New Delhi, Dec 25: దేశాన్ని కరోనా వైరస్ మరోసారి కలవరపెడుతోంది.తాజాగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగు వేలకు పెరిగింది. కరోనా ఉప వేరియంట్ JN.1 కారణంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. సోమవారం నాటికి 4054 కోవిడ్ యాక్టివ్ కేసులు (Active Caseload at 4,054) నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 128 కొత్త కేసులు కేరళలో నమోదయ్యామని కేంద్ర వైద్య శాఖ పేర్కొంది. ఆదివారం దేశ వ్యాప్తంగా 656 కరోనా కేసులు (India Records 628 Fresh Cases in 24 Hours) నమోదయ్యాయి. ఒకరు చనిపోయారు. అంతకుముందు రోజు శనివారం 752 కేసులు నమోదయ్యాయి.
24 గంటలల్లో కేరళతో కలుపుకొని దేశవ్యాప్తంగా మరో 334 కొత్త కేసులు నమోదు కావటంతో కోవిడ్ కేసుల సంఖ్య నాలుగు వేలకు చేరుకుంది. కేరళలో కోవిడ్‌తో ఒకరు మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 296 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4,50,09,248 (4.50 కోట్లు). వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,44,71,860 (4.44 కోట్లు). జాతీయ రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది.
మహారాష్ట్రలోని థానేలో నవంబర్ 30 నుంచి పరీక్షించిన 20 నమూనాలలో ఐదు JN.1 కేసులు నమోదైనట్లు ఒక అధికారి తెలిపారు. వారిలో ఒక మహిళ కూడా ఉంది. అయితే వారెవరూ కూడా ఆసుపత్రిలో చేరలేదు. ప్రస్తుతం థానేలో యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 28కు చేరుకుంది. వారిలో ఇద్దరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారు ఇళ్లలోనే కోలుకుంటున్నారని ఓ అధికారి తెలిపారు.
మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ధనుంజయ్ ముండేకు కొవిడ్ సోనినట్లు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తెలిపారు. అయితే వైరస్ ఇన్‌ఫెక్షన్ గురించి ఎవరూ భయపడనవసరం లేదని పవార్ అన్నారు.
‘నా క్యాబినెట్ సహచరుడు ధనుంజయ్ ముండేకు కొవిడ్ పాజటివ్ వచ్చింది. నాగ్‌పూర్‌లో జరిగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజు ముండేకు కొవిడ్ నిర్ధారణ అయింది. రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం’ అని పవార్ తెలిపారు. ‘కొవిడ్ నిర్ధారణ అయిన వెంటనే మంత్రి హోం ఐసోలేషన్‌కు వెళ్లి చికిత్స తీసుకున్నారు. ఇప్పుడు ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవు. ఇంట్లో నుంచి ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లలో పాల్గొంటున్నారు. అయితే మంత్రి ఆఫీసు సిబ్బందిలో కొందరు అనారోగ్యం పాలయినప్పటికీ వారికి కొవిడ్ లక్షణాలు లేవు’ అని మంత్రి కార్యాలయ అధికారి ఒకరు తెలిపారు.