సినిమా
IIFA 2024 Winners List:: IIFA 2024 విజేతల జాబితా ఇదిగో, ఉత్తమ నటులుగా షారుఖ్ ఖాన్, రాణి ముఖర్జీ, బహుళ అవార్డులను గెలుచుకున్న యానిమల్ మూవీ
Hazarath ReddyIIFA అవార్డులుగా ప్రసిద్ధి చెందిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ 2024 ఎడిషన్ UAEలోని అబుదాబిలో సెప్టెంబర్ 27-29 వరకు జరిగింది.
Salman Khan Warning Row: 'సల్మాన్ ఖాన్ ను బెదిరించి తప్పు చేశా'.. పోలీసులకు నిందితుడి మరో మెసేజ్
Rudraబాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను చంపేస్తాం అంటూ ఇటీవల బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. బిష్ణోయ్ గ్యాంగ్ తో ఉన్న గొడవకి ముగింపు పలకాలంటే తమకు రూ.5 కోట్లు ఇవ్వాలంటూ ఇటీవల ముంబయి ట్రాఫిక్ పోలీసుల వాట్సప్ నంబర్ కు ఒక మెసేజ్ వచ్చిన విషయం తెలిసిందే.
Casting Couch: క్యాస్టింగ్ కౌచ్ పై తెలుగు నటి అనన్యకు ఇబ్బందికరమైన ప్రశ్న… లేడీ జర్నలిస్టుపై ఫిర్యాదు చేసిన ఫిల్మ్ ఛాంబర్.. అసలేం జరిగిందంటే?? (వీడియోతో)
Rudraసినిమా ఈవెంట్లలో, మూవీ ప్రమోషన్స్ లో ఆయా చిత్రాల్లో నటించిన హీరో, హీరోయిన్లను ఇబ్బంది పెట్టేలా కొందరు జర్నలిస్టులు ఉద్దేశపూర్వకంగా కొన్ని ప్రశ్నలు సంధించడం ట్రెండ్ గా మారింది.
Unstoppable 4: మా బావగారు మీ బాబుగారు.. బాలకృష్ణ అన్‌స్టాపబుల్ 4 సీజన్ చంద్రబాబు నాయుడు ఎపిసోడ్ గ్లింప్స్ విడుదల
Vikas Mబాలకృష్ణ (Balakrishna) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ (Unstoppable). నాలుగో సీజన్ తొలి ఎపిసోడ్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. షోకి సంబంధించిన గ్లింప్స్ తాజాగా విడుదలైంది.
Raja Saab New Poster: ప్రభాస్ రాజా సాబ్ నుంచి కొత్త పోస్టర్ విడుదల చేసిన మేకర్స్, గళ్ళ కోటు, నల్ల ప్యాంటు, టీ షర్ట్‌తో అదిరిపోయిన డార్లింగ్ లుక్
Hazarath Reddyపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజా చిత్రం రాజా సాబ్ (Raaja Saab) నుంచి అప్ డేట్ వచ్చింది. అక్టోబర్ 23న రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్‌డే కానుకగా రాజా సాబ్ నుంచి క్రేజీ అప్‌డేట్ ఉండబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా మూవీ నుంచి ప్రభాస్ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.
Unstoppable Season 4 : బాలకృష్ణ దగ్గర కూరగాయలు కొన్న చంద్రబాబు, బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్-4 మొదలైంది, మరోసారి ఓటీటీలో సందడి చేయనున్న బావ, బావమరిది
VNSఆహా ఓటీటీలో వచ్చిన బాలకృష్ణ అన్‌స్టాపబుల్ (Unstoppable Season 4) మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక నాలుగో సీజన్‌కు సంబంధించిన ప్రొమోను ఇప్పటికే విడుదల చేశారు. అన్‌స్టాపబుల్ సీజన్ 4 పై అంచనాలు భారీగానే ఉన్నాయి. వాటికి ఏ మాత్రం తగ్గకుండా షోను ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు.
Unstoppable With NBK: నేడే ఆహా అన్‌స్టాపబుల్ సీజన్ 4 షూటింగ్ ప్రారంభం..సీఎం హోదాలో గెస్ట్‌గా చంద్రబాబు!
Arun Charagondaఆహా అన్‌స్టాపబుల్ సీజన్ 4 షూటింగ్ నేటి నుండి ప్రారంభంకానుంది. సీజన్ 4 ఫస్ట్ ఎపిసోడ్ కు గెస్ట్ గా సీఎం చంద్రబాబు వస్తుండగా చంద్రబాబును బాలయ్య ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారనేదానిపై ఆసక్తి నెలకొంది.
Bigg Boss Kannada 11: వివాదంలో కన్నడ బిగ్ బాస్ షో, న్యాయవాది ఫిర్యాదుతో మహిళా కమిషన్ నోటీసులు, బిగ్ బాస్‌ను రద్దు చేయాలన్న పిటిషన్‌పై విచారణ చేపట్టనున్న న్యాయస్థానం
Arun Charagondaటెలీవిజన్ బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 11 కన్నడ విజయవంతంగా మూడో వారంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కన్నడ బిగ్ బాస్‌కు కిచ్చా సుదీప్ హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా ఇప్పుడు ఈ షో నిర్వాహకులకు నోటీసులు జారీ అయ్యాయి. మహిళ కంటెస్టెంట్ల గోప్యతకు భంగం వాటిల్లిందని మహిళా కమిషన్‌కు ఫిర్యాదు అందింది.
Annie Master On Jani Master: జానీ మాస్టర్‌తో కలిసి పనిచేశా, ఒకవేళ బాధితురాలికి అన్యాయం జరిగితే ఆమెకు అండగా నిలబడతానన్న అనీ మాస్టర్...వైరల్ వీడియో
Arun Charagondaజానీ మాస్టర్ తో కలిసి పనిచేశాను.. కానీ ఆయన అలా చేశారంటే నమ్మలేకపోతున్నా అన్నారు కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్. జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో షాక్ అయ్యానని చెప్పారు. మాస్టర్ నాతో ఎప్పుడూ తప్పుగా వ్యవహరించలేదు అని...ఒకవేళ బాధితురాలికి నిజంగానే అన్యాయం జరిగితే మాత్రం ఆమెకు మద్దతుగా నిలబడతాను అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
Salman Khan Gets Fresh Threat: ‘ఈ బెదిరింపులను తేలికగా తీసుకోవద్దు. ప్రాణాలతో ఉండాలంటే 5 కోట్లు ఇవ్వండి’.. సల్మాన్ ఖాన్ కు తాజాగా బెదిరింపులు
Rudraబాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఫ్రాణాలతో ఉండాలన్నా, బిష్ణోయ్ గ్యాంగ్ తో ఉన్న శత్రుత్వానికి ముగింపు పలకాలన్నా తమకు వెంటనే రూ.5 కోట్లు ఇవ్వాలంటూ దుండగులు హెచ్చరికలు జారీ చేశారు.
Pottel Movie Promotion in Plane: విమానంలో ‘పొట్టేల్’ మూవీ ప్రమోషన్.. పాల్గొన్న నటి అనన్య నాగళ్ల (వైరల్ వీడియో)
Rudraయువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ చేస్తున్న చిత్రం ‘పొట్టేల్’. సాహిత్ మోత్ఖూరి దర్శకుడు. నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగె నిర్మాతలు.
Tamannaah Questioned By ED: ఈడీ విచారణకు తమన్నా.. మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ గురించే ఈ విచారణ. అసలేంటీ విషయం??
Rudraమహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ కు సంబంధించిన కేసులో ప్రముఖ హీరోయిన్ తమన్నాను ఈడీ గురువారం విచారించింది. గువహటీలోని ఈడీ ఆఫీసుకు తమన్నా తన తల్లితో కలిసి హాజరు అయ్యారు.
Chennai Rains: రజనీకాంత్ ఇల్లు వరద నీటిలో ఎలా మునిగిపోయిందో వీడియో ఇదిగో, చెన్నై నగరాన్ని ముంచెత్తిన భారీ వరదలు
Vikas Mచెన్నైలో కురిసిన భారీ వర్షాలకు పోయెస్ గార్డెన్‌లోని రజనీకాంత్ విలాసవంతమైన విల్లా నీటిలో ముగినింది.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ఆయన ఇంట్లోకి నీరు చేరింది. ప్రస్తుతం వరదలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
UP Fan Meet Allu Arjun: వీడియో ఇదిగో, అల్లు అర్జున్ కోసం యూపీ నుంచి 1500 కిలోమీటర్లు సైకిల్ మీద వచ్చిన అభిమాని, ఎమోషనల్ అయిన ఐకాన్ స్టార్
Hazarath Reddyయూపీలోని అలీగఢ్‌కు చెందిన ఓ అభిమాని ఏకంగా 1600 కిలోమీటర్లకు పైగా సైకిల్‌పై హైదరాబాద్‌కు వచ్చాడు. అల్లు అర్జున్‌ను కలిసేందుకు సైకిల్‌పై వచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు. దీంతో అతని అభిమానానికి ఫిదా అయిన అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యాడు. అతన్ని అప్యాయంగా పలకరించి వివరాలు ఆరా తీశాడు.
Akhanda-2 Announced: నందమూరి బాలకృష్ణ తొలి పాన్ ఇండియా మూవీ, హ్యాట్రిక్ హిట్ కాంబినేషన్ లో అఖండ-2 రాబోతుంది, ఇదుగో పోస్టర్
VNSబాలకృష్ణ కెరీర్‌లో 'అఖండ' (Akhanda) ఓ టర్నింగ్ పాయింట్. లాక్‌డౌన్ టైంలో అసలు సీజన్ కాని డిసెంబరులో రిలీజైన ఈ సినిమా.. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. అప్పట్లోనే ఈ మూవీ సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. ఇప్పుడు ఆ మాట ప్రకారం అధికారికంగా అనౌన్స్ చేశారు. 'అఖండ 2' (Akhanda-2) అనే టైటిల్‌కి తాండవం అనే ట్యాగ్ లైన్ జోడించారు.
Junior NTR Thanks Fans: దేవర్ పార్ట్ 1 చిత్రాన్ని మీ భుజాలపై మోసి ఘన విజయాన్ని అందించినందుకు ధన్యవాదాలు, ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ ఇదిగో..
Vikas M‘దేవర’ పార్ట్-1కు దక్కిన ఆదరణపై జూనియర్ ఎన్టీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. చిత్ర బృందం, ప్రేక్షకులు, అభిమానులకు సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ సందేశం ఇచ్చారు. దేవర్ పార్ట్-1కి అందుతున్న అద్భుతమైన స్పందనకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సినిమా ఎప్పిటకీ నా హృదయంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది.
Disco Shanti on Silk Smitha: సిల్క్ స్మిత చాలా మంచిది, ఆ నిర్ణయం ఎందుకు తీసుకుందో ఇప్పటికీ అర్థం కావడం లేదు, డిస్కో శాంతి కీలక వ్యాఖ్యలు
Vikas Mఅలనాటి శృంగార తార సిల్క్ స్మిత గురించి డిస్కో శాంతి ఐ డ్రీమ్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు. "స్మితను నేను అక్కా అని పిలిచేదానిని. తను చాలా మంచిది .. చాలా కలుపుగోలుగా మాట్లాడుతుంది. అలాంటి ఆమె ఎందుకు ఆ నిర్ణయం తీసుకుందనేది నాకు అర్థం కాలేదు.
Pushpa-2 First Half Report: పుష్ప-2 ఫస్ట్ హాఫ్ మైండ్ బ్లోయింగ్ అంటూ దేవిశ్రీప్రసాద్ కామెంట్స్ వైరల్, వీడియో ఇదిగో...
Vikas Mఅల్లు అర్జున్, సుకుమార్ క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం పుష్ప-2 దిరూల్. పుష్ప ది రైజ్‌కు సీక్వెల్ ఇది. మైత్రీ మూవీ మేకర్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, రెండు పాటలకు అనూహ్య స్పందన వచ్చింది. డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి.
Jani Master Sexual Assault Case: జానీ మాస్టర్‌కు ఎదురుదెబ్బ, బెయిల్ పిటిషన్ కొట్టివేసిన రంగారెడ్డి కోర్టు
Vikas Mలైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌ను మేజిస్ట్రేట్ కొట్టివేయడంతో కోర్టులో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. కొన్ని వాయిదాల తర్వాత జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌ను రంగారెడ్డి జిల్లా కోర్టు విచారించింది. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు దానిని కొట్టివేసింది.