తాజా వార్తలు

Zero Salary, No Weekend Offs: జీతం ఇయ్యం.. సెలవులు ఉండవు. ఆదివారం కూడా పనిచెయ్యాలే.. ఇంటర్నెట్ ను కుదిపేస్తున్న గుజరాత్ కంపెనీ జాబ్ ఆఫర్

Rudra

ఆర్ధిక మాంద్యం భయాలు ఉన్నాయి. వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇది నిజమే. అయితే, జీతం ఇయ్యం, సెలవులు ఉండవు. ఆదివారం కూడా ఆఫీసుకు రావాల్సిందే అని కండిషన్స్ పెడితే, ఎవరు ఆ కొలువులో చేరుతారు? అయినా, ఇలా ఏ కంపెనీ అయినా ఇలా ప్రకటన ఇస్తుందా? అనుకుంటున్నారా? నిజమండీ..

Vinesh Phogat Retires: ‘నాపై రెజ్లింగ్‌ గెలిచింది.. నేను ఓడిపోయా..’ కుస్తీకి వినేశ్‌ ఫోగాట్‌ గుడ్‌ బై.. సిల్వర్ మెడల్ పై తీర్పు రాకముందే సంచలన నిర్ణయం తీసుకున్న భారత స్టార్‌ రెజ్లర్‌

Rudra

భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగాట్‌ రెజ్లింగ్‌ కు రిటైర్‌మెంట్‌ ప్రకటించారు. ‘కుస్తీ నాపై గెలిచింది.. నేను ఓడిపోయా’ అంటూ భావోద్వేగంతో ఆమె ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.

Caught On Camera: వీడియో ఇదిగో, పోలీస్ స్టేషన్‌లో పోలీసుల ముందే మహిళను దారుణంగా కొట్టిన బీజేపీ నేత

Vikas M

బుల్దానా జిల్లాలోని మల్కాపూర్ వద్ద శివ టైడే అనే బీజేపీ నేత ఒక రౌడీతో కలిసి ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే మహిళ మీద విచక్షణారహితంగా దాడి చేశాడు. బుల్దానాలో జరిగిన ఒక షాకింగ్ సంఘటనలో, స్థానిక బిజెపి నాయకుడు అతన్ని అడ్డుకోవడానికి పోలీసులు జోక్యం చేసుకునే వరకు నగర పోలీసు స్టేషన్‌లో ఒక మహిళను కొట్టారు

Olympic Games Paris 2024: ఒలింపిక్స్ పతకాల పట్టికలో చైనాను వెనక్కి నెట్టేసిన అమెరికా, 63 స్థానంలో భారత్, పారిస్ 2024 ఒలింపిక్స్ మెడల్ టాలీ ఇదిగో..

Vikas M

బుధవారం నాటి పారిస్ ఒలింపిక్స్ పతకాల పట్టికలో అమెరికా 25 స్వర్ణాలను సాధించి చైనాను అధిగమించి అగ్రస్థానంలో ఉంది. 2024 పారిస్ గేమ్స్‌లో 12వ రోజు కంటే ముందు చైనా 23 బంగారు పతకాలతో రెండవ స్థానంలో ఉంది.

Advertisement

Vinesh Phogat Disqualification: ఎవరైనా రూల్స్‌ను గౌరవించాల్సిందే, వినేశ్‌ కోసం రూల్స్‌ మార్చలేమని తెలిపిన యూడబ్ల్యూడబ్ల్యూ అధ్యక్షుడు లలోవిక్‌

Vikas M

పారిస్‌ ఒలింపిక్స్‌ మహిళల 50 కేజీల ఫ్రీస్టయిల్‌ రెజ్లింగ్‌ పోటీల్లో భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌ అనర్హత వేటుకు గురైన విషయం తెలిసిందే. వినేశ్‌ అనర్హత నేపథ్యంలో యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (UWW) అధ్యక్షుడు నెనాద్ లాలోవిక్ స్పందించాడు. 100 గ్రాముల అధిక బరువు ఉన్న కారణంగా వినేశ్‌పై అనర్హత వేటు పడటం బాధాకరమని అన్నాడు. వినేశ్‌ రాత్రికిరాత్రి బరువు పెరిగిందని తెలిపాడు.

Tesla Cars: రిమోట్ సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ కోసం 16.80 లక్షల టెస్లా కార్లు రీకాల్‌, ఉచితంగా మరమ్మతులు చేస్తామని ప్రకటన

Vikas M

టెస్లా రిమోట్ సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ కోసం చైనాలో 1.68 మిలియన్ కార్లను రీకాల్ చేస్తోందని చైనా మార్కెట్ రెగ్యులేటర్ తెలిపింది. ట్రంక్ లాచెస్ లోపభూయిష్టంగా ఉన్న వాహనాలను ఉచితంగా మరమ్మతులు చేస్తామని మంగళవారం ఆలస్యంగా ప్రకటనలో తెలిపారు.

Mahesh Babu on Vinesh Phogat Disqualification: మీ స్ఫూర్తి మాలో ప్రతి ఒక్కరిలో ప్రకాశిస్తుంది, వినేశ్ ఫొగాట్‌కు ధైర్యం చెప్పిన మహేశ్ బాబు

Vikas M

మహేశ్ బాబు కూడా వినేశ్‌కు అండగా నిలబడ్డాడు. ఆమె నిజమైన ఛాంపియన్ అంటూ కొనియాడాడు. ఈ రోజు ఫలితంతో సంబంధం లేదు. మీరు నిర్ణయాన్ని ఎలా ఎదుర్కొన్నారో అది మీ గొప్పతనం. వినేశ్ ఫోగాట్‌.. మీరు నిజమైన ఛాంపియన్ అని అందరికీ చూపించారు. కష్ట సమయాల్లో అండగా నిలవడానికి మీ దృఢత్వం, బలం అందరికి స్ఫూర్తి.

Independence Day Speech In Telugu: స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం ఇదిగో, ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విద్యార్థుల కోసం స్వాతంత్య్ర దినోత్సవ స్పీచ్

Vikas M

ప్రస్తుతం, దేశంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవం కోసం సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా పాఠశాలలు, ఇతర విద్యాసంస్థల్లో స్వాతంత్ర్య దినోత్సవ సాంస్కృతిక కార్యక్రమాలు ఒక వారం ముందుగానే ప్రారంభమవుతాయి. ఈ కార్యక్రమాల్లో విద్యార్థులు సాంస్కృతిక నృత్యాలు, పాటలు, నాటికలు మొదలైన వాటిని ప్రదర్శిస్తారు.

Advertisement

New Delhi: స్నేహితురాలికి ఐఫోన్ కొనిచ్చేందుకు సొంతింటికే క‌న్నం వేసిన 9వ త‌ర‌గ‌తి బాలుడు, పోలీసుల విచార‌ణ‌లో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి...

VNS

స్నేహితురాలి పుట్టిన రోజు సందర్భంగా ఐఫోన్‌ (I phone) గిఫ్ట్‌గా ఇచ్చేందుకు ఒక బాలుడు ఏకంగా తన ఇంటికి కన్నం వేశాడు. 9వ తరగతి చదువుతున్న ఆ బాలుడు తల్లి బంగారాన్ని దొంగిలించాడు. (Boy Steals Mother’s Gold To Gift iPhone To Girl ) స్వర్ణకారులకు విక్రయించిన డబ్బుతో ఐఫోన్‌ కొన్నాడు. తల్లి ఫిర్యాదుతో దర్యాప్తు జరిపిన పోలీసులు చివరకు నిందితుడైన ఆ బాలుడ్ని అరెస్ట్‌ చేశారు.

Tata Curvv EV: టాటా నుంచి మార్కెట్లోకి మ‌రో ఈవీ వెహికిల్, ఒక్క‌సారి చార్జ్ చేస్తే ఏకంగా 425 కి.మీ రేంజ్, జ‌స్ట్ 15 నిమిషాలు చార్జ్ చేస్తే చాలు..

VNS

ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న టాటా కర్వ్‌ (Tata Curvv) ఎలక్ట్రిక్‌ కారును టాటా మోటార్స్ లాంచ్‌ చేసింది. ఎలక్ట్రిక్ (EV)తో పాటు పెట్రోల్‌, డీజిల్‌తో నడిచే ఐసీఈ వెర్షన్‌ను కూడా అధికారికంగా విడుదల చేసింది. టాటా కర్వ్‌ ఈవీలో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి.

Sri Lanka Win By 110 Runs: కీల‌క మ్యాచ్ లో చేతులెత్తేసిన టీమిండియా, మూడో వ‌న్డేలో భారీ తేడాతో శ్రీ‌లంక విజ‌యం, 2-0 తేడాతో సిరీస్ లంక కైవ‌సం

VNS

టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక‌కు ఓపెన‌ర్లు అవిష్క ఫెర్నాండో, పాతుమ్ నిస్సాంక అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. మొద‌టి వికెట్‌కు 89 ప‌రుగులు జోడించారు. హాఫ్ సెంచ‌రీకి ఐదు ప‌రుగుల దూరంలో అక్ష‌ర్ ప‌టేల్ బౌలింగ్‌లో పంత్ క్యాచ్ అందుకోవ‌డంతో నిస్సాంక ఔట్ అయ్యాడు.

Andhra Pradesh: వీడియో ఇదిగో, పోలీసులు డబ్బుతో పాటు ఫోన్ లాక్కున్నారంటూ ట్రాన్స్ ఫార్మర్ ఎక్కి ఓ వ్యక్తి హల్ చల్

Hazarath Reddy

తన ఫోన్ పోలీసులు తీసుకున్నారని ట్రాన్స్ ఫార్మర్ ఎక్కిన వ్యక్తి హల్ చల్ చేశాడు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద మావుళ్ళు అనే వ్యక్తి ట్రాన్స్ ఫార్మర్ ఎక్కి స్థానికులను భయభ్రాంతలకు గురి చేశాడు. తన సెల్ ఫోన్, డబ్బులు పోలీసులు తీసుకున్నారంటూ అవి ఇస్తేగాని దిగనంలూ మావుళ్ళు డిమాండ్ చేశారు. పోలీసులు అతన్ని బతిమాలి క్రిందకు దించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

Mr Bachchan Trailer: మ‌ళ్లీ రిపీట్ అవుతున్న మిర‌ప‌కాయ్ కాంబినేష‌న్, ఆగ‌స్ట్ 15న ర‌చ్చ లేప‌నున్న మిస్ట‌ర్ బ‌చ్చ‌న్

VNS

పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను ఇండిపెండెన్స్ కానుకగా ఆగ‌ష్టు 15న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

Andhra Pradesh Horror: ఏపీలో ఆగని హత్యలు, చీరాలలో నడిరోడ్డుపై యువకుడిని కత్తితో దారుణంగా పొడిచి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు, వీడియోలు ఇవిగో..

Hazarath Reddy

కారులో వచ్చిన గుర్తు తెలియని కొందరు యువకులు బైకును అడ్డుకొని వాగ్వాదానికి దిగారు. వెంటనే కత్తితో దాడి చేయగా రోడ్డుపై రక్తపు గాయలతో పడివున్న ఆరిఫ్ ను చీరాల ప్రభుత్వ వైద్యాశాలకు తరలించారు. అప్పటికే యువకుడు మృతిచెందారు.

Road Accident in Tirumala: వీడియో ఇదిగో, తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం, నుజ్జునుజ్జు అయిన ఇద్దరి మృతదేహాలు

Hazarath Reddy

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఘాట్ చివరి రోడ్డుపై చివరి మలుపు వద్ద ద్విచక్క వాహనం అదుపుతప్పడంతో దానిపై వెళుతున్న ఇద్దరు కిందపడ్డారు. కిందపడ్డ వారిపై నుంచి వెనకనుంచి వస్తున్న బస్సు వెళ్లడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదం కారణంగా ఘాట్ రోడ్డులో భారీగా ట్రాపిక్ జాం అయింది. ఈ ప్రమాదంలో మృతదేహాలు నుజ్జునుజ్జు అయ్యాయి.

Pendem Dorababu Resigns YSRCP: వైసీపీకి షాకిచ్చిన ఇద్దరు నేతలు, పిఠాపురంలో పెండెం దొరబాబు రాజీనామా, అనంతపురంలో పైలా నర్సింహయ్య గుడ్ బై

Hazarath Reddy

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రాజకీయ స్వలాభం కోసం కాదని, పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. ఇక అనంతపురం జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నర్సింహయ్య తన పదవికి రాజీనామా చేశారు.

Advertisement

Jagan Disproportionate Assets Case: జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ నవంబర్‌ 11కు వాయిదా, రఘురామపై సుప్రీంకోర్టు సీరియస్‌, సీబీఐపై అసహనం

Hazarath Reddy

మాజీ సీఎం వైఎస్ జగన్‌ (YS Jagan) అక్రమాస్తుల కేసు విచారణ నవంబర్‌ 11కు వాయిదా (Adjourn) పడింది. జగన్‌ అక్రమాస్తుల ( Illegal assets ) కేసులపై గతంలో ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టులో జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా (Justice Sanjeev Khanna ) నేతృత్వంలో విచారణ జరిగింది.

YS Jagan's Security Row: దేవాన్స్‌కు ఆరుమంది సెక్యూరిటీని పెట్టారు, మరి జగన్‌కు భద్రత వద్దని ఎందుకంటున్నారు ? ఏదైనా జరిగితే కూటమి ప్రభుత్వానిదే బాధ్యత అని మండిపడిన అంబటి రాంబాబు

Hazarath Reddy

హైదరాబాద్‌లో చంద్రబాబు ఇంటి ముందు ఇప్పటికీ ప్రవేశం లేదని ఆయన గుర్తుచేశారు. కానీ వైఎస్‌ జగన్‌ ఇంటి ముందు రోడ్డును తెరిచి జనాలను పంపిస్తున్నారని అన్నారు. చంద్రబాబు మనుమడు దేవాన్ష్‌కు కూడా ఆరుగురు సెక్యూరిటీని ఎలా పెట్టారని ప్రశ్నించారు. దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

GVMC Standing Committee Elections: గ్రేట‌ర్ విశాఖలో వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్, స్టాండింగ్ క‌మిటీ ఎన్నిక‌ల్లో కూట‌మి ఘ‌న విజ‌యం

VNS

విశాఖపట్నం జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ (GVMC Standing Committee Elections) ఎన్నికల్లో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఈ ఎన్నికల్లో కూటమి (NDA) ఘన విజయం సాధించింది. 10కి 10 స్థానాలను కూటమి కైవసం చేసుకుంది. కూటమి అభ్యర్థులే గెలుపొందారు. కూటమి కార్పొరేటర్లు 60 ఓట్లు సాధించారు.

Telangana Politics: బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు, తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వారిపై కోర్టులో దావా వేస్తామని వెల్లడి

Hazarath Reddy

బీజేపీలో బీఆర్ఎస్ విలీనం లేదు. తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చ‌రించారు. ఈ మేర‌కు కేటీఆర్ ఎక్స్ వేదిక‌గా ట్వీట్ చేశారు.

Advertisement
Advertisement