అభిమానులు

Hazarath Reddy

దసరా, విజయదశమి పండుగలను పురస్కరించుకుని వరుసగా లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ను అందిస్తూ వస్తున్నారు మేకర్స్. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, OG ల నుండి అప్డేట్స్ రాగా, తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం మూవీ నుండి సూపర్ అప్డేట్ వచ్చింది.

Gautami Quits BJP: తమిళనాడులో బీజేపీకి బిగ్ షాక్, 25 ఏళ్లు బంధాన్ని తెంచుకుంటూ రాజీనామా చేసిన ప్రముఖ నటి గౌతమి, రాజీనామా లేఖ ఇదిగో..

Hazarath Reddy

తమిళనాడు(Tamilnadu) బీజేపీకి గట్టి షాక్ తగిలింది. పార్టీకి చెందిన సీనియర్ నేత, నటి గౌతమి తాడిమళ్ల(Actor Gautami Tadimalla) రాజీనామా చేశారు. తన రాజీనామా విషయాన్ని ఎక్స్(X) వేదికగా వెల్లడించారు. రాజీనామా లేఖని పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda)కు, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలైకు పంపించారు.

Tiger Nageswara Rao Run Time Reduced: రవితేజ ఫ్యాన్స్‌కు మరింత థ్రిల్‌, మూవీ రన్‌ టైంను భారీగా తగ్గించిన యూనిట్, ఏకంగా 24 నిమిషాలు కోత పెట్టి రిలీజ్‌

VNS

హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్, అదిరిపోయే ఎలివేషన్స్ తో మాస్ ఆడియన్స్ కి మంచి కిక్‌నే అందజేస్తుంది. అయితే ఈ మూవీ నిడివి చాలా ఎక్కువ అయ్యిందనే టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలోనే సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అయ్యిందనే టాక్ వినిపిస్తుంది.

Vijayashanthi in Kalyanram Movie: మరో సినిమాకు విజయశాంతి గ్రీన్‌ సిగ్నల్.. నందమూరి కల్యాణ్ రామ్ సినిమాలో కీలక పాత్రకు ఓకే

Rudra

రాజకీయాలు, ప్రజాసేవా కార్యక్రమాల్లో బిజీబిజీగా గడుపుతున్న ‘లేడీ అమితాబ్’ విజయశాంతి చాలా గ్యాప్ తర్వాత మరోసారి వెండితెరపై మెరవబోతున్నారు.

Advertisement

Baby Combo Repeat: మరోసారి తెరమీదకు బేబీ కాంబో, ఆనంద్-వైష్ణవీ లీడ్ రోల్స్‌లో నిర్మాతగా మారిన బేబీ డైరక్టర్, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫస్ట్ లుక్

VNS

దాదాపు 90 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది బేబీ సినిమా. ఈ సినిమాని SKN నిర్మించాడు. ఇప్పుడు ఇదే కాంబో మళ్ళీ రాబోతుంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా కొత్త దర్శకుడు రవి నంబూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. బేబీ సినిమా దర్శకుడు సాయి రాజేష్ ఈ సినిమాకు కథ అందించడమే కాక నిర్మాతగా కూడా మారడం విశేషం.

Venu Yeldandi: రెండోసారి తండ్రి అయిన బలగం దర్శకుడు వేణు, అమ్మాయి పుట్టిందంటూ ఇన్ స్టాలో పోస్ట్

Hazarath Reddy

బలగం' సినిమాతో దర్శకుడిగా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించిన వేణు యెల్దండి.. ఇప్పుడు తండ్రిగా మరోసారి ప్రమోషన్స్ పొందాడు. తనకు అమ్మాయి పుట్టిందని చెబుతూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. వేణుకి ఇదివరకే ఓ కొడుకు ఉన్నాడు. ఇద్దరూ కలిసి యూట్యూబ్ ఛానెల్‌లో పలు వీడియోస్ కూడా చేశారు.

Bhagavanth Kesari Review: భగవంత్‌ కేసరి మూవీ రివ్యూ ఇదిగో, బాలకృష్ణ వన్ మ్యాన్ షోగా నడిపాడా, అనిల్ రావిపూడి కామెడీ వర్క్ అవుట్ అయిందా..

Hazarath Reddy

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్‌ మూవీ ‘భగవంత్‌ కేసరి’. ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌ గా నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్ర పోషించింది.భారీ అంచనాల మధ్య నేడు(అక్టోబర్‌ 19) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది

Leo Movie Review: లియో మూవీ రివ్యూ ఇదిగో, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నెటిజన్లు, ఎక్స్‌లో ట్రెండ్ అవుతున్న LeoDisaster, LeoTelugu హ్యాష్‌ట్యాగ్స్

Hazarath Reddy

దళపతి’విజయ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘లియో’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విక్రమ్‌ వంటి బ్లాక్ బాస్టర్ హిట్ అందించిన లోకేష్‌ కనగరాజ్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. లియో’పై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేసింది.

Advertisement
Advertisement