సినిమా

Cheque Bounce Case: శరత్‌కుమార్‌, రాధికలకు ఏడాది జైలు శిక్ష, రూ. 5 కోట్ల జరిమానా, 2018 నాటి చెక్‌ బౌన్స్‌ కేసులో తాజాగా తీర్పు ఇచ్చిన ప్రత్యేక కోర్టు, నాలుగేళ్ల పాటు సాగిన విచారణ

Hazarath Reddy

తమిళ నటుడు, రాజకీయ నాయకుడు శరత్‌కుమార్‌, అతడి భార్య, నటి, నిర్మాత రాధికలకు (Actors Sarathkumar and Radhika) ప్రత్యేక కోర్టులో చుక్కెదురైంది. 2018 నాటి చెక్‌ బౌన్స్‌ కేసులో (Cheque Bounce Case) ఇరువురికీ న్యాయస్థానం ఏడాది కాలం పాటు జైలు శిక్ష (get one-year jail term) విధిస్తూ తీర్పునిచ్చింది.ఈ కేసుకు సంబంధించి రూ .5 కోట్ల జరిమానా కూడా కోర్టు విధించింది.

Varma Birthday: ఈ రోజు నేను చచ్చిన రోజు, పుట్టిన రోజు కాదు, ఏడుస్తున్న ఎమోజీలతో ట్వీట్ చేసిన వర్మ, ఫన్నీగా కామెంట్స్ పెడుతున్న అభిమానులు 

Hazarath Reddy

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పుట్టిన రోజు ఈ రోజు (ఏప్రిల్‌, 7). ఈ సందర్భంగా సినీవర్గానికి చెందిన పలువురితో పాటు, ఆయన అభిమానులు రామూకి అభినందనలు తెలుపుతున్నారు. అయితే ఎపుడూ వివాదాస్పద, వ్యంగ్య, కొంటె కమెంట్లతో వార్తల్లో నిలిచే ఆర్జీవీ మరోసారి తనదైన స్టయిల్‌లో తన పుట్టిన రోజు గురించి చెప్పుకొచ్చాడు. ఈ రోజు నా బర్త్‌డే కాదు..వాస్తవానికి నా డెత్‌ డే.. ఎందుకంటే నా ఆయుష్షులో ఇక సంవత్సరం తగ్గిపోయింది అంటూ బుధవారం ట్వీట్‌ చేశారు.

Director Bharathiraja: ఓటు హక్కును వినియోగించుకున్న దర్శకుడు భారతీ రాజా, హీరో సూర్య, కార్తీ, కమల్ హాసన్, కొనసాగుతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

Hazarath Reddy

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దర్వఖుడు భారతీ రాజా, నటుడు సూర్య, కార్తీ, కమల్ హాసన్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Hero Ajith: ఓటు హక్కును వినియోగించుకున్న హీరో అజిత్, షాలినితో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చిన తమిళ నటుడు, సెల్ఫీ తీస్తున్న అభిమాని నుంచి ఫోన్ లాక్కుని తరువాత క్షమాపణ చెప్పిన అజిత్

Hazarath Reddy

తమిళనాడులో నేడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా, సీనియర్ హీరో అజిత్ చెన్నైలో తన ఓటు వేశారు. తన అర్ధాంగి షాలినితో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. సాధారణ ఓటర్ల మాదిరే ఆయన క్యూలో నిల్చుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఈ సందర్భంగా అభిమానులు అజిత్ ను తమ కెమెరాల్లో బంధించేందుకు పోటీలు పడ్డారు.

Advertisement

Rajinikanth: ఓటు హక్కును వినియోగించుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్, ఈ ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ప్రకటించని తలైవా, ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచన

Hazarath Reddy

త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ త‌న ఓటు హ‌క్కును ఉద‌యమే వినియోగించుకున్నారు. థౌజండ్ లైట్స్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని స్టెల్లా మేరిస్ పోలింగ్ బూత్‌లో ర‌జ‌నీకాంత్ ఓటేశారు. ఈ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని నిర్ణయించుకున్న ర‌జ‌నీకాంత్.. త‌న ఆరోగ్య ప‌రిస్థితుల దృష్ట్యా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న విష‌యం తెలిసిందే.

Thalapathy Vijay: సైకిల్ మీద వచ్చి ఓటు వేసిన నటుడు విజయ్, అభిమానులతో సెల్ఫీలకు పోజులు, సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

Hazarath Reddy

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌ సైకిల్‌పై వచ్చి ఓటు వేశారు. పోలింగ్‌ కేంద్రంలో అభిమానులతో సెల్ఫీలకు పోజులిచ్చారు. ప్రస్తుతం ఆయన సైకిల్‌పై వచ్చిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. హీరో విజయ్‌ వేగంగా సైకిల్‌ తొక్కుతూ పోలింగ్‌ కేంద్రానికి వస్తుండగా రోడ్డుపై అభిమానులు అయన వెంట బైక్‌లతో అనుసరించారు.

P Balachandran Dies: ప్రముఖ నటుడు పి. బాలచంద్రన్ కన్నుమూత, అంకుల్ బన్ సినిమాతో వెండి తెరకు పరిచయం, కేరళ సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు కేరళ ప్రొఫెషనల్ నాటక అవార్డును అందుకున్న సినీ రచయిత

Hazarath Reddy

ప్రముఖ మలయాళ నటుడు, సినీ రచయిత పి. బాలచంద్రన్(69) కన్నుమూశారు. గత ఎనిమిది నెలలుగా అనాగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆయనకు భార్య శ్రీలత, కుమార్తె, కుమారుడు ఉన్నారు. 1991లో మోహన్‌లాల్ హీరోగా నటించిన ‘అంకుల్ బన్’ అనే సినిమాతో ఆయన స్క్రీన్ రైటర్‌గా వెండితెరకు పరిచయమయ్యారు.పలు చిత్రాలకు స్క్రీన్ రైటర్‌గా కథ, మాటలు అందించారు.

Akshay Kumar covid-19: అక్షయ్‌ కుమార్‌కు కరోనా, ట్విట్టర్ ద్వారా వెల్లడించిన బాలీవుడ్‌ హీరో, త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి మీ ముందుకు వస్తానంటూ ట్వీట్

Hazarath Reddy

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కరోనా బారిన (Akshay Kumar covid-19) పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా అక్షయ్ కుమార్ ఇన్ స్టాగ్రామ్ (Akshay Kumar on Instagram)ద్వారా వెల్లడించారు. ‘‘ఇవాళ ఉదయం నాకు కరోనా పాజిటివ్ అని తెలిసింది. స్వల్ప లక్షణాలు కనిపించడంతో కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. వైద్యులు నాకు పాజిటివ్‌గా ధృవీకరించారు.

Advertisement

Roja Discharged From Hospital: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఎమ్మెల్యే రోజా, మూడు వారాల పాటు విశ్రాంతి అవసరమని తెలిపిన డాక్టర్లు, రోజాను పరామర్శించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

Hazarath Reddy

రెండు మేజర్‌ సర్జరీలు చేసుకొని చెన్నై మలర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఏపీఐఐసీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే ఆర్కేరోజా శనివారం డిశ్చార్జి (Roja Discharged From Hospital) అయ్యారు. సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. ఆమె భర్త ఆర్కే సెల్వమణి, కుమార్తె అన్షుమాలిక, కుమారుడు కృష్ణకౌశిక్, కుటుంబ సభ్యులు ఆమెను కలుసుకొని సంతోషంగా చెన్నైలోని వారి స్వగృహానికి తీసుకెళ్లారు.

Coronavirus in Tollywood: టాలీవుడ్‌లో కరోనా కలకలం, హీరోయిన్‌ నివేదా థామస్‌‌కు కరోనా పాజిటివ్, ట్విట్టర్ ద్వారా తెలిపిన ముద్దుగమ్మ

Hazarath Reddy

హీరోయిన్‌ నివేదా థామస్‌ (Nivetha Thomas) తాజాగా కరోనా బారిన పడ్డారు.ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ఆమె ట్వీట్‌ చేస్తూ.. ‘అందరికి నమస్తే.. నేను కరోనా పాజిటివ్‌గా పరీక్షించాను. డాక్టర్‌ సలహాతో అన్ని విధాల మెడికల్‌ ప్రోటోకాల్‌ పాటిస్తూ ఐసోలేషన్‌కు వెళ్లాను. ఇటీవల నన్ను కలిసి వారంత దయచేసి హోం క్వారంటైన్‌కు వెళ్లండి.

Ajay Devgn in RRR: లోడ్.. ఎయిమ్.. షూట్! బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గన్‌కు డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి బర్త్ డే గిఫ్ట్

Vikas Manda

బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవ్‌గన్ ఏప్రిల్ 2న తన 52వ జన్మదిన వేడుకను జరుపుకుంటున్నారు. ఆయనకు సర్ప్రైజ్ బహుమతిగా డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి RRR సినిమా నుండి అజయ్ దేవ్‌గన్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు.

Dinner for Wild Dog: 'వైల్డ్ డాగ్' కోసం నోరూరించే డిన్నర్ రెడీ చేసిన మెగాస్టార్! కిచెన్‌లో చిరు- నాగ్ కలిసి ఉన్న ఫోటో వైరల్

Vikas Manda

కింగ్ నాగార్జున నటించిన 'వైల్డ్ డాగ్' మూవీ శుక్రవారం రిలీజ్ అయింది. అంతకుముందు రోజు చిరంజీవి స్వయంగా తనకోసం డిన్నర్ రెడీ చేశారని చూపిస్తూ నాగార్జున ఒక ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు..

Advertisement

Phalke Award to Rajinikanth: రజినీ కాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, తలైవాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ; త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు

Team Latestly

తమిళనాడు ఎన్నికలకు మరో ఐదు రోజులు ఉందనగా, నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ కు అత్యున్నత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ దిల్లీలోని తన నివాసం నుంచి ఈ ప్రకటన చేశారు.....

Vakeel Saab Trailer Released: ‘మీరు వర్జినా.. అని అమ్మాయిలను అడగొచ్చు..మేం అబ్బాయిలను అడగొద్దా, కోర్టులో వాదించిన పవన్ కళ్యాణ్, హోలీ సందర్భంగా వకీల్‌ సాబ్‌’ ట్రైలర్‌ విడుదల చేసిన చిత్రయూనిట్

Hazarath Reddy

‘మీరు వర్జినా.. అని అమ్మాయిలను అడగొచ్చు.. మేం అబ్బాయిలను అడగొద్దా’ అంటూ కోర్టులో పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ వాదిస్తూ కనిపించాడు. ఏం న్యాయం నందాజీ.. కూర్చోండి అంటూ ప్రకాశ్‌ రాజ్‌కు కౌంటర్‌ ఇస్తూ కనిపించాడు

Vakeel Saab: వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్ సంధర్భంగా తోపులాట, వైజాగ్ సంగం శరత్ థియేటర్‌లో పగిలిన అద్దాలు, పలువురు కిందపడినా తొక్కుకుంటూ వెళ్లిన అభిమానులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఒక థియేటర్‌లో సోమవారం పవన్ కళ్యాణ్ సినిమా మూవీ ట్రైలర్ (Vakeel Saab) రిలీజ్ సంధర్భంగా తోపులాట చోటు చేనుకుంది ఈ తోపులాటలో (Ruckus Erupts at Theatre in Visakhapatnam) అద్దాలు పగిలాయి. అద్దాలపై ఇద్దరు పడటంతో గాయాలాయ్యాయి. కాగా నటుడిగా మారిన రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ చిత్రం 'వకీల్ సాబ్' ట్రైలర్ లాంచ్ కోసం పెద్ద సంఖ్యలో అభిమానులు సంగం శరత్ థియేటర్‌లో రావడంతో ఈ గందరగోళం చోటు చేసుకుంది.

Nagarjuna's Wild Dog Movie: ఏప్రిల్‌ 2న విడుదల కానున్న నాగార్జున వైల్డ్ డాగ్, సెన్సార్ కార్యక్రమాలు పూర్తి, ఏసీపీ విజ‌య్ వ‌ర్మ‌గా నాగార్జున సరికొత్త గెటప్, అదే రోజు కార్తి ‘సుల్తాన్’ సినిమా కూడా విడుదల

Hazarath Reddy

ఎందరో టాలెంటెడ్ డైరెక్టర్స్‌ని టాలీవుడ్‌కి పరిచయం చేసిన కింగ్ ‘వైల్డ్ డాగ్’ తో (Nagarjuna's Wild Dog Movie) అహిసోర్ సాల్మన్‌ను పరిచయం చేస్తున్నారు. ఇది నాగార్జునకు 40వ చిత్రం. ఈ సినిమాను ఏప్రిల్‌ 2న విడుదల చేస్తున్నారు. నాగార్జున జోడీగా దియా మీర్జా న‌టిస్తున్న ఈ చిత్రంలో (Nagarjuna's Wild Dog) ఓ కీల‌క పాత్ర‌లో స‌యామీ ఖేర్ క‌నిపించ‌నున్నారు. ఈ సినిమాకు సంబంధించిన సోమవారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమా చూసిన టీమ్ U/A సర్టిఫికెట్ జారీ చేశారు.

Advertisement

James Bond Movies Offer: ఆ సినిమాలు చూస్తే రూ.72 వేలు మీ చేతికి, జేమ్స్ బాండ్ సినిమాలపై బంపరాఫర్ ప్రకటించిన NerdBear.com అనే వెబ్‌సైట్, అయితే ఇండియన్లకు నో ఛాన్స్, కేవలం యూఎస్ లో నివాసం ఉండే వారికి మాత్రమే

Hazarath Reddy

జేమ్స్ బాండ్ సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సిరీస్ నుంచి నెక్ట్స్ వెర్షన్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు (James Bond Fans) ఎంతో ఆత్రంగా చూస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు అభిమానులకు సరికొత్త ఆఫర్ ను అందిస్తోంది. 30 రోజుల్లో 24 జేమ్స్బాండ్ సినిమా సీరిస్‌లు ( James Bond Movies Offer) చూస్తే.. రూ. 73 వేలు మన ఖాతాలో జమవుతాయి. NerdBear.com అనే వెబ్‌సైట్ ఈ ప్రత్యేక ఆఫర్ ని ప్రకటించింది.

Paresh Rawal Covid Positive: కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా..బాలీవుడ్ నటుడు పరేశ్ రావల్‌కు కరోనా, నన్ను కలిసిన వారు తప్పకుండా టెస్ట్ చేయించుకోవాలని ట్వీట్, దేశంలో తాజాగా 62,258 మందికి కరోనా నిర్ధారణ

Hazarath Reddy

బాలీవుడ్ ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు పరేశ్ రావల్ కు కరోనా (Paresh Rawal Covid Positive) సోకింది. అయితే, ఆయన కరోనా వ్యాక్సిన్ తీసుకున్నా వైరస్ సోకడం గమనార్హం. తనకు కరోనా వచ్చిందని శుక్రవారం పరేశ్ రావల్ ట్వీట్ చేశారు. ‘‘దురదృష్టవశాత్తూ నాకు కరోనా (Paresh Rawal Tests Positive for COVID-19) సోకింది. గత పది రోజుల్లో నన్ను కలిసిన వారు తప్పకుండా టెస్ట్ చేయించుకోండి’’ అంటూ ట్వీట్ చేశారు.

Alluri Sita Rama Raju from RRR: అల్లూరి సీతారామ రాజుగా ఉక్కు కండలతో, విల్లు ఎక్కుపెట్టి ఠీవీగా నిల్చున్న రామ్ చరణ్ లుక్ మాటలకందని అద్భుతం!

Vikas Manda

శనివారం రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న RRR సినిమాకు సంబంధించి రామ్ చరణ్ పోషిస్తున్న అల్లూరి సీతారామ రాజు యొక్క స్టిల్‌ను విడుదల చేశారు....

Rana Daggubati Reaction: నా ఫేస్ రియాక్షన్ కూడా అదే! ఫిల్మ్‌ఫేర్‌కు అదరగొట్టే పంచ్ ఇచ్చిన రానా దగ్గుబాటి, సోషల్ మీడియాలో మ్యూటేట్ అవుతోన్న రానా ఫోటో మీమ్

Vikas Manda

రానా దగ్గుబాటి దిగాలుగా చూస్తున్న ఒక ఫోటోను తీసుకొని ఫిల్మ్‌ఫేర్ వారు ' కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ పట్ల మా రియాక్షన్' అంటూ ట్వీట్ చేశారు. అయితే అందులో రానా దగ్గుబాటి పేరును 'రానా దాగుబట్టి' అని తప్పుగా రాశారు.....

Advertisement
Advertisement