Sabitha Indra Reddy (Photo-Video grab)

జూన్ 4 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి సబితా తెలిపారు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో మెదక్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. రీకౌంటింగ్, రీవెరిఫికేష‌న్‌కు అవ‌కాశం క‌ల్పించామ‌న్నారు. అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన ఫీజు వివ‌రాలు, టైం టేబుల్‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌న్నారు.

మే 10 నుంచి మే 16 వరకు రీకౌంటింగ్‌, రీ వాల్యూయేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని.. విద్యార్థులు, తల్లిదండ్రులెవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. విద్యార్థులపై ఒత్తిడి ఉండకూడదనే ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కుల వెయిటేజీ తొలిగించినట్లు మంత్రి చెప్పారు.

జూన్ 4 నుంచి ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు, తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల, చివరి స్థానంలో నిలిచిన మెదక్ జిల్లా

తెలంగాణ ఇంటర్‌ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. మంగళరం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ఇంటర్‌ బోర్డ్‌ కార్యాలయంలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి లాంఛనంగా విడుదల చేశారు. ఫలితాలను https://tsbie.cgg.gov.in, http://results.cgg.gov.in వెబ్‌సైట్లలో విద్యార్థులు ఫలితాలను చూసుకోవచ్చు. మార్చి, ఏప్రిల్‌ నెలలో తెలంగాణ ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షను 9.47 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.

తెలంగాణ ఇంటర్‌ పరీక్ష ఫలితాలు విడుదల, రిజల్ట్స్‌ను https://tsbie.cgg.gov.in, http://results.cgg.gov.in ద్వారా చెక్ చేసుకోండి

ఫ‌స్టియ‌ర్ 4,33,082 మంది హాజ‌రైతే 2,72,208 మంది ఉత్తీర్ణ‌త సాధించారు. ఫ‌స్టియ‌ర్‌లో 62.85 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైంది. సెకండియ‌ర్‌లో 3,80,920 మంది హాజ‌రైతే 2,56,241 మంది ఉత్తీర్ణ‌త సాధించ‌గా, 67.27 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైంది. మొత్తం ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియర్‌లో 61.68 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైంది. కాగా, బాలిక‌లు 68.68 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. బాలురు 54.66 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్ర స్థానంలో నిలిచింది.