తెలంగాణ టెన్త్ ఫలితాలు మే 10న విడుదల కానున్నాయి. ఇందుకు విద్యాశాఖ, ఎస్‌ఎస్‌సీ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. కాగా రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 13 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. మొత్తం 7,39,493 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షలు జరిగిన నెలలోనే ఫలితాలను విడుల చేస్తోంది. కాగా నేడు(మంగళవారం) ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. మరోనాడే టెన్త్ ఫలితాలు రిలీజ్ కానుండడం విశేషం.
కాగా ఈ ఏడాది పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీకయ్యాయంటూ రాష్ట్రంలో కలకలం రేగిన విషయం తెలిసిందే. వికారాబాద్ తాండూర్‌లో తెలుగు ప్రశ్నాపత్రం, హన్మకొండ జిల్లాలోని కమలాపూర్‌లో హిందీ పేపర్ లీకైందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా నడిచింది. అంతేగాక హిందీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై వరంగల్ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఇక పరీక్ష పత్రాల లీక్ నేపథ్యంలో పేపర్ల వాల్యూయేషన్‌ను అధికారులు జాగ్రత్తగా నిర్వహించారు.
TS SSC పరీక్ష 2023 క్లియర్ చేయడానికి, విద్యార్థులు ప్రతి సబ్జెక్ట్‌లో కనీసం 35 మార్కులను సాధించాలి. క్లియర్ కాని వారు సప్లిమెంటరీ పరీక్షలకు హాజరవుతారు. మెయిన్ బోర్డ్ ఎగ్జామ్ ఫలితాలు వెలువడిన తర్వాత వాటికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తారు
TS SSC Result 2023 Marksheet కోసం ఇలా చేయండి
Name of the students
Roll number of the student
Name of the district
Name of subjects
Marks obtained in each subject
Subject-wise grades/Grade points/ Cumulative Grade Point Average (CGPA)
Qualifying status – Pass/ Fail