Murder (Photo Credits: Pixabay)

New Delhi, August 25: ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. తన సోదరుడిని హత్య చేశారన్న కోపంతో శత్రువుపై ప్రతీకారం తీర్చుకునేందుకు వెళ్లిన ఒక వ్యక్తి మృతి (Man Beaten to Death) చెందాడు. ఈ ఘటన ఆగస్టు 13న ఢిల్లీలోని తిమార్‌పూర్‌ ప్రాంతంలో చోటు చేసుకుంది.బాధితుడుని సునీల్‌ గున్నిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ (On Camera Viral Video) కావడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

ఢిల్లీ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....ఆగస్టు 12న సునీల్‌ అనే వ్యక్తి సోదరుడుని కొంతమంది వ్యక్తులు చంపారని ఢిల్లీ పోలీస్‌ నార్త్‌ డిప్యూటి కమిషనర్‌ సాగర్‌ సింగ్‌ కల్సి తెలిపారు. ఆ తర్వాత రోజు సునీల్‌ తన సోదరుడిని చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవడానికి వెళ్లి రాహుల్‌, అజయ్‌, ముఖేష్‌ అతని సహచరుల చేతిలో హత్యకు గురయ్యాడు. తొలుత సునీల్‌ రాహుల్‌, అజయ్‌, ముఖేష్‌ వారి సహచరుల మధ్య గొడవ జరిగిందని చెప్పారు. ఆ తర్వాత వారంతా సునీల్‌ని దారుణంగా కొట్టి పరారయ్యినట్లు తెలిపారు. తీవ్ర గాయాలపాలైన సునీల్‌ని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదేం ట్విస్టు బాబోయ్.. నిద్రలో మేకను కోస్తున్నట్లుగా కలగంటూ అవి కోసేసుకున్నాడు, పురుషాంగం తెగి చేతిలో పడటంతో లబోదిబో మంటూ ఆస్పత్రికి పరుగులు

వాస్తవానికి సునీల్‌ తన సోదరుడిని చంపారన్న కోపంతో నిందితులపై దాడి చేసేందుకు కొడవలితో వెళ్లాడని అన్నారు. ఐతే వారంతా సునీల్‌ వద్ద నుంచి కొడవలిని లాక్కుని, కర్రలు, రాడ్లతో దాడి చేశారని పోలీసులు తెలిపారు.