వార్తలు

Amit Shah on Abolishment of Article 370: ఆర్టికల్ 370 రద్దు చారిత్రాత్మక నిర్ణయమంటూ అమిత్ షా కీలక వ్యాఖ్యలు, ఎప్పటికీ తిరిగి పునరుద్ధరించబడదని కీలక ప్రకటన

Hazarath Reddy

కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల 2024 కోసం బిజెపి మేనిఫెస్టోను విడుదల చేస్తూ, ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 ఓ "చరిత్ర" అని, ఎప్పటికీ పునరుద్ధరించబడదని ప్రకటించారు.

Andhra Pradesh Rains: వీడియో ఇదిగో, బుడమేరులో తృటీలో తప్పిన పెను ప్రమాదం, ప్రవాహంలో బోటు చిక్కుకుపోయిన బోటు

Hazarath Reddy

నందివాడ మండలం బుడమేరులో తృటీలో పెను ప్రమాదం తప్పింది. బుడమేరు ప్రవాహంలో బోటు చిక్కుకుపోయింది. పుట్టగుంట నుండి ఓడ్డుకు దాటుతుండగా బోటు అదుపు తప్పింది.వంతెన రెయిలింగ్ లో బోటు అడుగుభాగం ఇరుక్కుపోయింది.తక్షణమే స్పందించిన గజ ఈతగాళ్లు బుడమెరులో దూకి బోటును ఒడ్డుకు తెచ్చారు. ఎఫ్డిఆర్ఎఫ్ బృందం వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది.

TGSPDCL: విద్యుత్ సిబ్బంది లంచం అడిగితే ఈ నెంబర్లకు ఫోన్ చేయాలన్న సీఎండీ ముషరఫ్ ఫరూఖీ, ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వెల్లడి

Arun Charagonda

మా సిబ్బంది/అధికారులు ఏదైనా పనికి లంచం అడిగితే నా కార్యాలయానికి తెలియజేయాలన్నారు సీఎండీ ముషారఫ్ ఫరూఖి. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ పరిధిలో మా సిబ్బంది/అధికారులు ఏదైనా పనికి లంచం అడిగితే 040 - 2345 4884 కు గాని లేదా 768 090 1912 కు కాల్ చేసి ఫిర్యాదుచేయగలరని సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖి విద్యుత్ వినియోగదారులకు తెలిపారు.

Kenya School Fire: కెన్యాలో ఘోర అగ్ని ప్రమాదం, 17 మంది పిల్లలు నిద్రలోనే సజీవ దహనం, 13 మందికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

కెన్యాలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలొ 17 మంది పిల్లలు దుర్మరణం పాలయ్యారు. సెంట్రల్ కెన్యా నైరీ కౌంటీలోని ప్రైమరీ స్కూల్ డార్మిటరీలో మంటలు చెలరేగాయి. దీంతో 5 నుంచి 12 ఏళ్ళ మధ్య వయసున్న 17 మంది విద్యార్థులు నిద్రలోనే సజీవదహనం అయ్యరు.

Advertisement

Vinesh Phogat Joins Congress: కాంగ్రెస్ పార్టీలో చేరిన వినేష్ పొగట్, పునియా, పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సీనియర్ నేతలు

Arun Charagonda

హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీలో చేరారు వినేష్ పొగట్, భజరంగ్ పునియా. కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలను కలిశారు. అనంతరం కేసీ వేణుగోపాల్ తో కలిసి మీడియాతో మాట్లాడారు.

MLA Koneti Adimulam: చెన్నై అపోలో ఆస్పత్రిలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, అనారోగ్యంతో చేరినట్లు సమాచారం

Arun Charagonda

చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరారు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం. నిన్న మహిళ నాయకురాలితో వీడియో బయటపడగా పార్టీనుండి సస్పెండ్ చేసింది టీడీపీ. బాధితురాలి ఫిర్యాదుతో తిరుపతి ఈస్ట్ పిఎస్ లో కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటికే ఆదిమూలంకు మూడు స్టంట్‌లు పడ్డాయి.

KCR Navagraha Yagam: కేసీఆర్ నవగ్రహ మహాయాగం, 18 నుండి జిల్లాల టూర్, ఎన్నికల్లో ఓటమి తర్వాత చేస్తున్న యాగం నేపథ్యంలో అందరి దృష్టి

Arun Charagonda

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఈజ్‌ బ్యాక్. రుణమాఫీపై రణం చేసేందుకు త్వరలోనే జిల్లాల పర్యటన చేపట్టనున్నారు కేసీఆర్. ఈ నేపథ్యంలో ఇవాళ ఎర్రవెల్లి ఫామ్‌ హౌస్‌లో నవగ్రహ మహాయాగం చేపట్టారు కేసీఆర్. సతీమణి శోభతో కలిసి వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు చేశారు కేసీఆర్. ఇక తెలంగాణలో యాగం అనగానే గుర్తుకు వచ్చేది కేసీఆరే.

Vinesh Phogat Resigns: రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేసిన వినేశ్‌ ఫోగట్‌, నేడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లుగా వార్తలు

Hazarath Reddy

భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌ (Vinesh Phogat ) కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు గుప్పుమంటున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో వినేశ్‌ ఫోగట్‌ తాజాగా కీలక ప్రకటన చేశారు. రైల్వేస్‌లో తన ఉద్యోగానికి రాజీనామా (resigns from her post in Indian Railways) చేసినట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు .

Advertisement

Bull Attack on Elderly Man: వీడియో ఇదిగో, దారిన వెళ్తున్న వృద్ధుడిపై అకస్మాత్తుగా దాడి చేసిన ఎద్దు, పొట్టలో కొమ్ములతో పొడిచి అమాంతం పైకి లేపి పడేసిన బుల్

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో 85 ఏళ్ల వృద్ధుడుని ఎద్దు ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. సీసీటీవీలో బంధించిన ఈ భయానక దాడి, యుపి మంత్రి దినేష్ ఖాటిక్ నివాసం దగ్గర జరిగింది. వృద్ధుడు అక్కడ నడుచుకుంటూ వెళ్తుండగా ఎద్దు అతని పొట్టలో కొమ్ములతో పొడిచి, అతనిని నేల నుండి పైకి లేపింది

Stunt With Snake:యువకుడి డేంజరస్ స్టంట్, నోట్లో పాము పెట్టుకుని ఆటలు, కాటు వేయడంతో మృతి...వీడియో వైరల్

Arun Charagonda

విష స‌ర్పంతో విన్యాసం చేస్తూ ఓ యువ‌కుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. కామారెడ్డి జిల్లా దేశాయిపేట గ్రామంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. గ్రామంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయంలోకి 6 ఫీట్ల నాగుపాము వచ్చింది. స్నేక్ క్యాచ‌ర్‌ శివ దాన్ని పట్టుకొని త‌ల‌ భాగాన్ని నోట్లో పెట్టుకొని వీడియో తీసుకున్నాడు. అది కాటు వేయడంతో విషం శరీరంలోకి పాకి మరణించాడు.

Jr NTR: నందమూరి మోక్షజ్ఞకు శుభాకాంక్షలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్, తాత ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించిన తారక్

Arun Charagonda

బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ లాంచ్ కోసం రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. నందమూరి మోక్షజ్ఞకు శుభాకాంక్షలు తెలిపారు జూనియర్ ఎన్టీఆర్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన తారక్..తాతగారి ఆశీస్సులు నీపై ఉండాలని కోరుకుంటున్నా అన్నారు.

Kolleru Lake: బుడమేరు తర్వాత దడ పుట్టిస్తున్న కొల్లేరు సరస్సు, పెరుగుతున్న వరదతో రోడ్డుపైకి వస్తున్న నీరు, భయం గుప్పిట్లో పలు లంక గ్రామాలు ప్రజలు

Hazarath Reddy

కొల్లేరు వాసులు భయం గుప్పిట్లో ఉన్నారు.కొల్లేరు పరివాహక ప్రాంతంలోని చిన్న అడ్లగడ్డ వద్ద రోడ్డుపై నీరు ప్రవహిస్తోంది. బుడమేరు నుంచి కొల్లేరుకు లింకుండడంతో కొల్లేరుకు నీటి ప్రవాహం ప్రస్తుతం భారీగా వస్తోంది. బుడమేరులో రెండో గండిని పూడ్చివేశారు. మూడో గండిని పూడ్చేందుకు అప్రోచ్‌రోడ్డును నిర్మిస్తున్నారు

Advertisement

Andhra Pradesh: ఏపీలో మరో రాసలీలల ఆడియో లీక్, ఇప్పుడే రూ.5 వేలు ఇస్తా కోరిక తీర్చాలంటూ లోకల్ నేత వేధింపులు, ఆడియో ఇదిగో..

Hazarath Reddy

త్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వ్యవహారం మరువకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చిది. అనంతపురం జిల్లా శింగనమల మండలంలో ఓ పార్టీ నేత శ్రీనివాస్ నాయుడు లైంగిక వేధింపుల ఆడియో లీకయింది.

YSRCP: పార్టీ బలోపేతం కోసం జగన్ సంచలన నిర్ణయం, వైసీపీ నిర్మాణ సలహాదారుగా ఆళ్ల మోహన్ సాయి దత్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి నియామకం

Hazarath Reddy

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా (లీగల్ వ్యవహారాలు) మాజీ అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని నియమించారు. అలాగే.. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా వేణుగోపాల్ కృష్ణ మూర్తి (చిట్టి బాబు), పార్టీ నిర్మాణ సలహాదారుగా ఆళ్ల మోహన్ సాయి దత్‌ను నియమిస్తున్నట్లు కేంద్ర కార్యాలయం పేర్కొంది.

Fire Accident At Times Tower: ముంబై టైమ్స్ టవర్‌లో భారీ అగ్ని ప్రమాదం, మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్న ఫైర్ సిబ్బంది..వీడియో

Arun Charagonda

ముంబైలోని టైమ్స్ టవర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక అధికారులు ఫైర్ ఇంజిన్లుతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Court Notices To KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు కోర్టు మరోసారి నోటీసులు, మేడిగడ్డ ఎఫెక్ట్..స్మితా సబర్వాల్‌కు సైతం నోటీసులిచ్చిన న్యాయస్థానం

Arun Charagonda

మేడిగడ్డ ఎఫెక్ట్ మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చింది న్యాయస్థానం. 17న విచారణకు హాజరుకావాలని భూపాలపల్లి జిల్లా కోర్టు సమన్లు జారీ చేసింది. కేసీఆర్‌తో పాటు ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు నోటీసులు జారీ చేసింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో ప్రజాధనం దుర్వినియోగమైందని రాజలింగమూర్తి కోర్టును ఆశ్రయించారు.

Advertisement

MLA Koneti Adimulam: ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై పోలీస్ కేసు, బలాత్కారం, బెదిరించి రేప్ చేశారని తిరుపతి ఈస్ట్ పోలీసుల కేసు నమోదు

Arun Charagonda

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై కేసు నమోదైంది. బలాత్కారం, బెదిరించి రేప్ చేశారన్న ఫిర్యాదు నేపథ్యంలో తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు పార్టీ నుండి కోనేటిని సస్పెండ్ చేసింది టీడీపీ.

Andhra Pradesh: సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంను అరెస్ట్ చేయాలని మహిళా సంఘాల ఆందోళన, తిరుపతి మున్సిపల్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం

Arun Charagonda

మహిళల పట్ల అసభ్యకరంగా వ్యవహరించిన సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ను వెంటనే అరెస్టు చేయాలని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం డిమాండ్ చేసింది. ఎమ్మెల్యే రాసలీలలు బయటపడిన నేపథ్యంలో తిరుపతి పాత మున్సిపల్ ఆఫీస్ వద్ద మహిళలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.

Whiskey Ice Cream: యూత్ టార్గెట్‌గా విస్కీ ఐస్‌క్రీమ్, వన్ అండ్ ఫైవ్ ఐస్‌క్రీమ్ పార్లర్‌లో సోదాలు, యజమానులు దయాకర్ రెడ్డి, శోభన్ అరెస్ట్

Arun Charagonda

హైదరాబాద్ లో ఐస్‌క్రీమ్‌లో విస్కీ కలిపి అమ్ముతోంది ఓ ముఠా. వన్ అండ్ ఫైవ్ ఐస్‌క్రీమ్ పార్లర్‌లో ఎక్సైజ్ అధికారుల సోదాలు నిర్వహించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 60 గ్రాముల ఐస్‌క్రీమ్‌లో 100 మి.లీ విస్కీ కలుపుతున్నట్టు గుర్తించారు అధికారులు.

Nandamuri Mokshagnya Debut Film: అఫిషియల్..నందమూరి మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం, ప్రశాంత వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ, ఫస్ట్ లుక్ రిలీజ్

Arun Charagonda

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సమయం వచ్చేసింది. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం చేశారు. స్టార్‌ డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ బాలయ్య కుమారుడిని వెండితెరకు పరిచయం చేయనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ పోస్ట్ పెట్టారు. సింబా ఈజ్‌ కమింగ్‌ అంటూ మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆయన లుక్‌ను విడుదల చేశారు.

Advertisement
Advertisement