News

Arekapudi Gandhi Vs Kaushik Reddy: కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికెపూడి గాంధీ..మొత్తం వివాదానికి కారణం ఇదే, పీఏసీ వ్యవహారం..అగ్నిగుండంలా మారిన రాష్ట్రం!

Arun Charagonda

పార్టీ ఫిరాయింపులు దీనికి తోడు రాష్ట్ర ప్రజాపద్దుల సంఘం(పీఏసీ) ఛైర్మన్‌ పదవి వెరసీ తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికెపూడి గాంధీగా మారిపోయాయి.

Miss Switzerland Finalist: స్విట్జర్లాండ్ మాజీ మిస్ ఫైనలిస్ట్ దారుణ హత్య, క్రిస్టినా జోక్సిమోవిక్‌ను హత్య చేసిన భర్త, దర్యాప్తులో సంచలన నిజాలు

Arun Charagonda

స్విట్జర్లాండ్‌ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసే న్యూస్. మాజీ మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్ట్ దారుణ హత్యకు గురయ్యారు. క్రిస్టినా జోక్సిమోవిక్ హత్యకు గురైందని, ఆమె శరీరాన్ని ముక్కలు చేసి, ఆమె భర్త థామస్ కరిగించాడని స్విస్ అధికారులు వెల్లడించారు. ఆమె 41 ఏళ్ల భర్తను పోలీసులు అరెస్ట్ చేయగా విచారణలో ఆయన తన నేరాన్ని అంగీకరించాడు.

SC on Bulldozer Action: బుల్డోజర్లతో ఇళ్లను కూల్చడంపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు, చట్టాలే అత్యత్తమమని భావించే దేశంలో ఇలాంటివి తగదని మండిపాటు..

Hazarath Reddy

బుల్డోజర్‌ న్యాయంపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అక్రమ కట్టడాల పేరుతో ప్రజల ఇండ్లపైకి ప్రభుత్వాలు బుల్డోజర్లను పంపిస్తుండటాన్నిసర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది

MLA Koneti Adimulam Video Case: ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక దాడి కేసులో కొత్త టిస్ట్, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిన బాధితురాలు, రాజీ కోసం టీడీపీ నాయకులు రహస్య మంతనాలు

Hazarath Reddy

టీడీపీ నుంచి సస్పెండ్ అయిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక దాడి కేసులో కొత్త టిస్ట్ బయటకు వచ్చింది. బాధితురాలు వరలక్ష్మి అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా వార్తలు వస్తున్నాయి.

Advertisement

Telangana Flood Relief: తెలంగాణ సీఎంఆర్‌ఎఫ్‌కు ఏఎంఆర్‌ ఇండియా కోటి రూపాయల విరాళం, సీఎం రేవంత్‌ను కలిసి చెక్కు అందించిన కంపెనీ ఎండీ మహేష్ కుమార్‌

Arun Charagonda

వరద బాధితుల సహాయార్థం ఏఎంఆర్ ఇండియా కంపెనీ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒక కోటి రూపాయలు విరాళంగా అందించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు కంపెనీ ఎండీ ఎ. మహేష్ కుమార్ రెడ్డి .

TDP Office Attack Case: టీడీపీ కార్యాలయంపై దాడి కేసు, వైఎస్సార్‌సీపీ నేతలకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు, దర్యాప్తునకు సహకరించాలని ఆదేశాలు

Hazarath Reddy

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వైఎస్సార్‌సీపీ నేతలకు సర్వోన్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దేవినేని అవినాష్, జోగి రమేష్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, గవాస్కర్‌లకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో దర్యాప్తునకు సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Tollywood: సీఎం చంద్రబాబును రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలుస్తున్నారనే వార్తలు అబద్దం, క్లారిటీ ఇచ్చిన చరణ్ పీఆర్ టీమ్, అసలు నిజం ఏంటంటే..

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును హీరో రామ్ చరణ్ కలుస్తున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో వస్తున్న సంగతి విదితబే. మరో హీరో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఆయన సీఎంను కలుస్తున్నారంటూ వార్తలు వచ్చాయి.

Ganesh Laddu Auction: వినాయకుడి లడ్డూ వేలంపాటలో ముస్లిం సోదరులు, లడ్డూను రూ.15వేలకు దక్కించుకున్న తాజోద్దీన్..వెల్లివిరిసిన మతసామరస్యం

Arun Charagonda

తెలంగాణలోని వనపర్తిలో మత సామరస్యం వెల్లివిరిసింది. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం బెక్కెం గ్రామంలో వినాయక లడ్డు వేలం పాట జరిగింది. వేలం పాటలో రూ.15 వేలకు లడ్డూను దక్కించుకున్నారు ముస్లిం సోదరులు తాజోద్దీన్, మహమ్మద్. ఇందుకు సంబంధించిన న్యూస్ చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Arvind Kejriwal Granted Bail: కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు పెట్టిన షరతులు ఇవే, సుదీర్ఘంగా నిర్బంధించడమంటే వ్యక్తి హక్కులను హరించినట్లేనని తెలిపిన అత్యున్నత ధర్మాసనం

Hazarath Reddy

హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు బిగ్ రిలీఫ్ దొరికింది. లిక్కర్‌ పాలసీ స్కామ్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు (Supreme Court) బెయిల్‌ మంజూరు చేసింది.

Bigg Boss Telugu 8: బిగ్ బాస్‌ తెలుగు 8..అదిరే రేటింగ్స్, గత సీజన్‌ల రికార్డులు బ్రేక్, వెల్లడించిన కింగ్ నాగార్జున

Arun Charagonda

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు 8 రెండోవారం ముగింపుకు వచ్చేసింది. ఈ సీజన్‌లో బిగ్ బాస్‌కు అదిరే రెస్పాన్స్ వస్తోంది. గత సీజన్‌ల రికార్డులను బ్రేక్ చేస్తూ ఏకంగా 5.9 బిలియన్ నిమిషాల రికార్డ్ వ్యూస్‌ని రాబట్టింది. ఇది గత సీజన్‌ల కంటే అధికమని హోస్ట్ నాగార్జున ఎక్స్ ద్వారా వెల్లడించారు. మీ ప్రేమ, ఆదరాభిమానాలను మర్చిపోలేమని తెలిపారు నాగ్.

Cristiano Ronaldo: 100 కోట్ల ఫాలోవర్లతో క్రిస్టియానో ​​రొనాల్డో వరల్డ్ రికార్డు, అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో దుమ్మురేపుతున్న ఫుట్‌బాల్ దిగ్గజం

Hazarath Reddy

అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లతో సహా 1 బిలియన్ కంటే ఎక్కువ మంది అనుచరులను కలిగి ఉన్న ఏకైక వ్యక్తి క్రిస్టియానో ​​రొనాల్డో సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. పోర్చగల్‌కు చెందిన స్టార్‌ ఫుట్‌బాల్ ప్లేయర్‌ CR7 ఇటీవలే తన యూట్యూబ్ ఛానెల్ "UR క్రిస్టియానో"ని ప్రారంభించారు.

Japan Shocker: దారుణం, 1000 మందికి పైగా మహిళలు స్నానం చేస్తున్న వీడియోలు బయటకు, రాయి లాగా స్పై కెమెరా అమర్చి నిందితుడు ఘాతుకం

Hazarath Reddy

ఫుకుషిమా ప్రిఫెక్చర్‌కు చెందిన 31 ఏళ్ల వ్యక్తి జపాన్‌లోని వేడి నీటి బుగ్గల్లో (hot springs) స్నానం చేస్తున్న 1,000 మంది మహిళలను రహస్యంగా చిత్రీకరించినందుకు రెండేళ్ల జైలు శిక్ష విధించబడింది. ఆ వ్యక్తి మహిళల అనుమతి లేకుండా అక్కడ ఉండే రాళ్లలో స్పై కెమెరాలను ఉపయోగించి వీడియో రికార్డు చేశాడు.

Advertisement

Sudden Death Caught on Camera: విధి ఎంత విచిత్రమైనది, పనిచేస్తుండగా గుండెపోటుతో కుప్పకూలిన ఉద్యోగి, షాకింగ్ వీడియో ఇదిగో..

Hazarath Reddy

గుజరాత్‌లోని సూరత్‌లోని డైమండ్ ఫ్యాక్టరీ కార్మికుడు పనిలో ఉండగానే గుండెపోటుతో మరణించిన ఘటన సీసీటీవీలో రికార్డయింది. మరణించిన 50 ఏళ్ల విను భాయ్ పటేల్ తన వర్క్‌స్టేషన్‌లో వజ్రాన్ని పరిశీలిస్తుండగా అకస్మాత్తుగా తన కుర్చీలోంచి కుప్పకూలిపోయాడు

MLA Arekapudi Gandhi: బీఆర్ఎస్‌లోనే ఉన్నా, కేసీఆర్‌ను కలవడానికి ఇబ్బంది లేదన్న ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి చీటర్.. బ్రోకర్ అని మండిపాటు

Arun Charagonda

బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ను కలవటానికి తనకు ఇబ్బేందేమీ లేదు అని తెలిపారు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. సెటిలర్ల కాలిలో ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తానని కేసీఆర్ చెప్పారు...కౌశిక్ రెడ్డి ఆంధ్ర కామెంట్స్ పై కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. కౌశిక్ రెడ్డి చీటర్.. బ్రోకర్..మా మనోభావాలు దెబ్బదతినటం వలనే ప్రతిగా స్పందిచాల్సి వచ్చిందని చెప్పారు.

KTR On BRS Leaders House Arrest: బీఆర్ఎస్ నేతల హౌస్‌ అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్, సీఎం రేవంత్ రెడ్డి వెన్నులో ఎందుకంత వణుకు? అని ప్రశ్న

Arun Charagonda

బీఆర్ఎస్ నేతల అక్రమ నిర్భంధాలు...హౌస్ అరెస్ట్ ల పై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసిన కేటీఆర్...మీటింగ్ పెట్టుకునే హక్కు కూడా లేదా ? ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ రోజులను గుర్తు తెస్తున్నారు అని మండిపడ్డారు.

Kejriwal Gets Bail: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బిగ్ రిలీఫ్, సీబీఐ కేసులో బెయిల్ ఇచ్చిన సుప్రీం కోర్టు, ఐదున్నర నెలల పాటు తీహార్ జైలులో కేజ్రీవాల్..కండీషన్స్ ఇవే

Arun Charagonda

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్ రిలీఫ్. ఇప్పటికే ఈడీ కేసులో బెయిల్ రాగా తాజాగా సీబీఐ కేసులో బెయిల్ లభించింది. సీబీఐ అరెస్టును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దీంతో తీహార్ జైలు నుండి విడుదల కానున్నారు కేజ్రీవాల్.

Advertisement

Jr NTR-Ram Charan: మరికొద్దిసేపట్లో ఏపీ సచివాలయానికి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్.. బాబును కలువనున్న ఆర్ఆర్ఆర్ హీరోలు

Rudra

స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలవనున్నారు. ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయానికి వెళ్లనున్నారు.

CM Revanth Reddy On Law And Order: శాంతి భద్రతలకు విఘాతం కల్పించే కుట్ర, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే కుట్రపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్, కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశం

Arun Charagonda

తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పట్ల సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయామనే అక్కసుతో కొందరు శాంతి భద్రతలకు విఘాతం కల్పించే ప్రయత్నం చేస్తున్నారన్న రేవంత్..

Arvind Kejriwal: అరవింద్‌ కేజ్రీవాల్‌ బెయిల్‌ పై మరికొద్దిసేపట్లో సుప్రీంకోర్టు తీర్పు.. సర్వత్రా ఆసక్తి

Rudra

మద్యం పాలసీ కేసులో అరెస్టై, జైలు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన రెండు పిటిషన్లపై సుప్రీంకోర్టు మరికొద్దిసేపట్లో తీర్పు వెలువరించనుంది.

Andhra Pradesh Shocker: తాడిపత్రిలో దారుణం, బైక్ పై వస్తున్న వ్యక్తిని రాళ్లతో దాడి చేసి హత్య చేసిన దుండగులు..వీడియో

Arun Charagonda

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. పడమటగేరి వీధిలో బైక్‌పై వస్తున్న వ్యక్తి పై కొందరు దుండగులు రాళ్లతో దాడి చేసి అత్యంత దారుణంగా హత్య చేశారు. మృతుడు నూరుల్లా స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు

Advertisement
Advertisement