తాజా వార్తలు

Bihar Shocker: వీడియో ఇదిగో, స్కూల్‌ బ్యాగ్‌లో గన్‌ తీసుకువచ్చి 3వ తరగతి విద్యార్థిని కాల్చిన ఐదేళ్ల బాలుడు

Hazarath Reddy

బీహార్‌లోని సుపాల్ జిల్లాలో ఐదేళ్ల బాలుడు స్కూల్‌ బ్యాగ్‌లో గన్‌ తీసుకువచ్చాడు.రాగానే మూడవ తరగతి విద్యార్థిపై కాల్పులు (Boy Shoots Student In School) జరిపాడు. దీంతో ఆ స్టూడెంట్‌ గాయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్‌ వద్దకు చేరుకున్నారు

Bombay High Court: భార్య చేసే పనిని అత్తమామలకు వాట్సాప్ వీడియో కాల్‌లో భర్త చూపించడం శాడిస్ట్ పద్ధతి, బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

ఓ మహిళ ఇంటిని శుభ్రం చేయమని కోరడం,ఆ పని చేస్తూ అత్తమామలకు వాట్సాప్ వీడియో కాల్‌లో చూపించడం శాడిస్ట్ పద్ధతి అని బాంబే హైకోర్టు ఇటీవల వ్యాఖ్యానించింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిపై సెక్షన్ 498-ఎ కింద దాఖలు చేసిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్)ను కొట్టివేయడానికి నిరాకరిస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

Tamil Nadu Shocker: తమిళనాడులో తీవ్ర విషాదం, జావెలిన్ త్రోయర్ విసిరిన స్టిక్ తలకు గుచ్చుకుని విద్యార్థి మృతి, పాఠశాల నుండి ఇంటికి వెళుతుండగా ఘటన

Hazarath Reddy

తమిళనాడులో జరిగిన దురదృష్టకర ఘటనలో 15 ఏళ్ల బాలుడు తలకు జావెలిన్ స్టిక్ తగిలి మృతి చెందిన విషయం తెలిసిందే. గత వారం కడలూరు జిల్లాలో స్పోర్ట్స్ ప్రాక్టీస్ సెషన్‌లో 10వ తరగతి విద్యార్థి తలకు జావెలిన్ త్రో స్టిక్ తగిలిన సంఘటన జరిగింది. టి కిషోర్‌గా గుర్తించిన మృతుడు జూలై 30 మంగళవారం తుది శ్వాస విడిచాడు.

Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో పీవీ సింధు జైత్రయాత్ర, ప్రీ క్వార్టర్స్‌ లోకి దూసుకెళ్లిన సింధు

Arun Charagonda

పారిస్ ఒలింపిక్స్ 2024లో పీవీ సింధు జైత్ర యాత్ర కొనసాగుతోంది. తాజాగా ఇవాళ జరిగిన మ్యాచ్‌లో క్రిస్టిన్ కూబా వరల్డ్ ర్యాంక్ 73ను ఓడించింది సింధు. కూబాబపై 21-5, 21-10 స్కోరుతో రెండ‌వ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో విజ‌యం సాధించింది. ఈ విజయంతో ప్రీ క్వార్ట‌ర్స్‌లో ప్రవేశించగా ఈ మ్యాచ్‌లో ఆర‌వ సీడ్ హీ బిన్‌జావో తో త‌ల‌ప‌డ‌నుంది సింధు.

Advertisement

Health Tips: కేవలం 5 నిమిషాలు ఇలా వాకింగ్ చేయండి, బరువు తగ్గడం పక్కా, షాకింగ్ రిజల్ట్స్!

Arun Charagonda

మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు, ఉద్యోగంలో ఒత్తిడి, ఎక్కువ సేపు కూర్చోవడం కారణం ఏదైనా వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గరి నుండి పెద్దల వరకు బరువు పెరిగిపోతూనే ఉన్నారు. ఫలితంగా అనారోగ్యం బారిన పడుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ముఖ్యంగా కరోనా తర్వాత ఈ పరిస్థితి మరి ఎక్కువగా మారింది.

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసు, అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కె కవిత జ్యుడీషియల్ కస్టడీ ఆగస్టు 13 వరకు పొడిగింపు

Hazarath Reddy

లిక్కర్‌ స్కాం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రిమాండ్‌ పొడిగించింది ట్రయల్‌ కోర్టు. రిమాండ్‌ గడువు ముగియడంతో ఇవాళ(బుధవారం) ఆమెను వర్చువల్‌గా ట్రయల్‌ కోర్టు(రౌస్‌ అవెన్యూ కోర్టు) ముందు తీహార్‌ జైలు అధికారులు హాజరుపరిచారు. దీంతో ఆగష్టు 13దాకా జ్యూడీషియల్‌ రిమాండ్‌ను పొడిగించింది ట్రయల్‌ కోర్టు.

Telangana Shocker: తెలంగాణలో ఒక్కరోజే నాలుగు అత్యాచారాలు, సిగ్గుతో తలదించుకోవాలన్న హరీష్ రావు, పోలీసుల స్పందన ఇదే

Arun Charagonda

తెలంగాణలో ఒక్కరోజే నాలుగు చోట్ల అత్యాచారాలు జరిగాయి. దీనిపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేశారు. వనస్థలీపురం పిఎస్ పరిధిలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పై సామూహిక అత్యాచారం,ఓయూపిఎస్ పరిధిలో ప్రయాణీకురాలిపై ఆర్టీసీ బస్సు డ్రైవర్ అఘాయిత్యం,నల్లగొండ జిల్లా శాలిగౌరారం లో దివ్యాంగ మహిళపై అత్యాచారం,నిర్మల్ నుండి ప్రకాశం వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో మహిళపై అత్యాచారం చేసిన డ్రైవర్. ఇలా ఒకే రోజు నాలుగు చోట్ల అత్యాచార సంఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమన్నారు.

Andhra Pradesh: రూ.1.30 లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌, ఆన్‌లైన్‌లో తీర్మానాన్ని ఆమోదించిన రాష్ట్ర మంత్రి మండలి

Hazarath Reddy

చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం (Andhra Pradesh government) రాబోయే నాలుగు నెలలకు రూ.1.30 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌కు ఆర్డినెన్సు జారీ చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర మంత్రిమండలి మంగళవారం ఆన్‌లైన్‌లో తీర్మానాన్ని ఆమోదించింది

Advertisement

Train Accident Video: కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ ప్రమాదం జరిగిన చోటే పట్టాలు తప్పిన మరో రైలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఈరోజు, జూలై 31, పశ్చిమ బెంగాల్‌లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నివేదికల ప్రకారం, డార్జిలింగ్ జిల్లాలోని రంగపాణి వద్ద గూడ్స్ రైలు రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి. గత నెలలో కాంచన జంగా రైలు పట్టాలు తప్పిన ప్రదేశంలోనే ఈ రైలు పట్టాలు తప్పింది.

Astrology: ఆగస్టు 16నుంచి సూర్యుడు ,శని గ్రహం ఒకే రాశిలోకి ప్రవేశం... ఈఐదు రాశుల వారికి ప్రయోజనం..

sajaya

ఆగస్టు 16నుంచి సూర్యుడు ,శని గ్రహం ఒకే రాశిలోకి ప్రవేశం.ఇది మొత్తం 12 రాశుల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది ముఖ్యంగా ఈ ఐదు రాశుల వారికి ప్రయోజనం చేకూర్చే విధంగా ఉంటుంది.

HC on Divorce: భార్యాభర్తల విడాకుల కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు, వివాహేతర సంబంధం గురించి కోర్టు విచారించాల్సిన అవసరం లేదని వెల్లడి

Hazarath Reddy

విడాకుల పిటిషన్‌పై నిర్ణయం తీసుకునేటప్పుడు వివాహేతర సంబంధం గురించి కోర్టు విచారించాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. భార్యాభర్తల మధ్య విడాకుల పిటిషన్‌లో ఆర్డర్ ఇచ్చే ముందు వివాహేతర సంబంధంపై విచారణ జరపాల్సిన అవసరం లేదని ధర్మాసనం ఇటీవల విడాకుల కేసులో పేర్కొంది.

Health Tips: క్యారెట్ జ్యూస్ వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.

sajaya

క్యారెట్ ప్రతిరోజు తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్యపరమైన అనేక లాభాలు ఉంటాయి. క్యారెట్ లో విటమిన్ ఏ, విటమిన్ బి, ఐరన్, పొటాషియం, ఫైబర్, జింక్ కంటెంట్లు అధికంగా ఉంటాయి. ప్రతిరోజు క్యారెట్ తీసుకోవడం వల్ల మనకు అనేక లాభాలు ఉంటాయి .

Advertisement

Health Tips: షుగర్ పేషెంట్స్ లకు అద్భుతవరం మెంతులు. ఇవి షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచుతాయి

sajaya

ఈరోజుల్లో చాలామంది మధుమేహం సమస్యతో బాధపడుతున్నారు. ఒకప్పుడు కేవలం 40 దాటిన వారికి మాత్రమే మధుమేహం వచ్చేది. ఇప్పుడు చిన్న ఏజ్ లోనే చాలామంది మధుమేహ బారిన పడుతున్నారు

Health Tips: ఆపిల్ సైడర్ వెనిగర్ అతిగా వాడుతున్నారా..దానివల్ల కలిగే నష్టాలు ఏంటో తెలుసుకుందాం.

sajaya

ఈరోజుల్లో చాలామంది ఆపిల్ సైడర్ వెనిగర్ ను వాడుతున్నారు. శరీరంలో కొవ్వు ని తగ్గించడానికి పంపించడానికి ఉపయోగపడుతుందని దీన్ని ఎక్కువమంది యూస్ చేస్తుంటారు. అయితే దీన్ని అతిగా యూస్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Road Accident Video: జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద అర్థరాత్రి కారు బీభత్సం వీడియో ఇదిగో, మద్యం మత్తులో బీటెక్ స్టూడెంట్ ర్యాష్ డ్రైవింగ్, ఇద్దరికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద అర్థరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో బీటెక్ విద్యార్థి తన మిత్రుడితో కలిసి కారును డ్రైవింగ్ చేశాడు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు నుంచి కృష్ణానగర్ వైపునకు వెళ్లే మార్గంలో కారు అదుపు తప్పింది.

Sugali Preeti Case: ఏపీలో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మళ్లీ తెరపైకి, న్యాయం చేయాలంటూ పవన్‌కు సుగాలి ప్రీతి తల్లి ఫిర్యాదు, ఈ కేసులో మొదటి నుంచి ఏం జరిగిందంటే..

Hazarath Reddy

తమ బిడ్డకు జరిగిన అన్యాయం (Sugali Preeti Rape & Murder Case) మరే ఆడ బిడ్డకు జరగకుండా చూడాలని ఆమె (Sugali Preeti's Mother Parvati ) కోరారు. సీబీఐ దర్యాప్తు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన రాలేదన్నారు.

Advertisement

Telangana: బీఆర్ఎస్ గూటికి మరో నలుగురు ఎమ్మెల్యేలు?, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటేనా?,కాంగ్రెస్ నెక్ట్స్ స్టెప్ ఏంటీ?

Arun Charagonda

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్‌లో బీఆర్ఎస్‌ఎల్పీ విలీనం ఉంటుందని అంతా భావించారు. అయితే అనూహ్యంగా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు తమ మనసు మార్చుకుంటున్నారు.

Health Tips: మన ఆరోగ్యాన్ని పాడుచేసే 6 చెడ్డ అలవాట్లు.

sajaya

ఈరోజుల్లో చాలామంది ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. దానికి కారణం మన జీవనశైలిలో మార్పు దానివల్ల చిన్న ఏజ్ లోనే రకరకాల అయినటువంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు

Preeti Sudan: యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్ చైర్‌ప‌ర్స‌న్‌గా ప్రీతి సుద‌న్‌, ఐఏఎస్ ఆఫీస‌ర్ బయోడేటా ఇదిగో..

Hazarath Reddy

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్ చైర్‌ప‌ర్స‌న్‌గా కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్య‌ద‌ర్శి ప్రీతి సుద‌న్‌ నియమితులయ్యారు. ఆగ‌స్టు ఒక‌టో తేదీన‌, రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 316ఏ ప్ర‌కారం ఆమె బాధ్య‌త‌లు స్వీక‌రించనున్నారు. ప్ర‌స్తుతం యూపీఎస్సీ క‌మీష‌న్‌లో ఆమె స‌భ్యురాలిగా ఉన్నారు.

Veena George Car Accident: వయనాడ్ వెళ్తుండగా కేరళ ఆరోగ్య మంత్రి కారుకు ప్రమాదం, తృటిలో ప్రాణాల నుంచి బయటపడిన వీణా జార్జ్‌

Hazarath Reddy

కేరళ ఆరోగ్య మంత్రి (Kerala Health Minister) వీణా జార్జ్‌ (Veena George)తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. వయనాడ్‌కు వెళ్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి (road accident) గురైంది. ఈ ఘటనలో మంత్రి గాయాలతో బయటపడ్డారు.

Advertisement
Advertisement