News

Varalakshmi Vratham Wishes in Telugu: వరలక్ష్మీ వ్రతం విషెస్ తెలుగులో, ఈ అద్భుతమైన కొటేషన్లతో అందరికీ వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు చెప్పేయండి

Hazarath Reddy

శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం. హిందూ మతం ప్రకారం ఈ పండగ విశిష్టమైనది. వరాలు యిచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు.

NTR Anna Canteens Menu: అన్న క్యాంటీన్లలో రోజు వారీ మెనూ ఇదిగో, నేటి నుంచి 5 రూపాయలకే భోజనం, టిఫెన్ ప్రారంభం

Hazarath Reddy

NTR Anna Canteens: ప్రతి ఒక్కరం బతికేది జానెడు పొట్టకోసమే, అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు, ఇంకా ఏమన్నారంటే..

Hazarath Reddy

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు తన అర్ధాంగి నారా భువనేశ్వరితో కలిసి గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు దంపతులు అన్న క్యాంటీన్ లో భోజనాలు వడ్డించారు. పేదలతో కలిసి భోజనం చేశారు.

CM Revanth Reddy Challenges Harishrao:రుణమాఫీ చేసి చూపించాం.. చీము -నెత్తురుంటే హరీష్‌ రావు రాజీనామా చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి, రాజీనామా చేయకపోతే ఏటిలో దూకాలని మండిపాటు

Arun Charagonda

రుణమాఫీ అమలు చేసి చూపించాం..బీఆర్ఎస్ నేత హరీష్‌ రావుకు సిగ్గుంటే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. రాజీనామా చేయకపోతే ఏటిలో దూకి చావాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లాలోని వైరాలో రైతులను ఉద్దేశించి మాట్లాడిన రేవంత్..31 వేల కోట్లతో రుణమాఫీ పూర్తి చేశామన్నారు.

Advertisement

KTR On BRS - BJP Merge: బీజేపీతో బీఆర్ఎస్ కలిసుంటే కవిత జైలులో ఉండేదా?, త్వరలో స్టేషన్ ఘన్‌పూర్ ఉప ఎన్నిక వస్తుందన్న కేటీఆర్, బీఆర్ఎస్ కార్యకర్తలకు శిక్షణ తరగతులు

Arun Charagonda

తప్పకుండ స్టేషన్ ఘన్‌పూర్లో ఉప ఎన్నిక వస్తుంది.. మళ్లీ తిరిగి రాజయ్య గెలుస్తాడన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్..హై కోర్టులో తీర్పు కూడా రిజర్వు చేసి పెట్టారు.. అక్కడ సానుకూల ఫలితం వస్తుందని అనుకుంటున్న అన్నారు. ఊసరవెల్లిలు రాజ్యం నడిపితే ఖచ్చితంగా ఉడుతలు, తొండలే వస్తాయి...కరెంటు పోతుందని సోషల్ మీడియాలో ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ వాళ్లకు పెడితే.. ట్రాన్స్‌ఫార్మర్ మీద తొండ పడ్డది, ఉడుత పడ్డదని సమాధానం ఇస్తున్నారు అని దుయ్యబట్టారు.

National Flag Underwater: సముద్ర గర్భాన జాతీయ జెండా రెపరెపలు, విశాఖలో స్కూబా డైవర్ సాహసం, వీడియో వైరల్

Arun Charagonda

దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. తెలుగు రాష్ట్రాల్లో సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఇక స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా వైజాగ్ సముద్ర గర్భంలో జాతీయ జెండాను రెపరెపలాడించారు స్కూబా డైవర్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Karnataka Shocker: దారుణం, అందంగా తయారవుతోందని స్నేహితులతో కలిసి భార్యను చంపిన భర్త, ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

కర్ణాటకలోని రామనగర జిల్లా మాగడిలో అందగా తయారవుతున్న భార్యను చూసి ఓర్చుకోలేని భర్త ఆమెను దారుణంగా హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. 32 ఏళ్ల దివ్య-ఉమేశ్ భార్యాభర్తలు. అందంగా కనిపించాలన్న తపనతో దివ్య రోజూ తయారయ్యేది. పెదవులకు లిప్‌స్టిక్ వేసుకునేది. ఒంటిపై టాటూ కూడా పొడిపించుకుంది.

Independence Day 2024: 78వ స్వాతంత్య్ర దినోత్సవం, పూరీ తీరంలో ఆకట్టుకుంటున్న సైకత శిల్పం, సెల్ఫీలు దిగేందుకు ఎగబడుతున్న పర్యాటకులు

Arun Charagonda

దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండా ఎగురవేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఊరూర, వాడ వాడలా మువ్వన్నెల జెండ రెపరెపలాడింది.

Advertisement

Telangana: వీడియో ఇదిగో, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఒంటిపై పెట్రోల్ పోసుకున్న పారిశుద్ధ్య కార్మికుడు, అధికారుల వేధింపులే కారణం

Hazarath Reddy

అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఒంటిపై పెట్రోల్ పోసుకున్న పారిశుద్ధ్య కార్మికుడు. రామగుండంలో జాతీయ జెండా ఎగరవేసిన అనంతరం.. మేయర్ కమీషనర్ ఉన్న సమయంలోనే.. ఆత్మహత్యాయత్నం చేసిన పారిశుద్ధ్య కార్మికుడు విజయ్.

Mobile Phone Explodes: ప్యాంటు జేబులో ఒక్కసారిగా పేలిన సెల్ ఫోన్, జేబు కాలిపోవడంతో పాటు..

Hazarath Reddy

కామారెడ్డి - పిట్లం మండల కేంద్రంలో పిట్లం ఎస్సీ కాలనీకి చెందిన ప్రైవేట్ మెడికల్ ప్రాక్టిషనర్ ఎనిగే సాయిలు రోజు మాదిరిగానే తన క్లినిక్‌కు వచ్చారు. అకస్మాత్తుగా తన ప్యాంటు జేబులో నుంచి పొగలు రావడంతో గమనించి అప్రమత్తమయ్యారు. ఈలోపే జేబులో ఉన్న సెల్ ఫోన్ ఒక్కసారిగా పేలి పూర్తిగా ధ్వంసమై జేబు కాలిపోయింది. ఈ ప్రమాదంలో సదరు వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు

Viral Video: రెండుగా విడిపోయిన అహ్మదాబాద్ - ముంబై డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్‌, గోతంగం యార్డ్ సమీపంలో ఘటన, వీడియో వైరల్

Arun Charagonda

అహ్మదాబాద్-ముంబై డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌ భోగిలు రెండుగా విడిపోయాయి. కప్లర్ లోపం కారణంగా సూరత్ సమీపంలో విడిపోయినట్లు తెలుస్తోంది. దీంతో వెనుక ముందు బోగీలను ఫ్లాట్‌ఫామ్‌కి తరలించారు. ఇవాళ ఉదయం 8:50 గంటలకు వడోదర డివిజన్‌లోని గోతంగం యార్డ్ సమీపంలో ఈ సంఘటన జరిగింది.

Telangana Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, ఆటోని ఢీకొట్టిన భారీ ఐరన్ లోడ్‌ లారీ, ఒకరు మృతి, మరో 5 మందికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండల పరిధిలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూల్ నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న రాజస్థాన్ భారీ ఐరన్ లోడ్‌ ట్రాలీ ఆటోని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 5 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Weight Loss Story: అద్భుతం.. 610 కేజీల నుండి 63 కేజీలకు, కేవలం ఆరునెలల్లో 540 కిలోలు తగ్గిన ప్రపంచంలోనే అత్యంత బరువైన వ్యక్తి

Hazarath Reddy

ప్రపంచంలోనే అత్యంత బరువైన వ్యక్తిగా గుర్తింపు పొందిన సౌదీ అరేబియాకు చెందిన ఖలీద్‌ బిన్‌ మోహ్‌సేన్‌ షరీ సుమారు 610 కిలోల బరువు నుండి ఇప్పుడు 63.5 కేజీలకు తగ్గాడు. అత్యంత భారీ కాయంతో బరువు కారణంగా మూడేండ్లకు పైగా ఖలీద్‌ మంచానికే పరిమితమయ్యాడు. అతని ఆరోగ్యం రోజురోజుకు క్షీణించడం, వైద్యానికి ఖర్చు ఎక్కువ కావడంతో దానిని భరించలేకపోయాడు.

Vivek Ramaswamy on Bangladesh Hindus Attack: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఖండించిన వివేక్ రామస్వామి, హిందువులే టార్గెట్‌గా దాడులు చేస్తున్నారని మండిపాటు,

Arun Charagonda

రిజర్వేషన్లు తెచ్చిన తంటాతో దేశం విడిచిపారిపోయారు బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా. ఆ దేశ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు విద్యార్థుల ఆందోళనలకు కారణం కాగా వందలాది మంచి చనిపోయారు. ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినా బంగ్లాలో దాడులు మాత్రం ఆగడం లేదు. ప్రధానంగా ఆ దేశంలో ఉంటున్న హిందువులే టార్గెట్‌గా దాడులు జరుగుతున్నాయి.

New ED Director: ఈడీ కొత్త బాస్‌గా రాహుల్‌ నవీన్‌, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పదవిలో కొనసాగనున్న 1993 బ్యాచ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి

Hazarath Reddy

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తాత్కాలిక చీఫ్‌గా ఉన్న రాహుల్‌ నవీన్‌ పూర్తిస్థాయి డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు క్యాబినెట్‌ నియామకాల కమిటీ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1993 బ్యాచ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి అయిన నవీన్‌ ఈడీ డైరెక్టర్‌గా రెండేండ్లు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఏది ముందైతే అప్పటివరకు పదవిలో కొనసాగుతారు.

Jagan's Disproportionate Assets Case: జగన్ అక్రమాస్తుల కేసు, విచారణ నుండి తప్పుకున్న సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సంజయ్ కుమార్

Hazarath Reddy

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారతి సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్, విజయసాయి రెడ్డిలకు వ్యతిరేకంగా ఈడీ దాఖలు చేసిన కేసు విచారణ నుండి సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్ తప్పుకున్నారు.

Advertisement

CM Chandrababu: 2019-2024 మధ్య ఒక విధ్వంస పాలన జరిగింది, గత ఐదేళ్లలో దెబ్బతిన్న ఏపీ బ్రాండ్‌ను తిరిగి తెస్తామని తెలిపిన చంద్రబాబు

Hazarath Reddy

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో మువ్వన్నెల జెండాను ఎగురవేశారు.

Anand Mahindra: తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ ఛైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా, ఉత్తర్వులు జారీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి

Arun Charagonda

తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్‌ గవర్నర్స్ చైర్‌ పర్సన్‌గా ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూపు సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రాను సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికా నుండి తిరిగి వచ్చిన సీఎం రేవంత్...ఆనంద్ మహీంద్రా నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు

CM Revanth Reddy: గొల్కోండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, పెద్దన్నగా చెబుతున్న నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ

Arun Charagonda

దేశానికి కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలను మరువలేమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ గోల్కొండ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు రేవంత్.

Mpox Outbreak in Africa: ఆఫ్రికాలోని 13 దేశాల్లో ఎంపాక్స్‌ కల్లోలం, హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర దేశాలకు పొంచి ఉన్న ముప్పు

Hazarath Reddy

ఆఫ్రికాలోని 13 దేశాల్లో ఎంపాక్స్‌ మహమ్మారి విజృంభిస్తోంది. ఇందులో 96శాతానికిపైగా కేసులు ఒక్క కాంగోలో మాత్రమే గుర్తించారు. ఇక కొత్తగా వెలుగులోకి వచ్చిన వేరియంట్‌ మరణాల రేటు సుమారు 3-4శాతం ఉంటున్నది. ఆ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంపాక్స్‌ను హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించింది. గత రెండేళ్లలో ఎంపాక్స్‌ను హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించడం ఇది రెండోసారి.

Advertisement
Advertisement