Kid Testing Corona (photo-PTI)

6-Month-Old Baby in Kolkata Tests Positive for COVID-19: దేశంలో కరోనా కొత్త వేరియంట్‌ జెఎన్‌ 1 కేసుల విజృంభణ కొనసాగుతోంది. తాజాగా ఆరు నెలల పాపకు కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయిన ఘటన కోల్‌కతాలో చోటు చేసుకుంది. అక్కడ ఆరు నెలల పసికందుకు పాపకు కరోన పాజిటివ్‌ రావడం వైద్యులను మరింత కలవరపాటుకు గురిచేసింది.

అక్కడ ఓ ఆరు నెలల పాపతో సహా ముగ్గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్‌ (Coronavirus in India) వచ్చినట్లు ఆరోగ్య అధికారులు వెల్లడించారు. బీహార్‌కు చెందిన ఆ చిన్నారి (6-Month-Old Baby in Kolkata Tests Positive for COVID-19కోల్‌కతాలోని మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌ చికిత్స పొందుతుండగా, మిగతా వారు వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే వారందరికి వచ్చింది కరోనా కొత్త వేరియంట్‌ జెఎన్‌ 1? కాదా? అనేది తెలియాల్సి ఉంది.దీన్ని ఆర్టీపీసీఆర్‌ పరీక్షల ద్వారా నిర్థారిస్తున్నారు.

దేశంలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా, మొత్తం 10 రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు, ఒక్క కేరళలోనే 2,669 కేసులు నమోదు, తాజాగా 328 కొత్త కేసులు

ఈ ఘటనతో వైద్యులు కేసులను కుణ్ణంగా స్టడీ చేస్తున్నారు. అక్కడ రాష్ట్ర ఆరోగ్య శాఖ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఇన్‌ఫ్లుఎంజా అనారోగ్యం(ILI)కి సంబంధించిన శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌లపై ప్రత్యేక దృష్టిసారించింది. అంతేగాక పశ్చిమబెంగాల్‌ ఆరోగ్య అధికారుల ఈ కొత్త వేరియంట్‌ కేసులపై గట్ట నిఘా పెట్టడమే గాక నివారించేలా కట్లుదిట్టమైన చర్యలు కూడా తీసుకుంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కలవరం, ఏపీలో రెండు, తెలంగాణలో ఆరు కేసులు నమోదు, హైదరాబాద్‌లో ఇద్దరు చిన్నారులకు కోవిడ్

వీరు అధిక జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. RT-PCR చేయించుకున్న తరువాత COVID-19 కు పాజిటివ్ గా నిర్థారణ అయిందని ప్రైవేట్ ఆసుపత్రి అధికారి తెలిపారు.దీనిపై నిఘా ఉంచామని పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ఇన్‌ఫ్లుఎంజా లాంటి అనారోగ్యం (ఐఎల్‌ఐ), తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్స్ (ఎస్‌ఆర్‌ఐ) కేసులపై రాష్ట్ర ఆరోగ్య శాఖ నిశితంగా నిఘా ఉంచుతుందని ఆయన అన్నారు. బుధవారం, పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ మరియు ఇతర రాష్ట్రాలు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖతో COVID-19 సమీక్ష సమావేశంలో పాల్గొన్నాయి.