సమాచారం

Adhikmas In Hindu Calendar: హిందూ పంచాంగంలో వచ్చే ఏడాది 13 నెలలు.. అధికంగా వచ్చిన ‘శ్రావణం’.. 19 సంవత్సరాలకు ఒకసారి ఇలా..

Rudra

హిందూ పంచాంగం ప్రకారం.. వచ్చే ఏడాది అంటే 2023లో 13 నెలలు ఉండనున్నాయి. ఆ ఏడాది శ్రావణ మాసాలు రెండు ఉండనున్నాయి. శ్రావణమాసం అధికంగా రానుండటమే ఇందుకు కారణం.

TS Law For Girls: బాలికా సంరక్షణకు తెలంగాణ ముందడుగు.. స్కూళ్లు, కాలేజీల్లో అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ప్రత్యేక చట్టానికి యోచన

Rudra

తెలంగాణలోని పాఠశాలలు, కళాశాలల్లో అమ్మాయిల మీద జరుగుతున్న అఘాయిత్యాలను అడ్డుకోవడానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

JEE Fee Hiked: జేఈఈ మెయిన్ దరఖాస్తు ఫీజు భారీగా పెంపు.. రెండింతలు చేసిన ఎన్‌టీఏ

Rudra

జేఈఈ మెయిన్ షెడ్యూల్‌ను ఇటీవలే ప్రకటించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పరీక్ష ఫీజులను భారీగా పెంచేసింది. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అబ్బాయిలకు ఇప్పటి వరకు రూ. 650 ఫీజు వసూలు చేస్తుండగా ఇప్పుడు దానిని రూ. 1000కి పెంచేసింది. అదే కేటగిరీలోని అమ్మాయిల ఫీజును రూ. 325 నుంచి రూ. 800 చేసింది.

Aadhaar-Voter ID Linking: ఆధార్ తో ఓటర్ ఐడీ లింక్ కాకపోయినా.. జాబితా నుంచి ఓటర్ల పేర్లు తీసివేయబోం.. పార్లమెంట్ లో కేంద్రం

Rudra

ఓటరు కార్డుతో ఆధార్‌ను అనుసంధానించే అంశంపై కేంద్రం మరోసారి పార్లమెంట్‌లో వివరణ ఇచ్చింది. ఇది పూర్తిగా పౌరుల స్వచ్ఛందపరమైన అంశమని, ఇది ప్రతి ఒక్కరి వ్యక్తిగత నిర్ణయమని పేర్కొంది.

Advertisement

NEET UG 2023: నీట్‌ యూజీ- 2023 పరీక్ష తేదీ ఖరారు, మే 7వ తేదీన దేశవ్యాప్తంగా నీట్‌ పరీక్ష, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ త్వరలో ప్రారంభం

Hazarath Reddy

దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష నీట్‌ యూజీ- 2023 తేదీ ఖరారయ్యాయి. మే 7వ తేదీన దేశవ్యాప్తంగా నీట్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు తీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) తెలిపింది

Phones Ban In Jagannath Temple: పూరి ఆలయంలో స్మార్ట్‌ ఫోన్లపై పూర్తి నిషేధం.. భక్తులతో పాటు పోలీసులు, ఆలయ సిబ్బందికీ ఇదే నిబంధన.. జనవరి నుంచే అమలు

Rudra

ఒడిశాలోని పూరి జగన్నాథస్వామి ఆలయంలోకి సెల్‌ఫోన్లు తీసుకెళ్లడాన్ని పూర్తిస్థాయిలో నిషేధించారు. ఇప్పటి వరకు ఈ నిబంధన భక్తులకు మాత్రమే పరిమితం కాగా, ఇకపై పోలీసు సిబ్బందితోపాటు అందరికీ వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

JEE Main Exam: జేఈఈ మెయిన్ షెడ్యూల్ వచ్చేసిందోచ్.. పరీక్షలు ఎప్పటి నుంచంటే?

Rudra

దేశవ్యాప్తంగా లక్షలాదిమంది ఎదురుచూస్తున్న జేఈఈ మెయిన్ షెడ్యూల్ వచ్చేసింది. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) జేఈఈ మెయిన్ షెడ్యూల్‌ను విడుదల చేసింది.

AP Holidays Calendar: సెలవుల కేలెండర్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం.. ఉగాది, శ్రీరామనవమి, వినాయక చవితికి బ్యాంకులకు నో హాలిడే!

Rudra

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే ఏడాదికి గాను సెలవుల కేలెండర్‌ను విడుదల చేసింది. ఇందులో ప్రభుత్వ కార్యాలయాలకు 23 సాధారణ సెలవులు, 22 ఐచ్ఛిక సెలవులు ఉన్నాయి.

Advertisement

Weather Forecast: ఆగ్నేయ బంగాళాఖాతంలో మళ్లీ ఏర్పడిన ఇంకో అల్పపీడనం, గురువారం నాటికి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం, ఏపీకి భారీ వర్ష సూచన

Hazarath Reddy

దక్షిణ అండమాన్‌ సముద్రానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో బుధవారం మధ్యాహ్నం అల్పపీడనం (Low pressure area) ఏర్పడింది. ఇది పశ్చిమ దిశగా పయనిస్తూ గురువారం నాటికి తీవ్ర అల్పపీడనంగా మారనుందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.

Weather Forecast: మళ్లీ దూసుకొస్తున్న తుపాన్, రెండు మూడు రోజుల్లో మోగా విరుచుకుపడే అవకాశం, రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలను వణికించిన మాండూస్ తుపాను అల్పపీడనంగా బలహీనపడి నిన్న ఉపరితల ఆవర్తనంగా మారింది. దీని ప్రభావంతో నేడు దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

Tech Layoffs: అమెరికాలో రోడ్డు మీదకు ఐటీ ఉద్యోగులు, రెండు లక్షలా 18 వేల మందిని తొలగించిన టాప్ టెక్ కంపెనీలు, భారత్‌లో వచ్చే ఏడాది నుంచి లేఅఫ్స్ షురూ..

Hazarath Reddy

అగ్రరాజ్యం అమెరికాలో ఐటీ ఉద్యోగులకు డేంజర్ బెల్స్ (Tech Layoffs) మొదలయ్యాయి. అమెరికాలో భారీ ఎత్తున ఉద్యోగులను కంపెనీలు తొలగించే పనిలో పడ్డాయి. టెక్ లేఆప్స్ ట్రాకింగ్ సైట్ ట్రూఅప్‌ ప్రకారం.. 2022 సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు 1434 సార్లు (1,434 layoffs) ఉద్యోగుల తొలగింపులు ప్రకటించాయని పేర్కొంది

TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్, జనవరి నెల ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేసిన టీటీడీ, తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Hazarath Reddy

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నేడు విడుదల చేసింది. జనవరి నెల కోటాకు సంబంధించి ఆర్జిత సేవా టికెట్లను సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. జనవరి నెల మొత్తానికి సంబంధించిన టికెట్లను భక్తులు ఆన్ లైన్ ద్వారా బుక్‌చేసుకోచ్చు.

Advertisement

Tweet Character Limit Increased: ట్వీట్స్ లో వాడే క్యారెక్టర్స్ పరిమితి 4,000కు పెంపు.. ధ్రువీకరించిన ఎలాన్ మస్క్

Rudra

ట్విట్టర్ లో మార్పుచేర్పులపై ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ఆ సంస్థ సీఈవో ఎలాన్ మస్క్ తాజాగా మరో విషయం ప్రకటించారు. ట్వీట్స్ లో వాడే క్యారెక్టర్స్ (అక్షరాలు) పరిమితిని 280 నుంచి 4,000కు పెంచుతున్నట్టు ప్రకటించారు.

Hyderabad Rains: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం.. శీతల గాలులతో జనం ఇబ్బంది

Rudra

మాండూస్ తుపాను ప్రభావం హైదరాబాద్‌పైనా పడింది. శీతల గాలులు వీస్తుండంతోపాటు ముసురు వాతావరణం నెలకొనడంతో చలితో జనం అల్లాడుతున్నారు. చలిగాలులు తీవ్రంగా ఉండడంతో చిన్నారులు, పెద్దలు ఇబ్బందులు పడుతున్నారు.

Women As MARCOS: రక్షణరంగ చరిత్రలో అద్భుత ఘట్టం.. మార్కోస్ గా తొలిసారిగా మహిళలకు అవకాశం.. నేవీ అధికారుల వెల్లడి

Rudra

త్రివిధ దళాల్లో ఒకటైన ఇండియన్ నేవీ .. మహిళా అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌ అందజేసింది. త్రివిధ దళాల్లో కమాండోస్ గా విధులు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వనున్నట్టు సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు.

Rains In AP And TS: రేపు మరో అల్పపీడనం.. ఏపీలో నేడు కూడా వర్షాలు.. తెలంగాణలోనూ రెండు రోజులు మోస్తరు వర్షాలు

Rudra

ఆంధ్రప్రదేశ్, తమిళనాడును వణికించిన మాండూస్ (మాండౌస్) తుపాను అల్పపీడనంగా బలహీనపడి నిన్న ఉపరితల ఆవర్తనంగా మారింది. దీని ప్రభావంతో నేడు దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలలో కొన్ని చోట్లతో పాటు తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

Advertisement

Arjita Seva Tickets: జనవరి నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు రేపే విడుదల.. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆన్ లైన్ లో టికెట్లు.. వెల్లడించిన టీటీడీ

Rudra

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల జనవరి మాసం కోటాను ఈ నెల 12న విడుదల చేయనున్నట్టు టీటీడీ వెల్లడించింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆన్ లైన్ లో టికెట్లు అందుబాటులో ఉంటాయని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.

Cyclone Mandous: మహాబలిపురం సమీపంలో తీరం దాటిన ‘మాండూస్‌’.. నేటి మధ్యాహ్నానికి మరింత బలహీనపడనున్న తుపాను.. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో నేడు భారీ వర్షాలు.. తుపాను ప్రభావంపై ఏపీ సీఎం జగన్ సమీక్ష .. ఇప్పటివరకూ ఐదుగురి మృతి

Rudra

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘మాండూస్‌ లేదా మాండౌస్’ గత అర్ధరాత్రి దాటిన తర్వాత పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటింది. నిన్న ఉదయమే బలహీనపడిన తుపాను నేటి ఉదయం మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ తెలిపింది.

Special Buses For Sankranti: టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. సంక్రాంతి పండుగ ప్రయాణికుల కోసం 4,233 ప్రత్యేక బస్సుల ఏర్పాటు.. జనవరి 7 నుంచి 15 వరకు అందుబాటులోకి

Rudra

సంక్రాంతి పండుగకు వెళ్ళే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. 4,233 ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది.

New UPI Feature: యూపీఐ ప్లాట్ ఫామ్‌పై అదిరిపోయే ఫీచర్, వస్తువు డెలివరీ అయ్యే దాకా అకౌంట్ నుంచి డబ్బులు బ్లాక్ చేసుకోవచ్చు, సింగిల్ బ్లాక్ మల్టిపుల్ డెబిట్స్ తీసుకువస్తున్న RBI

Hazarath Reddy

యూపీఐ ప్లాట్ ఫామ్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరికొత్త ఫీచర్ ను (New UPI Feature) అందబాటులోకి తీసుకురానుంది. దీని పేరే సింగిల్ బ్లాక్ మల్టిపుల్ డెబిట్స్ ఫీచర్. దీని (Single-Block-and-Multiple-Debits) ద్వారా మీరు మీ చెల్లింపులు చాలా జాగ్రత్తగా చేసుకోవచ్చు. ఒక మర్చంట్ కు సంబంధించి చేయాల్సిన చెల్లింపులను యూపీఐ ద్వారా బ్లాక్ చేసుకోవచ్చు.

Advertisement
Advertisement