Representational Image (File Photo)

టీఎస్‌ ఎంసెట్‌ బుధవారం నుంచి ప్రారంభం కానుంది.ఇందుకోసం తెలంగాణలో 104, ఏపీలో 33 (మొత్తం 137) పరీక్షా కేంద్రాలు అధికారులు ఏర్పాటు చేశారు. 3.20 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఒక్క హైదరాబాద్‌ నగరం నుంచే అత్యధికంగా 1,71,706 మంది పరీక్షలు రాయనున్నారు. అధికారులు గ్రేటర్‌ పరిధిలో మొత్తం 58 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 10, 11 తేదీల్లో అగ్రికల్చర్‌, 12, 13, 14 తేదీల్లో ఇంజనీరింగ్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతి రోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి.

పరీక్ష హాల్లోకి వెళ్లేముందు అభ్యర్థులు బయోమెట్రిక్‌ వేయాల్సి ఉన్నందున చేతివేళ్లకు గోరింటాకు, మెహిందీ వంటివి పెట్టుకోవద్దు. బ్లూ లేదా బ్లాక్‌ బాల్‌ పెన్‌, హాల్‌ టికెట్‌ మాత్రమే అనుమతిస్తారు. కాలిక్యులేటర్లు, చేతివాచీలు వంటి ఎలకా్ట్రనిక్‌ వస్తువులను అనుమతించరు. ఫొటో ఉన్న ఒరిజినల్‌ గుర్తింపు కార్డు (కాలేజీ ఐడీ, ఆధార్‌, పాన్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్టు.. తదితర) ఒకటి వెంట తీసుకురావాలి.

తెలంగాణ ఇంటర్‌ పరీక్ష ఫలితాలు విడుదల, రిజల్ట్స్‌ను https://tsbie.cgg.gov.in, http://results.cgg.gov.in ద్వారా చెక్ చేసుకోండి

పరీక్షా హాల్లోకి వెళ్లాక ఇన్విజిలేటర్‌ సమక్షంలో హాల్‌ టికెట్‌పై అభ్యర్థి సంత కం (అన్‌లైన్‌ దరఖాస్తులో ఉన్నట్లుగా) చేయాలి. రఫ్‌వర్క్‌ కోసం పరీక్ష హాల్లో ఇచ్చిన పేపర్లను అభ్యర్థులు అక్కడే వదిలి రావాలి. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ కనుక ఏవైనా హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ సమస్యలు ఎదురైతే ఇన్విజిలేటర్ల దృష్టికి తేవాలి. ప్రతి సెంటర్‌లో సిట్టింగ్‌ స్క్వాడ్‌ ఏర్పాటు చేశారు. విద్యార్థులు, ఇన్విజిలేటర్లే కాదు సిట్టింగ్‌ స్క్వాడ్‌ సభ్యుల వద్ద కూడా సెల్‌ఫోన్‌ ఉండడానికి వీల్లేదు. ఎంసెట్‌ రాస్తున్న విద్యార్థులు పరీక్షా కేంద్రానికి నిర్ణీత సమయంలోగా చేరుకోవాలని, ఒక్క నిమిషం లేటైనా అనుమతించేది లేదని కన్వీనర్‌ డీన్‌ కుమార్‌ స్పష్టం చేశారు.

తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల తేదీ ఇదిగో, జూన్ 4 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు, ఫీజు వివ‌రాలు, టైం టేబుల్‌ త్వరలో

మొదటి సెషన్‌లో పరీక్షకు ఉదయం 7.30 గ ంటల నుంచి, రెండో సెషన్‌లో పరీక్షకు మధ్యాహ్నం 1.30 గంటల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని తెలిపారు. చివరి నిమిషంలో హైరానా పడకుండా, అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రాన్ని ఒక రోజు ముందే చూసుకోవాలసి సూచించారు. జంట నగరాల్లో పరీక్షా కేంద్రాలు ఉండే ప్రాంతాల్లో నిరంతర విద్యుత్‌ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, కేంద్రాలు ఉన్న రూట్లలో అదనపు బస్సులు నడపాలని సంబంధిత అధికారులను కోరారు.