Manish Sisodia. (Photo Credits: PTI)

New Delhi, August 22: లిక్క‌ర్ పాల‌సీ అక్ర‌మాల నేప‌థ్యంలో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా నివాసం పై సీబీఐ దర్యాప్తు సంస్థ దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఆయన అధికారిక నివాసంలో ఎలాంటి అధారాలు దొరకకపోవడంతో లుక్‌ ఔట్‌ నోటీసులు జారీ చేసి ఇబ్బందులకు గురి చేసింది. అయితే ఇవాళ సిసోడియా త‌న ట్విట్ట‌ర్‌లో ఓ కామెంట్ చేశారు.

ఆమ్ ఆద్మీ పార్టీని వ‌దిలేసి.. బీజేపీలో చేరితే (Close All Cases If He Joins Their Party) అప్పుడు త‌న‌పై ఉన్న అన్ని కేసులను ఆ పార్టీ మూసివేస్తుంద‌ని సిసోడియా తెలిపారు. దీనికి సంబంధించిన మెసేజ్ త‌న‌కు వ‌చ్చిన‌ట్లు ఆయ‌న (Delhi Deputy CM Manish Sisodia) వెల్ల‌డించారు.

బీజేపీ నుంచి త‌న‌కు ఓ మెసేజ్ ( BJP Approached Him with an Offer) వ‌చ్చింద‌ని, ఆప్‌ను బ్రేక్ చేసి, బీజేపీలో చేరాల‌ని ఆ మెసేజ్‌లో ఉంద‌ని, మీపై ఉన్న అన్ని సీబీఐ, ఈడీ కేసుల‌ను తొల‌గిస్తామ‌ని ఆ మెసేజ్‌లో పేర్కొన్న‌ట్లు సిసోడియా త‌న ట్వీట్‌లో తెలిపారు. త‌న‌పై అన్ని త‌ప్పుడు కేసులు (Delhi Liquor Scam Case) బ‌నాయించార‌ని, మీకు కావాల్సింది మీరు చేసుకోవాల‌ని బీజేపికి ఆయ‌న హెచ్చ‌రిక జారీ చేశారు.

Here's Manish Sisodia Tweet

తాను రాజ్‌పుత్‌నని, మహారాణా ప్రతాప్‌ వంశస్థుడునని కావాలంటే త‌న తల న‌రుక్కుంటాను కానీ, అవినీతి నేత‌ల‌కు లొంగిపోన‌ని, త‌న‌పై ఉన్న కేసుల‌న్నీ అక్ర‌మైన‌వ‌ని సిసోడియా త‌న ట్వీట్‌లో తెలిపారు.

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై ట్రావెల్ బ్యాన్, లుకౌట్ నోటీసు జారీ చేసిన కేంద్రం, నేను ఎక్కడున్నానో తెలియదా మోదీ? అంటూ ఫైరయిన సిసోడియా

ఒక పక్క దేశంలో ప్రజలు ద్రవ్యోల్బణం, ఆకాశన్నంటుతున్న ధరలతో బాధపడుతుంటే రాష్ట్రాలలోని ప్రభుత్వాలను పడగొట్టే పనులుకు పాల్పడుతోంది బీజేపీ అని ఎద్దేవా చేశారు. బీజేపీ నేతృత్వంలో సీబీఐ దుర్వినియోగం అవుతోందంటూ విరుచుకుపడ్డారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కి, ప్రధాని నరేంద్ర మోదీకి మధ్య పోటీ జరుగుతుందని అన్నారు. ఢిల్లీ నాయకుడుని అడ్డుకునేందుకు బీజేపీ కేంద్ర ఏజెన్సీలను ఇలా దుర్వినియోగం చేస్తోందంటూ మండిపడ్డారు.

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా ఇంట సీబీఐ రైడ్స్‌.. మండిపడ్డ కేజ్రీవాల్

సిసోడియా ట్వీట్‌ను బీజేపీ నేత మ‌నోజ్ తివారీ ఖండించారు. అవినీతిలో ఇరుక్కున్న సిసోడియా క‌ట్టు క‌థ‌లు చెబుతున్నార‌ని తివారీ ఆరోపించారు.