Rape image (Pic Credit- PTI)

Patna, August 22:  బీహార్‌లోని బక్సర్‌ జిల్లాలో దారుణ సంఘటన (13-year-old girl gang-raped by six men) చోటు చేసుకుంది. బాలికను కిడ్నాప్‌ చేసి ఆరుగురు వ్యక్తులు నాలుగు రోజులపాటు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో చివరకు రైల్వే స్టేషన్‌ (railway station in Buxar) వద్ద వదిలి వెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మురార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలిక ఆగస్ట్‌ 16న వస్తువుల కొనుగోలుకు ఇంటి నుంచి బయటకు వచ్చింది.

నలుగురు వ్యక్తులు ఆమెను కిడ్నాప్‌ చేశారు. పాట్నాలో ఇద్దరు వ్యక్తులు అద్దెకు ఉంటున్న ఇంటికి ఆమెను తీసుకెళ్లి నిర్బంధించారు. అక్కడ ఆ బాలికపై నాలుగు రోజులపాటు ఆరుగురు కలిసి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. మరోవైపు బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతికి చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఆ బాలిక ఆరోగ్యం క్షీణించడంతో ఆ వ్యక్తులు ఈ నెల 19న డుమ్రాన్ రైల్వే స్టేషన్ వద్ద ఆమెను వదిలి వెళ్లిపోయారు.

భర్త గొడవ పడుతున్నాడని కిరోసిన్ పోసి నిప్పంటించిన భార్య, రక్షించాలంటూ కేకలు వేయడంతో కంగారుపడి మంటలను ఆర్పివేసిన నిందితురాలు

దీంతో ఆ బాలిక అతికష్టం మీద ఇంటికి చేరుకుని జరిగిన దారుణాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. వారంతా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు శివమ్ సింగ్, సచిన్ సింగ్ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు. గుర్తించిన మిగతా నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.