India

Cyclone Dana Update: ఊపిరి పీల్చుకున్నట్లే ఇక, ఎట్టకేలకు తీరం దాటిన ‘దానా’ తుపాను, ఒడిషాలో కొనసాగుతున్న భారీ వర్షాలు, స్కూళ్లకు సెలవులు

Hazarath Reddy

వాయువ్వ బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తీవ్ర తుఫాను (Cyclone Dana) తీరందాటింది. గురువారం అర్ధరాత్రి 1.30 నుంచి 3.30 గంటల మధ్య ఒడిశాలోని భితార్కానికా, ధమ్రా ప్రాంతాల మధ్య తీరం దాటి తుపాన్‌ ప్రస్తుతం బలహీనపడనుంది.

Sudden Death in Rewa: స్నేహితులతో మాట్లాడుతూనే గుండెపోటుతో కుప్పకూలిన యువకుడు, షాకింగ్ వీడియో ఇదిగో..

Hazarath Reddy

మధ్యప్రదేశ్‌లో ఒక దురదృష్టకర సంఘటనలో, ఒక వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలి మరణించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రేవాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా ఆన్‌లైన్‌లో వెలుగులోకి వచ్చింది.

Telangana Constable Wifes Protest: సచివాలయం ముట్టడికి కానిస్టేబుళ్ల భార్యల ప్రయత్నం, అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలింపు...వీడియో ఇదిగో

Arun Charagonda

తెలంగాణ సెక్రటేరియట్ ముట్టడికి వచ్చారు బెటాలియన్ కానిస్టేబుల్ భార్యలు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మా కుటుంబ సభ్యుల బాధలను అర్థం చేసుకోవాలని...ఒకే దగ్గర డ్యూటీ ఇస్తే చేసుకుంటారు కానీ ఇక్కడ కొన్ని రోజులు అక్కడ కొన్ని రోజుల డ్యూటీ చేయడం వలన ఇబ్బందులు పడుతున్నారు అన్నారు. ప్రభుత్వం మొండిగా వెళ్లడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు కానిస్టేబుళ్ల భార్యలు.

Bengaluru Shocker: వీడియో ఇదిగో, బస్సులో లంచ్ చేస్తుండగా కండక్టర్ మీద రాయితో దాడి, బస్ పాస్ విషయంలో గతంలో జరిగిన గొడవే కారణం

Hazarath Reddy

బెంగళూరు బస్సు కండక్టర్ సంగప్ప, బీఎంటీసీ బస్సులో భోజనం చేస్తున్న సమయంలో హేమంత్ అనే వ్యక్తి రాళ్లతో దాడి చేశాడు. బస్ పాస్ విషయంలో గతంలో జరిగిన వాగ్వాదం కారణంగా హేమంత్ కండక్టర్‌ను చూసి అతనిపై దాడి చేయడంతో ఈ ఘటన జరిగింది.

Advertisement

Chhattisgarh Hit-and-Run: షాకింగ్ వీడియో ఇదిగో, తల్లి పక్కన ఆడుకుంటున్న చిన్నారి మీద నుంచి దూసుకెళ్లిన కారు, అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

చత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో ఇంటి బయట ఆడుకుంటున్న ఓ పిల్లవాడిని కారు ఢీకొన్న విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదం CCTVలో బంధించబడింది. సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపిస్తోంది, ఇది అక్టోబర్ 12 రాత్రి 11 గంటల సమయంలో జరిగింది.

Defamation Case: కొండా సురేఖకు మొట్టికాయలు వేసిన కోర్టు, కేటీఆర్‌ పై చేసిన కామెంట్స్‌కు సంబంధించిన వీడియోలు తొలగించాలని ఆదేశం

Arun Charagonda

తెలంగాణ మంత్రి కొండా సురేఖకు మొట్టికాయలు వేసింది కోర్టు. కేటీఆర్ పై కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై మండిపడింది. కేటీఆర్ పై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను కొండా సురేఖ తన సామాజిక మాధ్యమాల్లో నుండి వెంటనే తొలగించాలని పేర్కొంది కోర్టు. అన్ని రకాల ప్లాట్‌ఫారమ్‌ల నుండి అన్ని మీడియా సంస్థలు తొలగించాలని ఆదేశించింది కోర్టు.

Telangana: సద్దిబువ్వ వద్దన్నందుకు తండ్రిని చితకబాదిన కొడుకు, కోడళ్లు...జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన తండ్రి

Arun Charagonda

సద్దిబువ్వ వద్దు అన్నందుకు తండ్రిని చితకబాదారు కొడుకు, కోడళ్లు. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధిలోని జల్లాపురం గ్రామానికి చెందిన గుర్రంబండి కృష్ణయ్యకు ఇద్దరు కుమారులు. గుర్రంబండి నడుపుకుంటూ వచ్చిన డబ్బులతో తన ఇంట్లోనే జీవనం చేస్తూ కొడుకుల దగ్గరే ఉంటున్నాడు. సద్ది అన్నం మెత్తగా ఉంది అని చెప్పడంతో కొడుకు, కోడళ్లు చికతబాదారు. దీంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు ఆ తండ్రి.

AP Liquor Shops: మా గ్రామంలో వైన్స్ షాపు వద్దు, మహిళల ఆందోళన...జనావాసాల మధ్య మద్యం అమ్మకాలేంటని నినాదాలు...వీడియో ఇదిగో

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం పాలసీని కూటమి సర్కార్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా వంగర మండలం మద్దివలస గ్రామంలో నూతనం గా మద్యం షాపు ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం దుకాణం వద్ద గ్రామస్తులు ధర్నా చేశారు.

Advertisement

NIA Rs 10 Lakh Reward: లారెన్స్‌ బిష్ణోయ్‌ సోదరుడు అన్మోల్‌ బిష్ణోయ్‌ గురించి చెప్తే రూ.10 లక్షల రివార్డు.. జాతీయ దర్యాప్తు సంస్థ ప్రకటన

Rudra

మహారాష్ట్ర రాజకీయ నేత బాబా సిద్దిఖీ హత్య, బాలీవుడ్ నటుడు సల్మాన్‌ ఖాన్‌ పై బెదిరింపుల ఘటనలతో దేశవ్యాప్తంగా లారెన్స్‌ బిష్ణోయ్ గ్యాంగ్‌ పేరు పెద్దయెత్తున చర్చనీయంశం అయ్యింది.

Nara Lokesh America Tour Details: నేటి నుండి అమెరికాలో మంత్రి నారా లోకేష్ పర్యటన, ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా పారిశ్రామిక వేత్తలతో భేటీ

Arun Charagonda

నేటి నుంచి మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటించనున్నారు. జార్జీయా ఐటీ సర్వ్ సినర్జీ సదస్సులో నారా లోకేష్ పాల్గొని ప్రసంగించనున్నారు. శాన్ ఫ్రాన్సిస్కో లో రేపు ఒరాకిల్ ప్రతినిధులతో పాటు పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటీ ఉన్నారు.

Techie Suicide in Hyderabad: పని ఒత్తిడి తాళలేక, చేసిన అప్పులు తీర్చలేక సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్‌ బలవన్మరణం.. హైదరాబాద్ లో ఘటన

Rudra

పని ఒత్తిడి తాళలేక ఓ సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్‌ ఏడు అంతస్తుల బిల్డింగ్‌ పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌ నగరంలోని కోకాపేటలో ఈ విషాదం చోటుచేసుకున్నది.

TDP MLA Chadalavada Aravinda Babu:ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధైర్యంగా ఉన్నాం కానీ అధికారంలోకి వచ్చాకే భయపడాల్సి వస్తోంది..టీడీపీ నేతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు

Arun Charagonda

టీడీపీ ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతో ధైర్యంగా ఉన్నాం... అధికారంలోకి వచ్చినా అణిగిమణిగి ఉండాల్సి వస్తుందన్నారు. ప్రతి వ్యవస్థలోనూ వైసీపీ ఉద్యోగులే ఉన్నారు... ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం అన్నారు. కార్యకర్తలు, నేతలు డబ్బులు సంపాదించాలనుకుంటున్నారు కానీ అలాంటివి కుదరదని గుర్తుంచుకోవాలన్నారు.

Advertisement

Bomb Threat To Tirupati Hotels: తిరుపతి హోటళ్లకు బాంబు బెదిరింపు, ఉగ్రవాదుల బాంబు బెదిరింపు నేపథ్యంలో పోలీసుల ముమ్మర తనిఖీలు, అనుమానితుల సమాచారం ఇవ్వాలని పోలీసుల ఆదేశాలు

Arun Charagonda

తిరుపతిలో బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపుతోంది.తిరుపతిలో డాగ్ , బాంబ్ స్క్వాడ్ ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఉగ్రవాదుల బాంబు బెదిరింపు నేపథ్యంలో పలు హోటల్స్ లో తనిఖీ చేపట్టగా పలు హోటల్స్ యాజమాన్యాన్ని అప్రమత్తం చేశారు పోలీసులు. అనుమానితులు హోటల్ కు వస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు ఆదేశాలు చేశారు.

AI Chatbot: ఏఐ చాట్‌ బాట్‌ తో ప్రేమలో పడిన మైనర్ బాలుడు.. అనంతరం ఆత్మహత్య.. కోర్టుకెక్కిన తల్లి

Rudra

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం నేటి యువతకు ప్రమాదకరంగా మారింది అనడానికి మరో ఉదాహరణే ఈ ఘటన. ఏఐ చాట్‌ బాట్‌ తో ప్రేమలో పడిన 14 ఏళ్ల ఓ మైనర్ బాలుడు ఆత్మహత్య చేసుకొన్నాడు.

CID 2: యావత్తు దేశాన్ని ఉర్రూతలూగించిన సీఐడీ మళ్లీ బుల్లితెరపైకి.. త్వరలోనే సీఐడీ2

Rudra

అంతుపట్టని క్రైం కేసులను చిటికెలో సాల్వ్ చేస్తూ అందరినీ ఆకట్టుకున్న సీఐడీ టీవీ సీరియల్ యావత్తు దేశాన్ని ఉర్రూతలూగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సీరియల్ మళ్లీ బుల్లితెరపై కనువిందు చేయనున్నది.

Fire Accident in Tupran: మెదక్ జిల్లాలోని తూప్రాన్‌ లో తెల్లవారుజామున కారు షెడ్డులో అగ్నిప్రమాదం.. 8 కార్లు దగ్ధం (వీడియో)

Rudra

మెదక్ జిల్లాలోని తూప్రాన్‌ లో ఈ తెల్లవారుజామున ఓ కారు షెడ్డులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.

Advertisement

Terrorist Attack in JK: జమ్ముకశ్మీర్‌ లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రమూకలు.. ఆర్మీ వాహనంపై దాడి.. అమరులైన ఇద్దరు జవాన్లు.. దాడిలో మరో ఇద్దరు పౌరులు కూడా బలి

Rudra

హిమాలయ ప్రాంతం జమ్ముకశ్మీర్‌ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బారాముల్లాలో గురువారం సాయంత్రం ఒక ఆర్మీ వాహనంపై దాడి జరిపారు.

Justice Sanjiv Khanna As Next Chief Justice Of India: సుప్రీంకోర్టు తదుప‌రి ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నా, నవంబ‌ర్ 11న ప్ర‌మాణ‌స్వీకారం, సంజీవ్ ఖన్నా గురించి పూర్తి వివ‌రాలిగో..

VNS

సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా (Chief Justice Of India) జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా (Justice Sanjiv Khanna) నియమితులయ్యారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ (DY Chandrachood) పదవీ కాలం నవంబర్‌ 10న ముగియనున్న నేపథ్యంలో తదుపరి సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా పేరును సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే.

Supreme Court Comments on Aadhaar Card: ఆధార్ కార్డుపై సుప్రీంకోర్టు కీల‌క ఆదేశాలు, పుట్టిన రోజు ధృవీక‌ర‌ణ కోసం ఆధార్ కార్డ్ ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేమ‌ని తీర్పు

VNS

వయసు నిర్ధరించేందుకు ఆధార్‌ (Aadhaar) ప్రామాణికం కాదని భారత సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) పేర్కొంది. ఇందుకు సంబంధించి పంజాబ్‌-హరియాణా హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది. రోడ్డు ప్రమాద బాధితుడికి పరిహారం చెల్లించే పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు (Supreme Court) ధర్మాసనం.. పాఠశాల రికార్డులో ఉన్న పుట్టిన తేదీనే పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది.

India Women Beat New Zealand Women By 59 Runs in 1st ODI 2024; వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్స్ కు షాక్ ఇచ్చిన ఉమెన్స్ టీం, తొలి వ‌న్డేలో 59 ప‌రుగుల తేడాతో గ్రాండ్ విక్ట‌రీ, 1-0 తేడాతో సిరీస్ లో ముందంజ‌

VNS

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత న్యూజిలాండ్‌కు భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు భారీ షాకిచ్చింది. వ‌ర‌ల్డ్ క‌ప్ చాంపియ‌న్ అయిన సోఫీ డెవినె బృందానికి వారం రోజులు గడువ‌క ముందే టీమిండియా (Team India) తొలి ఓట‌మి రుచి చూపింది. అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోడీ స్టేడియంలో రాధా యాద‌వ్(3/35), సైమా థాకూర్(2/26)లు చెల‌రేగ‌గా భార‌త్ 56 ప‌రుగుల తేడాతో జ‌య‌భేరి మోగించింది.

Advertisement
Advertisement