తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. మంగళరం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డ్ కార్యాలయంలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి లాంఛనంగా విడుదల చేశారు. ఫలితాలను https://tsbie.cgg.gov.in, http://results.cgg.gov.in వెబ్‌సైట్లలో విద్యార్థులు ఫలితాలను చూసుకోవచ్చు. మార్చి, ఏప్రిల్ నెలలో తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షను 9.47 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
ఫస్టియర్ 4,33,082 మంది హాజరైతే 2,72,208 మంది ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్‌లో 62.85 శాతం ఉత్తీర్ణత నమోదైంది. సెకండియర్‌లో 3,80,920 మంది హాజరైతే 2,56,241 మంది ఉత్తీర్ణత సాధించగా, 67.27 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌లో 61.68 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కాగా, బాలికలు 68.68 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు 54.66 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్ ఫలితాల్లో ములుగు జిల్లా అగ్ర స్థానంలో నిలిచింది. జూన్ 4 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి సబితా తెలిపారు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో మెదక్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది.
ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఇవాళ 2022-23 ఫలితాలను విడుదల చేశాం. మార్చి 15 నుంచి పరీక్షలు నిర్వహించాం. విద్యార్థి దశలో ఇంటర్ అనేది కీలకమైంది. జీవితానికి టర్నింగ్ పాయింట్. మన రాష్ట్రంలో ఫస్టియర్, సెకండియర్ 9,45,153 మంది హాజరయ్యారు. 1473 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించాం. 26 వేల మంది సేవలందించారు. ః
పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన అన్ని విభాగాల వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఎంసెట్ విషయంలో ఇంటర్ వెయిటేజీని తీసేస్తున్నామని ప్రకటించారు. పిల్లలు ఎవరూ కూడా ఒత్తిడికి గురి కావొద్దనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.
ఇతర లింకులు ఇవిగో..
1st Year: https://results.eenadu.net/ts-inter-2023/ts-inter-1st-year-results-general.aspx
Second Year: https://results.eenadu.net/ts-inter-2023/ts-inter-2nd-year-results-general.aspx
1st and Second Year Link: https://education.sakshi.com/