Representational Picture. Credits: PTI

తెలంగాణ ఇంటర్‌ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. మంగళరం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ఇంటర్‌ బోర్డ్‌ కార్యాలయంలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి లాంఛనంగా విడుదల చేశారు. ఫలితాలను https://tsbie.cgg.gov.in, http://results.cgg.gov.in వెబ్‌సైట్లలో విద్యార్థులు ఫలితాలను చూసుకోవచ్చు.

మార్చి, ఏప్రిల్‌ నెలలో తెలంగాణ ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షను 9.47 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. గతేడాది ఫలితాలు జూన్‌లో విడుదల కాగా.. ఈ ఏడాది ఒక నెల ముందుగానే విడుదల అయ్యాయి.

ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇదిగో, మే 24 నుంచి జూన్ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు

టీఎస్‌ ఎంసెట్‌ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. దీనికి తెలంగాణలో 104, ఏపీలో 33 (మొత్తం 137) పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 3.20 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఒక్క హైదరాబాద్‌ నగరం నుంచే అత్యధికంగా 1,71,706 మంది పరీక్షలు రాయనున్నారు. అధికారులు గ్రేటర్‌ పరిధిలో మొత్తం 58 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 10, 11 తేదీల్లో అగ్రికల్చర్‌, 12, 13, 14 తేదీల్లో ఇంజనీరింగ్‌ పరీక్షలు నిర్వహి ంచనున్నారు. ప్రతి రోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి.

ఇతర లింకులు ఇవిగో..

1st Year: https://results.eenadu.net/ts-inter-2023/ts-inter-1st-year-results-general.aspx

Second Year: https://results.eenadu.net/ts-inter-2023/ts-inter-2nd-year-results-general.aspx

1st and Second Year Link: https://education.sakshi.com/