దేశంలో కరోనా కేసుల సంఖ్య 2,997కు చేరింది. ఒక్క కేరళలోనే 2,669 కేసులు నమోదు కావడం గమనార్హం. కరోనా బారిన పడి కేరళలో ఒక వ్యక్తి మృతి చెందాడు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,33,328కు చేరింది. బిహార్‌లో మొదటిసారి రెండు కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి.
బిహార్‌లో నమోదైన కేసులతో దేశంలో మొత్తం 10 రాష్ట్రాల్లో కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్, బిహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పుదుచ్చేరిలలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కేరళలో కరోనా వేరియంట్ జేఎన్1 విజృంభిస్తోంది. తాజాగా దేశంలో గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకూ 24 గంటల వ్యవధిలో 328 కొత్త కేసులు బయటపడ్డాయి. తాజా కేసుల్లో అత్యధికంగా 265 కేసులు ఒక్క కేరళలోనే వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరగడానికి కొత్త వేరియంట్ (New Covid Variant) జేఎన్.1 కారణమని తెలుస్తోంది.