Bihar Shocker: నాలుగు రాష్ట్రాలు, ఆరు మంది యువతులను పెళ్లి చేసుకుని కుమ్ముడే కమ్ముడు, చివరకు బామర్ది చేతికి చిక్కాడు, బీహార్‌లో అంతరాష్ట్ర పెళ్లికొడుకు లీలలు వెలుగులోకి..
Representational Image

Patna, Nov 30: బీహార్‌లో ఆరు పెళ్లిళ్లు చేసుకున్న అంతరాష్ట్ర పెళ్లికొడుకు (Man Having Six Wives) తన బామర్దికి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. పోలీసుల విచారణలో దిమ్మతిరిగే నిజాలను వెల్లడించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బర్హత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జవతారి గ్రామానికి చెందిన చోటూ కుమార్‌ ఒక ఆర్కెస్ట్రా బృందంలో గాయకుడిగా పనిచేస్తున్నాడు. అతను నాలుగు రాష్ట్రాల్ (Across Four States)లో కచేరీల సందర్భంగా పరిచయమైన ఆరుగురు మహిళలను అతడు పెళ్లాడాడు. వారితో సంసారం చేసి పిల్లల్ని కూడా కన్నాడు.

ఓ రోజు కోల్‌కతాకు వెళ్లేందుకు జముయి రైల్వే స్టేషన్‌ లో ( Brother-in-Law at Jamui Railway Station) రెండో భార్య తమ్ముడు ఉండగా బావ వేరే మహిళతో ఉండటం చూశాడు. వెంటనే అతడ్ని పట్టుకుని తన కుటుంబ సభ్యులను పిలిపించాడు. దీంతో వారంతా కలిసి చోటూను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. 2018లో తన కుమార్తె మంజూను చోటూ పెళ్లి చేసుకున్నాడని ఆమె తల్లి కోబియా దేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

చదివేది 8 వ తరగతి, బ్యాగ్ నిండా కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు, బెంగుళూరు స్కూల్ తనిఖీల్లో విస్తుపోయిన అధికారులు

వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపింది. ఏడాదిన్నర కిందట మందులు తీసుకువస్తానని చెప్పి బయటకు వెళ్లిన చోటూ ఇంటికి తిరిగి రాలేదని ఆమె ఆరోపించింది. జార్ఖండ్‌ రాజధాని రాంచీకి చెందిన కళావతి దేవిని అతడు మొదటి పెళ్లి చేసుకున్నాడని, వారికి నలుగురు పిల్లలున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో చోటూను పోలీసులు ప్రశ్నించగా నాలుగు రాష్ట్రాలకు చెందిన ఆరుగురు మహిళలను పెళ్లి చేసుకున్నట్లు అతడు చెప్పాడు.

బీహార్‌లో దారుణం, 70 ఏళ్ల వృద్ధుడిని సెక్స్ కోసం రూంలోకి రమ్మంది, తన నలుగురు ప్రియులతో కలిసి దారుణంగా చంపేసింది, నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

బీహార్‌లోని చిన్వారియా, సుందర్‌కండ్ ప్రాంతాలకు చెందిన మహిళలతోపాటు జార్ఖండ్‌లోని రాంచీ, డియోఘడ్‌లో ఒక్కో మహిళను, మహారాష్ట్రలోని సంగ్రామ్‌పూర్ గ్రామానికి చెందిన ఒక మహిళను, ఢిల్లీకి చెందిన మరో మహిళను అతడు పెళ్లి చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. అందరి భార్యలతో పిల్లలను కలిగి ఉన్నట్లు చెప్పారు. రెండో భార్య మంజూ కుటుంబ సభ్యులు మాత్రమే ప్రస్తుతం ఫిర్యాదు చేశారని అన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.