Newdelhi, April 1: 2023-2024 ఆర్థిక సంవత్సరం మొదటి రోజు కేంద్ర ప్రభుత్వం (Central Government) గ్యాస్ (Gas) ధరలపై గుడ్‌న్యూస్ (Good news) చెప్పింది. గత కొంతకాలంగా పెరుగుతూ వస్తున్న ఎల్‌పీజీ (LPG) గ్యాస్ సిలిండర్ల ధరలను సవరించి తగ్గించింది. ఏప్రిల్ 1వ తేదీన వంట గ్యాస్ (Cooking Gas) ధరలు రూ.91.50 తగ్గించింది. అయితే, రేట్ల తగ్గింపు కేవలం వాణిజ్య గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు మాత్రమే. దేశీయ ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారుల మాత్రం ఎలాంటి ఉపశమనం లేదు.. కాగా, 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ల ధరలు గత నెలలోనే పెంచింది ప్రభుత్వం.. గత నెలలో, కేంద్రం దేశీయ వంట గ్యాస్ ధరలను రూ.50 పెంచిన విషయం విదితమే. ముఖ్యంగా, మార్చిలో ప్రభుత్వం వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను రూ.350 పెంచింది.. ఇప్పుడు రూ.91.50 తగ్గించింది.
Big relief for #LPG users as rates of 19 Kg cylinder has been reduced by Rs 92 today onwards#lpgcylinder
Check revised rates in your cities:https://t.co/iwyIIXakmK
— Zee News English (@ZeeNewsEnglish) April 1, 2023
తాజాగా సవరించిన రేట్ల తర్వాత ఇండేన్ గ్యాస్ సిలిండర్ ధరలు (19 కిలోల సిలిండర్): ఢిల్లీలో రూ.2028గా, కోల్‌కతాలో రూ.2132గా, ముంబైలో రూ.1980గా.. చెన్నైలో రూ.2192.50గా ఉంది.. ఇక, 14 కిలోల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను ఓసారి పరిశీలిస్తే.. శ్రీనగర్‌లో రూ.1,219, ఢిల్లీలో రూ.1,103, పాట్నాలో రూ.1,202, లేహ్‌లో రూ.1,340, ఐజ్వాల్‌లో రూ.1255, అండమాన్‌లో రూ.1179, అహ్మదాబాద్‌లో రూ.1110, భోపాల్‌లో రూ.1118.5, జైపూర్‌లో రూ. 1116.5, బెంగళూరులో రూ. 1115.5, ముంబైలో రూ. 1112.5, కన్యాకుమారిలో రూ.1187, రాంచీలో రూ.1160.5, సిమ్లాలో రూ.1147.5, దిబ్రూగర్‌లో రూ.1145, లక్నోలో రూ.1140.5. ఉదయపూర్‌లో రూ.1132.5, ఇండోర్‌లో రూ.1131, కోల్‌కతాలో రూ.1129, డెహ్రాడూన్‌లో రూ.1122, విశాఖపట్నంలో రూ.1111, చెన్నైలో రూ. 1118.5, ఆగ్రాలో రూ. 1115.5, చండీగఢ్‌లో రూ. 1112.5గా ఉన్నాయి.